Kurnool
-
బెస్తలకు రాజకీయగుర్తింపు ఇవ్వాలి
కర్నూలు(అర్బన్): బెస్తలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర కోకన్వీనర్ టి.సాయిప్రదీప్ కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్ సమీపంలోని డాక్టర్ బ్రాహ్మారెడ్డి ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో బెస్త ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముందుగా భగవాన్ శ్రీ వ్యాస మహర్శి చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రదీప్ మాట్లాడుతూ బెస్తలు రాజకీయ పదవులకు నోచుకోవడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన రాజ్యాంగపరమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయినా, కనీసం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లోనూ బెస్తలకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. త్వరలో ప్రకటించనున్న మార్కెట్‌యార్డు, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఇతర పదవుల్లో బెస్తలను నియమించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్‌రావు, ఉదయ్, పీజీ వెంకటేష్, ఆనంద్‌రాజు, జయన్న, ఎద్దుల వెంకటేశ్వర్లు, గ్యాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సీఐపై దాడి కేసులో ఏడుగురికి జైలు, జరిమానా
కర్నూలు: స్థానిక బంగారుపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ పార్థసారధిరెడ్డిపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2021 నవంబర్ 30న అక్రమ కట్టడాలను తొలగించేందుకు బందోబస్తుగా అప్పటి రెండో పట్టణ సీఐ పార్థసారధిరెడ్డి, కోడుమూరు సీఐ శ్రీధర్ సిబ్బందితో బంగారుపేటలోకి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తుండగా కొంతమంది రాళ్లతో పోలీసులపై దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స అనంతరం టూటౌన్లో ఫిర్యాదు చేశారు. బంగారుపేటకు చెందిన లక్ష్మి, నీలిషికారి బెల్కీ, ఎన్.నరసింహులు, నీలిషికారి సుగుణ, ప్రసాద్, నీలి షికారి నాగమణి, నీలిషికారి బెగినిలపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో కర్నూలు (టౌన్): ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పోను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా, బొగ్గు ల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్‌బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై.రామ య్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారన్నారు. ప్రాపర్టీ షోలో 60 మంది బిల్డ ర్లు, నిర్మాణ వస్తువుల సరఫరాదారులు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొంటారన్నారు. ప్రధాన స్పాన్సర్‌గా రాగమయూరి బిల్డర్స్, కో స్పాన్సర్‌గా స్కందాన్షి ఇన్ ఫ్రా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆటో పెవిలియన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, క్రెడాయ్ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, ఇతర క్రెడాయ్ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● 16 మోటార్ బైక్‌లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: గత కొంత కాలంగా మోటార్ బైక్‌ల దొంగతనమే తన ప్రవృత్తిగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి 16 మోటార్ బైక్‌లను రికవరీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ అవరణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్‌రెడ్డి వివరాలు వెల్లడింఆచరు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించినట్లు చెప్పారు. సి.బెళగల్ మండలం పొలకల్ బీసీ కాలనీకి చెందిన ఉప్పరి వీరేష్, అదే గ్రామానికి చెందిన వర్థన్ అలియాస్ ఇక్బాల్, కోడుమూరుకు చెందిన అబ్దుల్ కలామ్ అలియాస్ మచ్చాలు ముఠాగా ఏర్పడి మోటార్ బైక్‌ల చోరీలకు చేయటం మొదలు పెట్టినట్లు చెప్పారు. మీరి ముగ్గురిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 11 , కర్నూల్ –2 టౌన్లో 2, కర్నూల్ తాలూకా స్టేషన్లో 1, సి. బెళగల్ స్టేషన్లో 1, కర్నాటక రాష్ట్రం బళ్లారి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 1 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. ఏ1 నిందితుడు ఉప్పర వీరేష్ పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్ ఉప్పర కాలనీ కొట్టాల దగ్గర అనుమాన్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో వెళ్లి పట్టుకొన్నట్లు చెప్పారు. విచారణలో మోటార్ బైక్‌లను దొంగతనం చేసినట్లు అంగీకరించటంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. బైక్‌ల కేసులో ఇప్పటికే కోడుమూరుకు చెందిన అబ్దుల్‌కలాం అలియాస్ మచ్చా కర్నూల్ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని, మరో నిందితుడు సి. బెళగల్ వర్థన్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన 16 మోటార్ బైక్‌ల విలువ రూ. 16.50 లక్షలు ఉంటుందని తెలిపారు. -
వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింపర్సనల్ లా బోర్డు రాష్ట్ర కన్వీనర్ రఫిక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏక్యాంపులోని ఎంఎంఐ షాదీఖానాలో సయ్యద్ జాకీర్ మౌలానా రషీద్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు, న్యాయవాది సుబ్బయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్ఎండీ షరీఫ్, మైనార్టీ నాయకుడు షేక్ హఫీజ్, ఇలియాజ్, సమాచారహక్కు నాయకులు జయన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కిరణ్, కాంగ్రెస్ మీడియా ఇన్చార్జ్ అమానుఉల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫిక్ అహ్మద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25 మానవహారం, 27న ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని, జూన్ 3న మహిళలతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
ముందే వచ్చిన వర్షాకాలం!
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● గూడూరులో 49.2 మిమీ వర్షపాతం నమోదు ● తగ్గిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ సారి వానాకాలం ముందే వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. గూడూరులో అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 47.6, కల్లూరులో 38.8, హొళగుందలో 19.4, గోనెగండ్లలో 16.4, సీ.బెళగల్లో 13.4, కౌతాళంలో 12.6, ఓర్వకల్లులో 12.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలకు సంబంధించి 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 27.2 మి.మీ ఉండగా... 77.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హంద్రీకి ఒక మోస్తరుగా నీరు వచ్చింది. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గరిష్టంగా 36 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 17 వేల క్యూసెక్కుల వరదనీరు సి.బెళగల్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో దాదాపు 17 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నది పూర్తి స్థాయిలో రెండు దడులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదికి జలకళ సంతరించుకుంది. కాగా మండల పరిధిలోని తుంగభద్ర తీర ప్రాంత గ్రామాల్లో రైతులు ముందస్తు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్డీఎస్ జళకళ కోసిగి: మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై తుంగభద్ర నది జళకళ సంతరించుకుంది. మండలంతో పాటు నదితీర పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వర్షపు నీరు నదికి చేరుకున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టపై రెండు అడుగుల మేర ఎత్తులో ఎక్కి దిగువ ప్రాంతం కర్నూలు వైపు ప్రవహిస్తోంది. ముందస్తు వర్షాలు కురిసి నది పుష్కలంగా ప్రవహించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నాటుసారా స్వాధీనం
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తన సిబ్బందితో కాల్వ గ్రామ సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబాయి తండాకు చెందిన మాలవత్ ధను నాయక్ ద్విచక్ర వాహనంపై 40 లీటర్ల సారా తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, 40 లీటర్ల సారాను వదిలేసి పారిపోయారు. సారాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి ధను నాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. గుమ్మితం తండాలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపి వార్తే వీరాంజనేయ నాయక్ వద్ద 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ నవీన్‌బాబు, కానిస్టేబుళ్లు మురహరిరాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వినిపిస్తుందో లేదో మిషన్ నిర్ధారిస్తుంది
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో చెవుడు...మూగ సమస్యతో బాధపడుతుంటారు కొందరు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడియోమెట్రి పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఇప్పటివరకు ఈ యంత్రాన్ని అమరిస్తే వినిపిస్తుందా లేదా అని రోగి సంజ్ఞలు చేస్తే దానిని బట్టి నివేదికలు ఇచ్చేవారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు ఎలాంటి సమస్య లేకపోయినా ఉన్నట్లు నటించి వికలాంగ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. ఇలాంటి వాటిని చెక్‌పెట్టేందుకు ఇప్పుడు బేరా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టీ విభాగం ఓపీ వద్ద ఏర్పాటు చేసిన బేరా పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ హెచ్‌వోడి డాక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ బేరా పరీక్ష ద్వారా రోగికి వినిపిస్తుందా లేదా అన్నది మిషనే నిర్ధారిస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో పాటు వినికిడి లోపం, శ్రవణ నాడీ రుగ్మతలు, వినికిడిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత పరిస్థితులను నిర్ధారించడంలో ఈ బేరా టెస్ట్ మిషన్ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాలనాగాంజన్, ఈఎన్టి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ చిన్న లింగన్న, డాక్టర్ మమతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వర్షానికి కూలిన బ్రిడ్జి
కల్లూరు: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని గంజివాగు బ్రిడ్జి కూలిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మిపురం గ్రామంలోని గంజివాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గ్రామంలో పర్యటించారు. గంజివాగుపై కూలిన బ్రిడ్జితోపాటు గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. -
శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు. -
నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు
