
ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు అమ్ముడయ్యాయని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించించింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అనేది.. మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత పనికి నిదర్శనం. కస్టమర్లు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఎల్ఐసీ పేర్కొంది. జనవరి 20న 'మ్యాడ్ మిలియన్ డే' నాడు ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎల్ఐసీ ఎండీ & సీఈఓ సిద్ధార్థ మొహంతి చేపట్టిన చొరవకు నిదర్శనమే ఈ రికార్డు అని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సీఈఓ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. 'మ్యాడ్ మిలియన్ డే'ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
Life Insurance Corporation of India Achieves GUINNESS WORLD RECORDS™️. Most Life Insurance Policies Sold In 24 Hours.#LIC #LICInsurancePolicy #GuinnessWorldRecord pic.twitter.com/WRTwZ7UtLt
— LIC India Forever (@LICIndiaForever) May 24, 2025