
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్(KTR)ను మించిన వారే లేరని కౌంటర్ ఇచ్చారామె.
శనివారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే. సిస్టర్ స్ట్రోక్(Sister Stroke)తో కేటీఆర్ చిన్న మెదడు చిట్లింది. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు ఎందుకు?. అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్ నడుస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు’’ అని అన్నారామె.
అటవీ అధికారులు ప్రజలకు సహకరించాలి
అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ భేటీలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఓ మార్గం చూపిస్తాం. అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు మానవీయ కోణంలో సహకరించాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి’’ అని అన్నారామె.
ఇదీ చదవండి: కవితకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్!