తుగ్గలి/మద్దికెర: నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర పోలీస్ స్టేషన్లను బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్ల పరిధిలోని పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యహరించాలని ఆదేశించారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటరామయ్య, రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్ఐలు మల్లికార్జున, కృష్ణమూర్తి, విజయ్‌కుమార్‌నాయక్, సిబ్బంది ఉన్నారు.వైద్య మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు ● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైద్య మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్‌కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్‌నగర్ సమీపంలోని పార్థగ్రాండ్లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్‌పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్‌లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా కోరారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తవ్వారు.. వదిలేశారు! ఆదోని అర్బన్: పట్టణంలోని బసాపురం రోడ్డు మార్కెట్‌యార్డు సమీపంలో చిన్న వర్షానికి పెద్దదిగా గుంత మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. గత నెలలో ఈ రోడ్డులో పైపులైన్ లీకేజీ అయ్యి గుంత తవ్వారు. ఆ గుంతను అసంపూర్తిగా పూడ్చారు. దీంతో ఆ రోడ్డులో మార్కెట్‌యార్డు, పత్తి పరిశ్రమలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల లారీ గుంతలో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్‌ను తీసుకొచ్చి బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రగతి.. వెనుక‘బడి’
ఆదోని సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నా పూర్తి చేయలేకపోయారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు ఇచ్చారు. అ యితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అదనపు తరగతి గదులను పనులు పూర్తి చేయలేకపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సర్కార్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయి. విద్యార్థులు నేలపైన సాగే చదువులకు స్వస్తి పలికారు. డిజిటల్ బాటలో చదివే బాట పట్టారు. ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ, ఎయిడెడ్, పురపాలక గురుకుల పాఠశాలలు మొత్తం 130 ఉన్నాయి. అయా పాఠశాలల్లో 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు– నేడులో భాగంగా గత ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణాల పనులను చేపట్టింది. ఒక్కోక్క గది నిర్మాణానికి రూ.12 లక్షలు చొప్పున 38 పాఠశాలల్లో 162 అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో పరుగులు పెట్టిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక అర్ధాంతరంగా నిలచిపోయాయి. దీంతో ఏమి చేయాలో తెలియక అయా పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదులల్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి విద్యను అందిస్తున్నారు. కొన్ని చోట్ల వరండాలోనూ, చెట్ల కింద విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇదీ దుస్థితి ● ఆదోని పట్టణంలోని అర్‌అర్ లేబర్ కాలనీలో పురపాలక ఉన్నత పాఠశాల, నెహ్రూ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ● కల్లుబావిలోని ప్రాథమిక పాఠశాల, డణాపురంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విరుపాపురం, పెద్దహరివాణం, పెద్దతుంబళం, అరెకల్లు వంటి పలు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. ● ఆదోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ● కిటికీలు, తలుపులు, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్ వంటి పనులను పూర్తి చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఒక్కపైసా కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న నాడు– నేడు అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆదోని పట్టణంలోని అర్‌అర్ లెబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో 960 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు గదులు ఉన్నాయి. నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అలాగే నెహ్రుమోమోరియల్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గదులు పూర్తిగాక అసంపూర్తిగా ఉండడంతో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కొంత డబ్బులు వెచ్చించి తరగతి గదులు కీటికీలు, తలుపులు ఫ్లోరింగ్ వంటి పనులను చేపట్టి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. నిధుల కోసం ఇండెంట్ పెట్టాం అదనపు తరగతి గదుల పనులు మధ్యలో ఆగిపోయాయి. చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గదుల నిర్మాణాలపై అధికారులకు ఇండెంట్ పెట్టాం. ఒక వేళ ప్రభుత్వం నిధులను విడుల చేస్తే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం. – శ్రీనివాసులు మండల విద్యాధికారి–2 ఆదోని అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం -
ప్రభుత్వ తీరు దారుణం
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇంటివద్దనే రేషన్ సరుకులు అందిస్తూ.. నిరుద్యోగులకు ఉపాధి అందిస్తూ ఉపయుక్తంగా ఉన్న ఎండీయూ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ఆపరేటర్లు, హెల్పర్లు అన్నారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కోపంతో తమ కడుపులు కొడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమకు జీవనాధారమైన ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లు అక్బర్‌వలి, కేశవ్, మహ్మద్‌రఫీ, వీరేష్, శీను, మద్దిలేటి మాట్లాడుతూ.. రేషన్ సరుకుల డెలివరీ కోసం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెలకు రూ.21 వేలు ఇచ్చేదని, ఇందులో రూ.3 వేలు బండి ఈఎంఐ పోను మిగిలిన రూ. 18 వేలలో రూ. 5 వేలు హెల్పర్‌కు, మరో రూ.3 వేలు పెట్రోలు, ఇతర నిర్వహణ చార్జీలకు ఖర్చు అయి రూ.10 వేలు మిగిలేదన్నారు. దానితో తాము ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకునే వారమని తెలిపారు. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తమతో ప్రభుత్వం చేసుకున్న గడువు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల్లో తమకు ఉపాధిని చూపాలన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్ల ధర్నా -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచేశాయి. 17 మండలాల్లో దాదాపు 2,400 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా.. 1,899 మంది రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు నష్టం జరిగిందని, క్వింటాకు రూ.7,300 ప్
బీటీ పత్తి విత్తనాలకు సొంత ధ్రువీకరణ ● కంపెనీల తీరుపై వ్యవసాయ శాఖ మీనమేషాలు ● కో–మార్కెటింగ్ పేరిట బీటీ పత్తి విత్తన వ్యాపారం ● సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్ల పేరుతో దందా ● తరచూ విత్తనం కారణంగా దెబ్బతింటున్న పంట ● గతంలో నిండా ముంచిన ‘కావేరి–జాదు’ ● బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు బ్లాక్ విక్రయాలుకర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. పంట దెబ్బతింటే దేవుడే దిక్కు! పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. బ్లాక్‌లో పత్తి విత్తనాలు ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. హెచ్‌టీ పత్తి సాగు ప్రమాదకరం పత్తిలో హెచ్‌టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్‌టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్‌టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్‌టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్‌టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది. బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది. కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్‌లో నిమగ్నమయ్యాయి. 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల ఐక్య వేదిక బుధవారం చేపట్టనున్న డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా పడింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్‌తో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఇతర ప్రతిపాదనలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు ఐక్య వేదిక నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ముట్టడి నిర్ణయాన్ని వాయిదా వేశామన్నారు. ఐఐటీ/నీట్ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/నీట్ అకాడమీల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ లేదా పాత హాల్‌టికెట్‌తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. వీరికి 50 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని, పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం http://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీసీఓ కోరారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https://apobmms.apcfss.in) వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కేజీబీవీల్లో మూడు విడతల్లో సీట్ల కేటాయింపు కర్నూలు సిటీ: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 6, 7, 8, 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు విడతల్లో సీట్లు కేటాయించినట్లు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఆయా కేజీబీవీల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు తెప్పించుకుని నిర్ధారించుకున్నారన్నారు. 6నుంచి 9వ తరగతి వరకు అన్ని సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్‌లో 73 సీట్లు, ఎంపీసీలో 191 సీట్లు, ఎంఈసీలో 18 సీట్లు, ఒకేషనల్ గ్రూప్‌లో 79 సీట్లు ఖాళీ ఉన్నట్లు డీఈఓ వెల్లడించారు. గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తేనే గోరుకల్లు రిజర్వాయర్‌లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్, డీఈఈలు జ్యోతి, గీతారాణి, శివప్రసాద్, ఏఈఈలు పాల్గొన్నారు. -
