
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు.