చిరుద్యోగుల ఆకలి కేకలు పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జల్లా అధ్యక్షుడు రంగస్వామి అఽధ్యక్షతన చేపట్టిన దీక్షను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, సీఐటీయూ న్యూసిటీ కార్యదర్శి సీహెచ్ సాయిబాబా, ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ ప్రారంభించారు. అంతకముందు డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరు తూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల ఆకలి కేకలను విస్మరిస్తోందన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ సెలవులను కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు పవన్‌కుమార్, కిరణ్, సురేష్, చిరంజీవి, కోశాధికారి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. 396 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు రెగ్యులర్ టెన్త్‌కు 603 మంది విద్యార్థులకుగాను 207 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 396 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 280 మందికిగాను 258 మంది హాజరుకాగా 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 152 మందికిగాను 127 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. -
రేషన్ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం
● జీవనోపాధి కోల్పోనున్న 409 మంది ఆపరేటర్లు, 409 మంది హెల్పర్లు ● మళ్లీ రేషన్ దుకాణాలకుక్యూ కట్టాల్సిన పరిస్థితి కర్నూలు(సెంట్రల్): గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలకు కూటమి సర్కార్ మంగళం పాడింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, ఇతర నిత్యావసరాలను ఇవ్వాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ప్రజలే రేషన్ షాపులను వెతుక్కుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లు భగ్గుమంటున్నారు. మళ్లీ రేషన్ దుకాణాల వద్ద పడిగాపులే.. కర్నూలు జిల్లాలో 6,34,631 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 12.65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో పేద, మధ్యతరగతి ప్రజలే అధికం. 2021 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలు సరుకులను పొందేవారు. అయితే కొన్ని గ్రామాల్లో షాపులు లేకపోవడం, పట్టణాల్లో కిలోమీటర్ల దూరంలో రేషన్ చౌకధరల దుకాణాలు ఉండడంతో సరుకుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అంతేకాక గంటల కొద్దీ వేచి చూడక తప్పని పరిస్థితి. డీలర్లు ఎప్పుడు వస్తే అప్పుడు సరుకులను తీసుకోవాల్చి ఉండేది. తూకాల్లో మోసం చేయడం, నిలదీస్తే అసలు బియ్యమే వేయని ఘటనలు కోకొల్లలు. ఈక్రమంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్లకు డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో సౌకర్యంగా, వ్యయప్రాయాసలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ నిర్ణయాలను అక్కసుతో వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఎండీయూ వాహనాలను అర్ధాంతరంగా తొలగించింది. మళ్లీ రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు కర్నూలు జిల్లాలో 409 ఎండీయూ వాహనాలు ఉన్నా యి. ప్రతి వాహనానికి ఒక ఆపరేటర్, ఒక హెల్పర్ ఉంటారు. వీరికి వాహనం నడిపేందుకు అవసరమైన ఖర్చుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.21 వేలు చెల్లిస్తుంది. ఇందులో రూ.3వేలు వాహనం కంతు, రూ.3వేలు పెట్రోలు, రూ.5వేలు హెల్పర్‌కు ఇస్తారు. మిగిలిన రూ.10 వేలు ఆపరేటర్ వేతనంగా జమ చేసుకుంటారు. ఈక్రమంలో ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడాల్సి వస్తోంది. వారి నోటి కాడి కూడును ప్రభుత్వం లాగేస్తోంది. కర్నూలు నగరంలో ఎండీయూ వాహనం ద్వారా రేషన్ సరుకులు తీసుకుంటున్న ప్రజలు (ఫైల్) ఉపాధి కోల్పోతాం నేను నాలుగేళ్ల నుంచి ఎండీయూ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నా. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల ప్రజలకు ప్రతి నెలా 1–16 మధ్య బియ్యం, ఇతర సరుకులను పేదలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నాం. బండి ద్వారా నాకు, నా హెల్పర్‌కు జీవనోపాధి లభిస్తోంది. బండ్లను నిలిపివేస్తే ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతాం. – నవీన్‌రాజు, ఈ.తాండ్రపాడు, కర్నూలు రూరల్ మండలం మేము రోడ్డున పడతాం ఎండీయూ వాహనాల ద్వా రా ఉపాధిని పొందుతు న్నాం. పేదలకు రేషన్ సరు కులు ఇస్తుంటే సంతోషంగా ఉంటోంది. ఈ బండి ద్వారా నెలకు రూ.10వేల ఆదాయం వస్తుంది. అది లేకపోతే మేం రోడ్డున పడతాం. ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. మా జీవితాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. – సురేంద్రబాబు, బళ్లారి చౌరస్తా ఏరియా, కర్నూలు -
21 నుంచి యోగాంధ్ర మాసోత్సవం
కర్నూలు(సెంట్రల్): జూన్ 21న అంతర్జాతీయయోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి యోగాంధ్ర మాసోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రజలు యోగాలో పాల్గొందుకు అవసరమైన, అనువైన స్థలాన్ని గుర్తించాలని మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, అడిషినల్ ఎస్పీ హుస్సేన్ పీరాలను ఆదేశించారు. యోగాకు సంబంధించిన పాటలు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలను పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ శామ్యూల్‌పాల్, ఇంటర్మిడియట్ అధికారి(ఆర్ఐఓ) గురువయ్య శెట్టి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్‌ను ఆదేశించారు. ప్రజలందరూ యోగాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతి కళ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు రమణారెడ్డి, నాగశివలీల పాల్గొన్నారు. -
అరకొరగా విత్తన కేటాయింపులు
విత్తన పంపిణీలో అంతులేని నిర్లక్ష్యం ● వర్షాలు కురుస్తున్నా స్పందించని ప్రభుత్వం ● బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా అంటున్న కంపెనీలు ● ఇప్పటి వరకు మొదలుకాని ప్రాసెసింగ్ ప్రక్రియ ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే 15 నుంచే పంపిణీ ● ఇప్పుడు అరకొర కేటాయింపులతో సరి ● వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనం అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మే నెల 15 నుంచే విత్తన పంపిణీ జరిగింది. వర్షాలు పడిన వెంటనే విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో విత్తుకునే అవకాశాన్ని కల్పించింది. 2024 ఖరీఫ్ సీజన్ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల సకాలంలో విత్తన పంపిణీ సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో విత్తన పంపిణీపై దృష్టి సారించని పరిస్థితి. సబ్సిడీ పంపిణీలో వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ప్రధానమైనవి. ఈ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సరఫరాకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు ఖరారు చేసినప్పటికీ సంబంధిత కంపెనీలు విత్తన సరఫరాకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు పెట్టలేదంటే పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు వేరుశనగ విత్తనం కాయల కోసం వ్యాపారులను ఆశ్రయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024–25 బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్‌కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, రబీ సమయంలో సరఫరా చేసిన శనగ(బెంగాల్‌గ్రామ్), ఇతర విత్తనాలకు ఏపీ సీడ్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్‌కు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఏపీసీడ్స్‌కు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వల్ల సరఫరా చేసిన కంపెనీలకు నగదు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ కంపెనీలు బీష్మించాయి. విత్తనాల కోసం రైతులకు తప్పని తిప్పలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా విత్తన పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ విషయమై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉండటంతో రైతులు విత్తనాల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ క్వింటా ధర రూ.6,500 ఉండగా.. వ్యాపారులు ఉన్నట్లుండి ధరను పెంచేశారు. ఈ సారి విత్తనాల పంపిణీ దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడం వ్యాపారులకు కలసి వస్తోంది. ధరలను అడ్డగోలుగా పెంచి దోపిడికి పాల్పడే ప్రమాదం ఏర్పడింది. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సమస్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నందున పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి సాగవుతోంది. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఇందువల్ల భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జిల్లాకు కనీసం 3,500 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ వద్ద కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల కోసం రైతులు వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలను అందుబాటులో పెట్టకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో వేరశనగ ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 54,170 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేపట్టేందుకు 32,181 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఆయా జిల్లాల అధికారులు వినతిని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఉమ్మడి జిల్లాకు తూతూమంత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. సాధారణంగా గత ఏడాది ఏఏ విత్తనం ఏ మేర పంపిణీ అయిందో దానికి అనుగుణంగా విత్తనాలను కేటాయిస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాకు 14,395 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,062.7 క్వింటాళ్ల ప్రకారం విత్తన పంపిణీ జరిగింది. కనీసం ఈ ప్రకారమైన కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లతో సరిపెట్టడం గమనార్హం. ఈ కేటాయింపులు చూసి అధికారులు పంపిణీ ఎలా చేపట్టాలోనని తలలు పట్టుకుంటున్నారు. -
బ్లాక్‌లో కొనాల్సి వస్తుందేమో
ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాం. గత ఏడాది వరకు మే 15 నుంచే వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీ చేశారు. ముందస్తుగా విత్తనాలు సిద్ధం కావడంతో వర్షాలు కురిసిన వెంటనే సకాలంలో విత్తుకు అవకాశం ఉండేది. ఈ సారి సబ్సిడీపై విత్తనాల పంపిణీ జరుగుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాల కోసం దిక్కుతు చూడాల్సి వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి రాకపోతే బ్లాక్‌లో కొనాల్సిందే. – సత్యప్ప, మామిళ్లకుంట, తుగ్గలి మండలం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియదు 13 ఎకరాల్లో వరి, వేరుశనగ 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మామూలుగా అయితే పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వినియోగించం. మొదటిసారిగా వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు విత్తుకోవాలనుకున్నాం. కానీ వ్యవసాయ శాఖ ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం. – కెంచప్ప, గజ్జెహళ్లి, హొలగొంద మండలం -
పది రోజులైనా ప్రజల అర్జీలు చూడరా?
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ లాగిన్‌లో వచ్చిన ప్రజల అర్జీలను కొన్ని శాఖల అధికారులు పది రోజులైనా చూడడంలేదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ఎస్డీసీ బీకే వెంకటేశ్వర్లు, అనురాధ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కర్నూలు సీడీపీఓ, ఆదోని మునిసిపల్ కమిషనర్, అర్బన్ తహసీల్దార్, లీగల్ మెట్రాలజీ డీడీలు వారం రోజుల నుంచి అర్జీలను చూడకపోవడం విడ్డూరమన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు అని, ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీల్లో కొన్ని... ● జాతీయ రహదారి 340సీ కింద బ్రిడ్జి నుంచి వ్యవసాయపొలాలకు వెళ్లేందుకు రహదారిని నిర్మించాలని కర్నూలు మండలం నూతనపల్లి రైతులు అర్జీ ఇచ్చారు. ● తన 6.20 ఎకరాల పొలాన్ని కొందరు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతున్నారని, తన భూమిని తనకు ఇప్పించాలని గోనెగొండ్ల మండలం పెద్దనెలటూరుకు చెందిన చాకలి నరసింహులు అర్జీ ఇచ్చారు. ● తనకు మంత్రాలయం మండలం మాలపల్లిలో 58 సెంట్ల భూమి ఉందని, అది నిషేధిత జాబితాలో ఎవరూ అప్పు ఇవ్వడం లేదని, కుమార్తె పెళ్లి ఉందని, సమస్య పరిష్కరించాలని భీమన్న వినతి పత్రం అందజేశారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి -
నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది
16 ఏళ్ల నుంచి ఆధునిక నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారు కొందరు డ్యాన్స్ అకాడమీలను స్థాపించుకున్నారు. మరికొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్యాన్స్ మాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో తృప్తిగా ఉంది. – రాజాహుసేన్, డ్యాన్స్ మాస్టర్ నృత్యం నేర్చుకుంటున్నా ఆరేళ్ల నుంచి వేసవిలో నృత్యం నేర్చుకుంటున్నాను. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. బాగా నేర్పుతున్నారు. జూన్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుందంటా. అందుకే బాగా నేర్చుకుంటున్నాను. – గోవర్ధిని, శిక్షణ పొందుతున్న విద్యార్థిని భవిష్యత్తులోనూ నేర్పిస్తా ఎక్కువ మంది చిన్నారులు ఆధునిక నృత్యంపైనే ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదేళ్ల చిన్నారులు కూడా హుషారుగా, ఎంతో జోష్‌తో పాల్గొంటున్నారు. ఫీజు లేకపోయినా సరే చిన్నారులకు నేర్పుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మున్ముందు కూడా చిన్నారులకు డ్యాన్స్ నేర్పిస్తా. – డాక్టర్ లలితాసరస్వతి, భరతనాట్యం డ్యాన్స్ మాస్టర్ -
వాల్మీకి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
ఆదోని సెంట్రల్: ఎమ్మిగనూరులో నిర్వహించిన కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని, వారు భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూస్తామన్నారు. వాల్మీకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు అభివృద్ధి వైపు నడిచేలా చూస్తామన్నారు. గౌరవాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన టి.బాలవెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఉద్యోగి), అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన బి.మల్లన్న, (ఏడీ, వెటర్నరీశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఆదోనికి చెందిన బి.సుధాకర్‌బాబు (ఉపాధ్యాయుడు), కోశాధికారిగా కోసిగికి చెందిన ఎస్.వెంకటరెడ్డి (ఉపాధ్యాయుడు), ఇతర సలహాదారులు, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. వాల్మీకి ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు హుసేని, ఇతర నాయకులు పులుసు నారాయణ, తిమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రఘునాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ప్రాణం తీసిన నీటి గచ్చు
కోడుమూరు రూరల్: నీటి గచ్చు ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. ఈ దుర్ఘటన కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్కసాగరం రామాంజినేయులుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నాల్గవ కుమార్తె గాయత్రి (5)ని తోటి పిల్లలతో పాటు ఎప్పటిలాగే ఇంట్లో వదిలి తండ్రి రామాంజినేయులు పొలం పనులకు వెళ్లాడు. అయితే బాలిక గాయత్రి ఆటలాడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గచ్చులో పడిపోయింది. గాయత్రి కన్పించకపోవడంతో మిగిలిన పిల్లలు చుట్టుపక్కల వెతికి ఇంటిలోని గచ్చులో చూశారు. అప్పటికే బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి రామాంజినేయులు ఇంటికి చేరుకుని పాపను బతికించుకునేందుకు కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో రోదిస్తూ గ్రామాన్ని చేరుకున్నారు. పిడుగుపాటుతో 18 మేకలు మృతి ఆదోని రూరల్: మండలంలోని పాండవగల్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు గురై 18 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొరవన్నగారి తిక్కయ్యకు చెందిన 3, కప్పట్రాళ్ల రాందాసుకు చెందిన 4, చింతకుంట నరసయ్యకు చెందిన 3, జెల్లీ గోకర్లకు చెందిన 4, జెల్లీ చిన్నలక్ష్మన్నకు చెందిన 4 మేకలు మృతిచెందాయి. రాత్రిపూట పొలంలో ఆపిన సమయంలో పిడుగు పడడంతో మేకలు మృతిచెందాయని గొర్రెల కాపరులు చెప్పారు. మేకల మృతితో దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్‌ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఏపీ ఈఏపీ సెట్‌కు 94.04 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రారంభం కాగా 94.04 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,190 మందికిగాను 3,000 మంది (94.04 శాతం) హాజరయ్యారు. కర్నూలు నగరంలో 7 కేంద్రాలు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఉదయం సెషన్ పరీక్షకు 1,597 మందికిగాను 1,492 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 1,593 మందికిగాను 1,508 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 3 కేంద్రాలలో ఉదయం సెషన్లో 713 మందికి 659 మంది, మధ్యాహ్నం సెషన్లో 711 మందికిగాను 659 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. సమయానికి చేరుకోలేక వెనుదిరిగిన ఇద్దరు విద్యార్థులు -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు మంత్రాలయం, చిప్పగిరి మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 12.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలతోపాటు గాలుల తీవ్రతతో జిల్లాలో అరటి, మునగ పంటలకు నష్టం జరిగింది. అయితే ఉద్యాన అధికారులు మాత్రం అరటి ఒక హెక్టారు, మునగ ఒక హెక్టారులో మాత్రమే దెబ్బతిన్నట్లుగా తేల్చారు. జీడీపీలోకి వరద నీరు గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ (జీడీపీ)లోకి వరద నీరు వచ్చి చేరుతున్నటున్ల ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 880 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కాగా.. గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు 4.5 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. -
దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు
కర్నూలు(సెంట్రల్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ల్యాప్‌టాప్‌లను ఇద్దరు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అందజేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖసహాయ సంచాలకులు రయూస్ ఫాతిమా పాల్గొన్నారు. రేషన్ బియ్యం కోసం ధర్నా ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 80 కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు 3,436 మందికి గాను 2,248 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. సీఐడీ నుంచి 10 మంది వెనక్కి కర్నూలు: సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 10 మంది సిబ్బంది తిరిగి యధాస్థానానికి వచ్చారు. సోమవారం ఎ స్పీ దగ్గర హాజరుకావడంతో తిరిగి వారికి పోస్టింగ్ కేటాయించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. పొగాకును కొనుగోలు చేయాలినంద్యాల(అర్బన్): రైతులు పండించిన పొగాకు దిగుబడులను కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు బేళ్లను వెనక్కు పంపకుండా ఒప్పందం మేరకు క్వింటా రూ.18,500తో కొనుగోలు చేయాలన్నారు. -
డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఫిబ్రవరి/మార్చి నెలల్లో జరిగిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ (2015, 2016, 2017,2018) పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. వివరాలు వర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కర్నూలు(అర్బన్): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో అందించనున్నట్లు జిల్లా కురువ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఎంపికై న విద్యార్థులందరికీ జ్ఞాపిక, సర్టిఫికెట్లు, నగదు బహుమతులను అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా భువనేంద్రుల ఆరాధన మంత్రాలయం: మధ్వమత పూర్వపు పీఠాధిపతి భువనేంద్రుల ఆరాధన వేడుక వైభవంగా జరిగింది. తెలంగాణలోని రాజోలి గ్రామంలో క్షేత్రంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు చేపట్టారు. ముందుగా భువనేంద్ర తీర్థుల మూల బృందావనానికి శాస్రోక్తంగా విశేష పూజలు చేశారు. అక్కడే శ్రీమఠం రాములోరి సంస్థాన పూజలు నిర్వహించారు. ఈ ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలి బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు. హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ హాలహర్వి: హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. హాలహర్వి పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసిన నిందితులను చూపుతూ సీఐ వివరాలను వెల్లడించారు. అమృతాపురం గ్రామంలో గత నెల 25న కంటినేని పెద్ద వెంకటేశులు హత్యకు గురి కాగా నిందితుడు సోమన్నను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. కుటుంబ కలహాల కారణంగా కంటినేని పెద్ద వెంకటేశులను హతమార్చినట్లు సోమన్న ఒప్పుకున్నారన్నారు. హత్యలో భాగస్వాములైన హొళగుంద గ్రామస్తులు చాకలి నాగరాజు, నటరాజగౌడ, కర్ణాటక రాష్ట్రం ఉత్తనూరుకు చెందిన భోగప్ప, ధనుంజయ, దళిత ఈరన్నను విరుపాపురం గ్రామ శివారులోని బల్గోట బసవేశ్వర ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల స్టేట్మెంట్లను రికార్డు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. హాలహర్వి ఎస్ఐ చంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మద్దతుదారుడి జయకేతనం
మద్దికెర: వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన కవిరెడ్డి కృష్ణ మద్దికెర ఉపసర్పంచ్‌గా సోమవారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రంగస్వామి ప్రకటించారు. పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా 18 పంచాయతీ సభ్యులకు గాను 14 మంది హాజరయ్యారు. ఉపసర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణను సభ్యులు కోలి మల్లికార్జున ప్రతిపాదించగా 12 మంది చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్ఐ విజయ్‌కుమార్‌నాయక్ బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ సుహాసిని, కార్యదర్శి శివకుమార్ సభ్యులు బాలచంద్ర, వరప్రసాద్, కిట్టి, సుధాకర్, జంబునాథ్రాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో సంబరాలు ఉప సర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ను ఘనంగా సన్మానించి గ్రామ వీధులు గుండా ఊరేగింపు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతన్న, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, ఆంజనేయులు, కృష్ణ, మంజునాథ్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మద్దికెర ఉపసర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణ -
ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ఆదోని టౌన్: మునిసిపల్ చైర్పర్సన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 మంది పాలకవర్గ సభ్యుల ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది. ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ లోక్వేరి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఆదోని సబ్‌కలెక్టర్ భరద్వాజ్, ఎన్నికల అబ్జర్వర్, జాయింట్ కలెక్టర్ నవ్య ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిల్లో 42 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా అందులో ఐదుగురు బీజేపీలోకి వెళ్లగా, ఒకరు టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. మిగిలిన 36 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లుగా ఉన్నాయి. సీహెచ్ లోకేశ్వరిని చైర్‌పర్సన్‌గా 36వ వార్డు కౌన్సిలర్ సందీప్‌రెడ్డి ప్రతిపాదించగా 40వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్అహ్మద్ బలపరిచారు. దీంతో సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ప్రకటించారు. అబ్జర్వర్ అయిన జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్లు చైర్‌పర్సన్‌గా సి.హెచ్.లోకేశ్వరి ఎన్నికై నట్లు ఎన్నిక నియామక పత్రాన్ని అందజేశారు. కమిషనర్ ఎం.కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బస్సులో.... ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి 35 మంది కౌన్సిలర్లు బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు విచారణ అనంతరం కౌన్సిల్‌హాల్‌కు చేరుకున్నారు. కౌన్సిల్లో ఆల్ఫాబెట్ ప్రకారం సీట్లను కేటాయించారు. వారివారి సీట్లలో కౌన్సిలర్లు కూర్చొని ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న సీహెచ్ లోకేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మహాయోగి లక్ష్మమ్మవ్వను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి ఆశీస్సులు పొందారు. రుణపడి ఉంటా వాల్మీకి వర్గానికి చెందిన తనను ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి రుణపడి ఉంటానని మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ లోక్వేరి తెలిపారు. ఆదోని ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతపరంగా పరిష్కరిస్తానని తెలిపారు. ప్రలోభాలకు లొంగలేదు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆదోని చరిత్ర తిరగరాసిందని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. పాలకవర్గ సభ్యులు మాటకు కట్టుబడి వైఎస్సార్సీపీలోనే ఉంటూ చైర్ పర్సన్ ఎన్నికను ఏకగ్రీవంగా చేశారన్నారు. కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేసినా లొంగలేదన్నారు. ఒక్కరు కూడా పార్టీని ఫిరాయించకుండా, ప్రలోభాలకు లొంగకుండా సత్తా చాటారన్నారు. మునిసిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం 36 మంది పాలకవర్గ సభ్యుల ఆమోదం చైర్‌పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి -
మోసం చేశారు.. న్యాయం చేయండి
కర్నూలు: నమ్మంచి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని ప్రజలు సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కోరారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి వారితో ఎస్పీ మాట్లాడారు. మొత్తం 128 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జీతాలు కూడా ఇవ్వకుండా.. వెల్దుర్తి, చిట్యాల, సూదేపల్లె, అమకతాడు పాఠశాలల్లో అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణగిరి గ్రామానికి చెందిన ఆవుల రామాంజనేయులు నమ్మించారు. మొత్తం ఏడుగురు నుంచి రూ.10 లక్షలు డబ్బులు తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారు. ఏడు నెలల పాటు ఆయా పాఠశాలల్లో పని చేయించుకుని జీతాలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని డోన్ మండలానికి చెందిన ఎరుకలి శేషన్న సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసాల్లో కొన్ని.. ● ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యాపారి 95 కిలోల నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశాడని వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి గ్రామానికి చెందిన నాగమల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ● ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక వ్యక్తి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని మోసం చేశాడని గూడూరుకు చెందిన యుగంధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ● తమ్ముడు విరుపాక్షితో కలసి డబ్బులు అవసరముందని, బంగారు ఆభరణాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాం. తిరిగి రుణం చెల్లించడానికి వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు గతంలోనే రిలీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారని, సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ● కర్నూలు మార్కెట్ యార్డులో 50 మంది కమీషన్ ఏజెంట్ల నుంచి రూ.1.80 కోట్లు విలువ చేసే ఉల్లి సరుకు తీసుకుని ఆనియన్ ట్రేడర్స్ వారు డబ్బులు ఇవ్వడం లేదని కర్నూలు బుధవారపేటకు చెందిన సాంబశివుడు ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులు -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఆడబిడ్డలకు ద్రోహం
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు
కల్లూరు: సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన సీపీఐ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప నేతృత్వంలో శ్రీనివాసరావు, మహేష్, బాబయ్య, అశోక్, రాముడు, అలాగే నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జే.లక్ష్మీనరసింహ, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జిలానీ బాషా చేరుకున్నారు. వీరిని పోలీసులు అత్యు త్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు సీఎంను కలిసే ఏర్పాటు చేస్తామని చెప్పి ఉలిందకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ అరెస్టును సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఖండించారు. -
ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని, 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు 10వ తరగతి పాసైన యువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువకులు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరాబ్యాంకు–గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(డీఆర్డీఏ–టీటీడీసీ ప్రక్కన)లో సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 63044 91236 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి ఆత్మకూరురూరల్: వెంకటాపురం గ్రామంలో శనివారం ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన కుందూరు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ఏకై క కుమారుడు కుందూరు చరణ్ రెడ్డి(15) తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో ఊరు శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈత అంతగా రాని చరణ్ రెడ్డి బావిలో దూకడంతో నేరుగా నీటిలో మునిగి బురదలో చిక్కుకున్నాడు. దీంతో ఊపిరాడక మరణించాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చరణ్ మృతదేహాన్ని వెళికి తీశారు. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
మహాయోగి.. మహిమాన్విత మూర్తి
● రేపు ఆదోనిలో లక్ష్మమ్మ అవ్వ జాతర ● భారీగా తరలిరానున్న భక్తులు మహాయోగిగా ప్రసిద్ధి.. ఆదోని పట్టణంలో లక్ష్మమ్మ అవ్వ మహిమలు చూపారు. మహాయోగిగా ప్రసిద్ధి చెందారు. దుకాణాల వద్దకు అవ్వ వచ్చిపోతే వ్యాపారం బాగా సాగుతుందనే నమ్మేవారు. అవ్వను కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తులు చెప్పేవారు. ఆదోనిలో రాచోటి రామయ్య వంశీయులు, చాకలి నరసప్ప తదితరులు అవ్వను ఆశ్రయించి దగ్గరుండి సేవలు చేసేవారు. ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించేవారు. లక్ష్మమ్మ అవ్వ 1933లో జీవసమాధి అయ్యారు. అక్కడే రాచోటి రామయ్య వంశీకులు గుడి కట్టించారు. లక్ష్మమ్మ అవ్వ గుడిలో జీవసమాధి వద్ద ధ్యానం చేసిన వారికి మంచి జరిగేదని నిర్వాహకులు తెలిపారు. ఆలయ గర్భగుడికి బంగారు తొడుగు ఏర్పాటు చేసిన దృశ్యం ఆదోని అర్బన్: మహిమలు చూపిన మాతృమూర్తి మహాయోగి లక్ష్మమ్మ అవ్వ. ఆదోని పట్టణంలో సోమవారం అవ్వ జాతర నిర్వహించనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. దళితుల ఇంట పుట్టి.... లక్ష్మమ్మ అవ్వ ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళితులు మంగమ్మ, బండెప్ప దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే మౌనంగా ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. లక్ష్మమ్మ అవ్వను కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన యువకుడు మారెప్పకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఒక రోజు లక్ష్మమ్మ అవ్వ శక్తిస్వరూపిణిగా భర్తకు కనిపించడంతో ఆయన భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. దీంతో సిరుగుప్ప నుంచి అవ్వ ఆదోనికి చేరుకుని తన మహిమలు చూపారు. రేపు రథోత్సవం లక్ష్మమ్మ అవ్వ జాతర సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదోని పట్టణంలో వెండి రథోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారిని కొలువుదీర్చే మండపాన్ని, ఆలయ సమీపంలోని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య చేయించిన బంగారు కిరీటాన్ని సోమవారం సమర్పించను న్నారు. జాతర సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. -
‘విశ్వ’మంత సంబరం
● సందడిగా జేఎన్టీయూ(ఏ) 14వ స్నాతకోత్సవంఅనంతపురం: రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (ఏ) 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్ ఐఐటీ ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆర్. మాధవ్, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్‌లర్ హోదాలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. తన ప్రసంగం ప్రారంభంలో జేఎన్టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు అంటూ గవర్నర్ అనడం ఆకట్టుకుంది. గౌరవ డాక్టరేట్ డాక్టర్ చావా సత్యనారాయణకి ప్రదానం చేయడం ద్వారా జేఎన్టీయూ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ గవర్నర్ సరదాగా వ్యాఖ్యానించారు. జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసగించారు. ‘ద టైమ్స్ ఇండియా వరల్డ్’ ర్యాంకింగ్‌లో వర్సిటీ 801–1000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టామని, అపార్ అనుసంధానంతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు చెంతకు చేరిన బాలుడు
వెల్దుర్తి: పట్టణంలోని 9వ వార్డు ముల్ల గేరిలో నివాసముంటున్న మూడేళ్ల బాలుడు అభిరామ్ శనివారం మధ్యాహ్నం తప్పిపోయి కొన్ని గంటల్లోనే తల్లితండ్రులు పరుశరాముడు, లుఽథియాల చెంత చేరాడు. వివరాలు.. అభిరామ్ తన ఇంటి ముందు ఆడుకుంటూ బంధువుల యువకుడితో కలిసి అరకిలోమీటర్ దూరంలోని పోలీస్‌స్టేషన్ సమీప దుకాణానికి వెళ్లాడు. ఆ యువకుడు వెళ్లిపోవడంతో అభిరామ్ ఒక్కడై డోన్ వైపు దారి వెంట ఏడ్చుకుంటూ తిరిగాడు. అక్కడున్న వారు బాలుడ్ని చేరదీసి పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించారు. ఎస్ఐ అశోక్ సలహా మేరకు బాలుడి ఫొటోను వాట్సాప్‌లో ఉంచగా తల్లితండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారు పోలీస్‌స్టేషన్ చేరుకుని పిల్లవాడ్ని ముద్దాడుతూ ఊపిరి పీల్చుకున్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రెండు కేంద్రాలు
కర్నూలు సిటీ: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు సనత్‌నగర్‌లోని ఆయాన్ డిజిటల్, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నారు. సుమారు 700 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. ఇద్దరు విద్యార్థులు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. అమెరికాలో కర్నూలు విద్యార్థి మృతి కర్నూలు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు విద్యార్థి ఇస్కాల వెంకట కౌశిల్ (26) మృతి చెందాడు. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన ఇస్కాల రవికుమార్ కుమారుడు ఇస్కాల వెంకట కౌశిల్ అమెరికాలోని టెక్సాస్‌లోని బ్యూమౌంట్ ఉంటున్నారు. లామర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. టెక్సాస్‌లో కారు నడుపుతూ ఈనెల 12వ తేదీన రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శనివారం రాత్రి మృతదేహం కర్నూలుకు చేరింది. 31న చలో సిద్ధేశ్వరం కర్నూలు సిటీ: చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగు నీటి సాథన సమితి అద్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. ిసిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అదే రోజు సిద్ధేశ్వరం వద్ద ప్రజా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కర్నూలులోని ఓ హోటల్లో క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చలో సిద్ధేశ్వరంవాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మత్తునిద్ర వదిలి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మోక్షేశ్వరరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సీనియర్ నాయకులు జి.చంద్రన్న, రాయలసీమ సాగు నీటి సాధన సమితి కార్యదర్శి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద వితరణపై పర్యవేక్షణ శ్రీశైలం టెంపుల్: అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు సమయపాలనను పాటించాలన్నారు. -
నల్లమలలో ‘అవినీతి’ అనకొండ
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయంలో 15 ఏళ్లుగా పని చేస్తూ ఐదు నెలల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగి అవినీతి బాగోతం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా రూ.6కోట్ల నిధులను మళ్లించిన బాగోతం ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తోంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పని చేసిన చాంద్ బాషా గతేడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించిన సిబ్బందికి మొదట రూ.20 లక్షలు దారి మళ్లించినట్లు గుర్తించి దరాప్తు చేపట్టగా తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బైర్లూటీలోని ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ చెక్ పోస్టు నుంచి వసూలైన మొత్తం సర్కిల్ కార్యాలయానికి జమ చేయకుండా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. ఈ విషయమై చాంద్ బాషాపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖులు పోలీసులతో మధ్యవర్తిత్వం చేసి అరెస్టును వాయిదా వేయించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో దారి మళ్లిందనుకున్న రూ.20 లక్షలు ఆత్మకూరు ఎఫ్టీ డీడీ ఖాతాలో తిరిగి జమ చేశారు. ఆపై ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో చాంద్‌బాషా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత ఐదేళ్లలో అతని అక్రమాలు పరిశీలిస్తే దాదాపు రూ.6 కోట్లు దారి మళ్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌కు చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా, నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్‌కు చెందిన నంద్యాల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే గత ఐదేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం ప్రయివేట్ వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు వెలుగు చూసింది. అటవీశాఖకు చెందిన వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన నగదు మొత్తాలను చాంద్‌బాషా తెలివిగా తన సమీప బంధువులు, నమ్మకస్తుల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉండే మహేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని శివయ్య, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఏకంగా సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు బదిలీ చర్చనీయాంశంగా మారింది. కెమెరాల కొనుగోల్‌మాల్ నల్లమల అభయారణ్యంలో జంతువుల లెక్కింపు, వేటగాళ్ల కదలికలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసే ఇన్ఫ్రారెడ్ కెమెరాలా కొనుగోళ్లలోను అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ టెలీ కమ్యూనికేషన్ సంస్థకు అటవీశాఖ ద్వారా ఇన్ఫ్రారెడ్ కెమెరాలు కొనుగోలుకు ఇండెంట్ పెట్టారు. అయితే అటవీ శాఖ అనకొండ కన్ను దీనిపై కూడా పడడంతో ఆ సంస్థకు కొంత కమీషన్ ఇచ్చి కెమెరాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్‌కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. సమగ్ర నివేదిక అందజేశాం ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్‌బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. – వి.సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు ఆత్మకూరు అటవీ కార్యాలయంలో ఫెవికాల్ ఉద్యోగి అక్రమాలు పదవీ విరమణతో అవినీతి వెలుగులోకి రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులు దారి మళ్లింపు -
కర్నూలులో భారీ వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులో శనివారం సాయంత్రం రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలో 46.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత లేకపోయినా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఉరుముల తీవ్రతకు చిన్నపిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆనంద్ సినీ కాంప్లెక్స్, కేసీ కెనాల్, రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులను చౌరస్తా మీదుగా బైపాస్కు మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 14 మండలాల్లో అకాల వర్షాలు ఉరుములు, మెరుపులు.. గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుగ్గలిలో భారీ వర్షం కురిసింది. తుగ్గలిలో 45.2 మి.మీ, కోడుమూరులో 33.6, పత్తికొండలో 21.4, పెద్దకడుబూరులో 15.4, గోనెగండ్లలో 14.8, కోసిగిలో 9.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మామిడి తోటలకు నష్టం కలిగింది. రానున్న రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే!
కర్నూలు(సెంట్రల్): రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ చేపట్టినవేనని సీఎం చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో రాయలసీమలో చాలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కల్లూరులోని తన నివాసంలో శనివారం కాటసాని విలేకరులతో మాట్లాడారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు ప్రధానమంత్రి ఉన్న సమయంలో పీవీ నరసింహారావు భూమి పూజ చేశారని తెలిపారు. 1994 ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాలువలను పూర్తి చేశారన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 2004లో సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్‌తో ప్రజలకు నీళ్లు ఇచ్చారన్నారు. హాస్యాస్పదం ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీ హయాంలో చేపట్టినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కాటసాని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చినట్లో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఎక్కడి నుంచైనా సందేశం ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆయన మాత్రం ఆ పనిమీదనే జిల్లా పర్యటనకు వచ్చారని, ఆయన రాకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఖర్చు వచ్చిందన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే ఆ జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు లేదా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి వస్తారన్నారు. చంద్రబాబు మాత్రం రైతు బజార్‌ను శుభ్రం చేయడానికి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సంక్షేమ పథకాలను ఎవరూ అడగకూడదని ఆగస్టు, జూన్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క సాగుప్రాజెక్టును నిర్మించలేదు గోరుకల్లును నిర్వర్యీం చేశారు ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమిటి? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
అసలు, వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా పంట రుణం
● గత ఏడాది కలసిరాని వ్యవసాయం ● అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ● బ్యాంకుల తీరుతో దిక్కుతోచని స్థితి ● వడ్డీకి ఇస్తామని తిష్టవేసిన దళారీలు ● ఇంటెన్సివ్ ఉన్నా వడ్డీ వసూలు ● రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంఅప్పులు తెచ్చి కట్టాల్సిందే.. గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8లక్షల వరకు పంట రుణం తీసుకున్నా. పత్తి, కంది, ఉల్లిగడ్డలు తదితర పంటలు సాగు చేస్తున్నాం. ప్రస్తుతం క్రాప్‌లోన్ రెన్యూవల్ చేసుకుందామని బ్యాంకుకు పోతే అసలు, వడ్డీ మొత్తం చెల్లించాలంటున్నారు. ఇంత మొత్తం కట్టాలంటే అప్పు చేయక తప్పదు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం చేయలేం. – పరమేశ్వరరెడ్డి, రేమడూరు, కల్లూరు మండలం అసలు, వడ్డీ చెల్లించాల్సిందే.. గత ఏడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలు, బంగారంపై పొందిన వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అసలు, వడ్డీ చెల్లించాల్సిందే. అప్పు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే కొత్తగా పంట రుణం ఇస్తారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆర్బీఐని ఎస్ఎల్బీసీ కోరుతోంది. కొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ కట్టించుకొని రెన్యూవల్ చేస్తున్నాయి. – రామచంద్రరావు, ఎల్డీఎం, కర్నూలుపంట రుణాల కోసం వెల్దుర్తి యూనియన్ బ్యాంక్‌కు తరలి వచ్చిన రైతులు -
నీళ్లు కొంటున్నాం
కుళాయిలకు ఐదు రోజులకోసారి నీళ్లను వదులుతున్నారు. అవి కూడా అందుతాయన్న నమ్మకం లేదు. ప్రతి రోజూ నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చుట్టు పక్కల బోర్లలో ఎక్కడా మంచినీళ్లు లేవు. కుళాయిలకు సరిగా నీళ్లు రాక డబ్బులు పెట్టి క్యాన్ల నీళ్లు కొంటున్నాం. – శ్రీనివాసులు, కొండపేట, కోడుమూరు సమస్య ఉంది హంద్రీ నది ఎండిపోవడంతో మంచినీటి పథకాలు సరిగ్గా పనిచేయడం లేదు. హంద్రీలో నీటి కొరత కారణంగా పట్టణంలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. సమస్య పరిష్కారం కోసం కోడుమూరు హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. – ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, కోడుమూరు -
మోసం చేసి పర్యటనా?
● ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.గిడ్డమ్మ కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ విమర్శించారు. మోసం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ఎంత మందిపిల్లలు ఉంటే అందరికీ రూ.15,000 ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారనప్నారు. సంపద సృష్టించి మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భారతి, పావని పాల్గొన్నారు. -
సైకిల్‌పై శక్తిపీఠాల సందర్శన
ఆత్మకూరురూరల్: మండువేసవిలో సైకిల్‌పై ప్రయాణం ఎంత కష్టం. కాని ఆయన సంకల్ప శక్తికి మండే సూర్యుడు కూడా చల్లబడ్డాడేమోననిపిస్తోంది. షిరిడీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి దేశం నలుమూలలా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలను సైకిల్‌పై ప్రయాణిస్తూ సందర్శిస్తున్నారు. శ్రీశైలంలో వెలసిన శ్రీ భమరాంబిక శక్తి పీఠాన్ని సందర్శించుకుని మరో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దర్శనానికి వెళ్తూ శుక్రవారం మార్గమధ్యలో ఆత్మకూరులో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గత జనవరి నుంచి ఉత్తరభారతదేశంలోని శక్తిపీఠాలన్నింటిని సైకిల్ యాత్రలో దర్శించుకుని దక్షిణ దేశానికి చేరుకున్నానన్నారు. శ్రీలంకకు కూడా వెళ్లాల్సి ఉందని ఆయన తెలిపారు. 798 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో 798 మంది గైర్హాజరయ్యారు. 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 8,376 మందికి 7,632 మంది హాజరు కాగా 744 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు మొత్తం ఇద్దరు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 589 మందికి 535 మంది హాజరు కాగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వేసవి సెలవుల్లో చిన్నారులు జాగ్రత్త ● జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ కర్నూలు(అగ్రికల్చర్): వేసవి సెలవుల్లో చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వాగులు, వంకలు, చెరువులు, బావుల్లోకి వెలుతుంటారని, అటువంటి సమయంలో వారిపై కుటుంబీకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విపత్తుల నిర్వహణ అఽథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ సూచించారు. వేసవి ఎండల తీవ్రత మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం డీపీఎం అనుపమ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ నెల చివరి వర కు ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల చివరి వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, బాలింతలు బయట తిరగరాదని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా గొడుగు ధరించాలన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ఆరుబయట ఉండరాదని, చెట్లు, టవర్లకు సమీపంలో ఉండకూడదని తెలిపారు. అకాల వర్షాల సమయంలో సురక్షితమైన భవనాల్లో ఉండాలని పేర్కొన్నారు. -
సర్దుబాటుతో చతికిల‘బడి’
● ఒకే పాఠశాలలో మాయమైన 10 ఉపాధ్యాయ పోస్టులు పత్తికొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన సర్దుబాటు ప్రక్రియ పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను దెబ్బతీసింది. పాఠశాలకు 40 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ఇక్కడ 31మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కుదించారు. దీంతో 10 పోస్టుల వరకు ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు 21మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది. మొత్తం 1,300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. తరగతుల వారీగా సెక్షన్లు విభజించి బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటంతో తల్లిదండ్రులు వలసబాట పట్టి పిల్లలను కూడా తీసునకెళ్లారు. దీంతో విద్యార్థుల సంఖ్య 800కు తగ్గింది. దీంతో పాఠశాలలో 10 ఉపాధ్యా పోస్టులు మాయమయ్యాయి. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కర్నూలు (టౌన్) : గుజరాత్లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు నగరానికి చెందిన ఎం. రేణుకా, బి. భువనేశ్వరీలు ఎంపికయ్యారు. ఎంపికయిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు ముప్పా రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు, వేణుగోపాల్, పాల్ విజయ్‌కుమార్, శ్రీధర్, కోచ్ బ్రహ్మాకుమార్ పాల్గొన్నారు. మల్లికార్జునపల్లిలో నిలిచిన ఉపాధి పనులు ● వేతనాలపై ప్రశ్నించినందుకు అధికారుల నిర్వాకం ఆలూరు: హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పనిదినాలకు తక్కువగా వేతం వచ్చిదంటూ ఉపాధి పథకం టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్‌తో గ్రామానికి చెందిన కూలీలు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ఈనెల 3న టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజుతో కలిసి వెళ్లి మస్టర్లు తదితర అంశాలను విచారించి చేసిన పనులను కొలతలు వేశారు. అయితే తక్కువ కొలతలను చూపిస్తున్నారని కూలీలు ఈరప్ప, మల్లికార్జున, చాంద్‌బాషా ఈశ్వరప్ప తదితరులు టీసీ రాజశేఖర్‌ను నిలదీశారు. దీంతో ఆ రోజు నుంచి గ్రామంలో పనులు నిలిపేశారు. కాగా శుక్రవారం కూడా పనులు జరగలేదు. పనులు నిలిపివేయడంపై హాలహర్వి ఏపీఓ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీ లేదని సమాధానం దాటవేశారు. -
రైతుల ఆశలపై ‘నీళ్లు’
● ఆయకట్టుకు అందని సాగునీరు ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవలేదు. కాలువలకు సక్రమంగా సాగు నీరు కూడా రాలేదు. దీంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు నీరు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా రైతుల ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. ఇదీ ప్రతిపాదన.. ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి నీరు వస్తుంది. మొత్తం 14,555 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువకు 650 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే 150 నుంచి 200 క్యూసెక్కులు సాగునీరు (హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి) మించి విడుదల కావడం లేదని రైతులు వాపోయారు. చిప్పగిరి గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము (డీపీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తూము ఏర్పాటు చేస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టించుకోని ప్రభుత్వం కాలువకు నీరు రాక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఆయకట్టు రైతులకు పంటలు పండటం లేదు. హామీలను గాల్లోకి వదిలేశారు ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. సాగు ప్రాజెక్టులు నిర్మించాలని, కాలువలకు తూములు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదు. హెచ్ఎన్ఎస్ నుంచి ఏబీసీకి సాగునీరు విడుదల చేయాలి. నగరడోణ గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేయాలి. – బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే అనుమతులు రాలేదు ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు సాగుటిని విడుదల చేసేందుకు హెచ్ఎన్ఎస్కు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలని గతంలో రూ. 3 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. వాటర్ యూజర్స్ కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. – చంద్రశేఖర్, హెచ్ఎల్సీ ఆలూరు ఏబీసీ డీఈ -
అధికారం ఇచ్చింది దోచుకునేందుకేనా ?
● ఎమ్మెల్యేగా చికెన్ దందా తగునా ● అక్రమార్జన కోసం ప్రజలపై భారం మోపుతారా? ● ఏజెంట్లను పెట్టి వ్యాపారులను బెదిరిస్తారా? ● ఆళ్లగడ్డ ఎమ్మెల్యేపై వైఎస్సార్సీపీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి విమర్శలు ఆళ్లగడ్డ: ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టమెచ్చినట్లు దోచుకునేందుకేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో చాగలమర్రిలో చికెన్ సెంటర్ల నిర్వాహకులను అందరిని తమ దగ్గరే చికెన్ కొనుగోలు చేయాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ మండలానికి ఒక ఏజెంట్‌ను పెట్టి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇంత వరకు ఇలాంటి దందా ఎవరూ చేయలేదన్నారు. కిలోకు రూ. 35 అదనంగా డిమాండ్ చేస్తున్నారని, ఇందులో ఎమ్మెల్యేకు రూ. 25, ఏజెంట్లకు రూ. 10 లెక్కన నిర్ణయించి వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది సామాన్యమైన స్కామ్ కాదు. ఒక్క ఆళ్లగడ్డ పట్టణంలోనే రోజుకు 5 వేల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. నెలకు రూ. కోటి పైగా వసూళ్లు చేయడమే లక్ష్యంగా దందా కొనసాగిస్తున్నారు. ఇదంతా చికెన్ తినే సామాన్య ప్రజలపై భారం మోపడమే కదా అని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన సామాన్యులను దోచుకోనేందుకేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ డాన్‌గా ఎమ్మల్యే అఖిలప్రియ పేరు గాంచారన్నారు. ఎవరైనా మాట్లాడినా.. మీడియాలో కథనాలు రాసిన ఆధారాలు ఉన్నాయా అంటూ బొంకుతూ పరువు నష్టం దావాలు వేస్తామంటూ బెదిరించడం తగదన్నారు. నేరుగా పోలీసులు మీడియా ముందు పేర్లు చెబుతున్నారని, వారి ఫొటోలతో చికెన్ డాన్ అఖిలప్రియ అని అన్ని మీడియాల్లో కోడై కూస్తుందన్నారు. ఇప్పుడు ఆ మీడియా కార్యాలయాల దగ్గరకు వెళ్లి కోళ్లు, కోళ్ల పెంట తీసుకెళ్లి నిరసన తెలపాలన్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధులతోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ పరువు పోతోందని విమర్శించారు. -
సైనికులకు జోహార్లు
కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్‌లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్‌తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్‌రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు డీఈఓ హెచ్చరిక కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గత నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించామన్నారు. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను అడ్మిషన్లకు క్యాంపెయిన్ చేయిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రచార నిమిత్తం ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్ల తనిఖీలకు ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు వచ్చిన సమయంలో సరైన సమాచారం అందించాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు.రాష్ట్రంలో తారాస్థాయికి కక్ష రాజకీయాలు కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారా స్థాయికి చేరాయని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు వేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. తాజాగా మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వ అధికారులపైనా చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతున్నారన్నారు. ఆయన కుట్రపూరిత చర్యలతో రాష్ట్రాన్ని, ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకపోగా, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారన్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. -
భక్తులూ జర భద్రం!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శిఖరేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్ రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ రైలింగ్ విరిగిపోయినా దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు శిఖరేశ్వర దర్శనం తప్పనిసరిగా చేసుకుంటారు. శిఖరేశ్వరంపై ఉన్న నందికొమ్ముల నుంచి మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖర కలశాలను దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. శిఖరేశ్వరం వద్ద మెట్లు ఎక్కలేని వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల కోసం ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. -
కోడుమూరులో ప్ర‘జల’ కష్టాలు
కోడుమూరు రూరల్: నీళ్లు లేక హంద్రీ నది ఎండిపోవడంతో నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 45వేలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరికి మంచినీటిని అందించడం కోసం పంచాయతీ అధికారులు హంద్రీనదిలో ఎనిమిది బోర్లను వేశారు. వాటితో పట్టణంలోని ట్యాంకులకు నీటిని ఎక్కించి కాలనీల్లోని కుళాయిలకు వదులుతున్నారు. హంద్రీ నది ఎండిపోవడంతో బోర్లకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని కొండపేట, వెంకటేశ్వరనగర్, లక్ష్మీనగర్, వెంకటగిరి రోడ్డు, మోబీన్వీధి, మెయిన్‌బజార్, కుర్నీ నగర్‌లకు ఐదు రోజులకోసారి కుళాయిలకు నీటిని వదులుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టణంలో నీటి సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదముంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీనదికి విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్పందించని టీడీపీ నేతలు తాము అధికారంలోకి వస్తే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి కోడుమూరుకు శాశ్వత నీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదు. కనీసం నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు సైతం చేపట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎండిపోయిన హంద్రీ నది అడుగంటిన భూగర్భ జలాలు పనిచేయని మంచినీటి బోర్లు ఐదు రోజులకోసారి నీటి సరఫరా -
గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత ఏదీ
● ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్‌నాయక్ కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనుల రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో విస్మరించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కై లాస్‌నాయక్ విమర్శించారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నేతల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కై లాస్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా, గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న బంజారా కులస్థులు రాజకీయ అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. అలాగే బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థికస్థితిగతులను మెరుగుపరచుకునేందుకు రుణాలు అందించే ప్రక్రియ ప్రారంభమైందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా నేటికి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయంలో ఓ గిరిజన అధికారిపై ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. బంజారాలు మాట్లాడే భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. సమావేశంలో నాయకులు నాగరాజునాయక్, నేణావత్ రామునాయక్, కాలు నాయక్, బాలునాయక్, రాజునాయక్, వెంకటేష్‌నాయక్, శ్రీనునాయక్, శంకర్‌నాయక్, బీ మద్దిలేటి, సీమ కృష్ణరాథోడ్, జయరామ్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ.. అవకాశాలు మెండుగా..!
● పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల ● వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు మే 24న తుది గడువు నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులు పది అనంతర కోర్సులపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. పలువురు విద్యార్థులు వారి ఆసక్తిని బట్టి ఏ కోర్సులో చేరాలా అని ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరగా, పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసినవారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికిసైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో 1,084 సీట్లు ఉ న్నాయి. 16 ప్రైవేట్ యాజమాన్యంలో 2225 సీట్లు ఉన్నాయి.ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి మే 24వ తేదీ తుది గడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి కోర్సులు.. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఆర్అండ్ ఏసీ టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్సిస్టిట్యూట్ మెకానిక్, టర్నర్, మెచినిస్ట్. ఏడాది కాలపరిమితి కోర్సులు.. మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో. డ్రోన్ టెక్నాలజీపై స్వల్ప కాలిక కోర్సు ప్రారంభం.. ఈ ఏడాది నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా డ్రోన్ టెక్నాలజీ పై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్‌లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఐటీఐలో చేరగోరే విద్యార్థులు మే 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మొబైల్‌కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. – ప్రసాదరెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, నంద్యాల -
సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నందికొట్కూరు: నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తప్పవని అసిస్టెంట్ ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ రాముడు హెచ్చరించారు. శుక్రవారం పట్టణ పరిధిలోని నీలిషికారిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి 3,810 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 35 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. అనంతరం నీలిషికారులతో ‘నాటు సారా తయారు చేయం.. విక్రయించం’.. అంటూ ప్రతిజ్ఞ చేయించారు. 2.0 కార్యక్రమంపై నీలిషికారులకు అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాషిణి, మారుతి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ రమేష్, ఎకై ్సజ్ సీఐలు రామాంజనేయులు, విజయకుమార్, ఎస్ఐలు జఫ్రూల్లా, శ్రీనివాసులు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు బజారు నిండా దళారులే!
● కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు బజార్లలో దళారుల తిష్ట ● సిఫారస్సులతో కూటమి నేతల అనుచరులకు అవకాశం ● సీఎం వస్తుండటంతో స్టాళ్లలో ఒక్క రోజు మాత్రం రైతులు ఉండేలా అధికారుల యత్నం కర్నూలు(అగ్రికల్చర్): అటు రైతులకు, ఇటు వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసిన సీ – క్యాంప్ రైతు బజార్ దళారీలకు అడ్డాగా మారింది. పేరులో మాత్రమే రైతు ఉన్నప్పటికీ వాస్తవంగా రైతుబజార్లలో వారికి స్థానం లేకుండా పోయింది. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలు దళారీలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని టాప్ 5 రైతుబజార్లలో కర్నూలు సి.క్యాంపు రైతుబజారు ఒకటి. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు ఏడాది కాలంగా రైతుబజారులోకి తమ అనుకూలమైన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ‘వీరు మా వాళ్లు.. వారూ మావాళ్లు..’అంటూ సిఫారస్సు చేస్తూ రైతుబజారు నిండా దళారీలను నింపుతున్నారు. ఇటీవల సీ.క్యాంపు రైతుబజారులో దళారీలు ఎంతమంది ఉన్నారనే దానిని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆరా తీశారు. రైతుబజారులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు తదితర వాటిని అమ్ముకునే వారు దాదాపు 400 మంది ఉన్నారు. ఇందులో 98 శాతం దళారీలు, 2 శాతం మంది రైతులు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దళారీలను కట్టడి చేసేందుకు ప్రయత్నించే సిబ్బందిపై తిరుగబడుతుండటం గమనార్హం. రైతుబజారులో అమ్ముకుందామని కూరగాయలు తెచ్చుకున్న రైతులకు దళారీలు చుక్కలు చూపిస్తారు. దళారీలను తట్టుకోలేక ఏదో ఒక ధరకు కూరగాయలు అప్పగించి పోతున్నారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలు తెచ్చిన రైతులను లోనికి రానివ్వకుండా బయటనే దళారీలు కొంటారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొని అక్కడే బోర్డుపై రాసిన ధరలను ఏ మాత్రం పట్టించుకోకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే వినియోగదారుల పట్ల అమర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11వ తేదీ ఆదివారం వినియోగదారులతో రైతుబజారు కిటకిటలాడింది. బోర్డుపై రాసిన ధరలను పట్టించుకోవడం లేదంటూ... తూకాల్లో దగా చేస్తున్నారంటూ కనీసం 100 ఫిర్యాదులు వచ్చాయి. దళారీలు తిష్ట వేయడం వల్లనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన ఇటు రైతులు, అటు వినియోగదారులకు తీవ్ర కష్టాలకు గురి చేసింది. సీఎం వస్తున్నారు.. కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేయాలనే కారణంతో గురు, శుక్రవారాల్లో రైతుబజారులోకి ఎవరినీ అనుమతించడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలతో తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఏమీ చేసుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. క్వింటాళ్ల కొద్ది తెచ్చిన కూరగాయలను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో బయట అతి తక్కువ ధరకు దళారీలకు అమ్ముకోవాల్సి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుబజారులో జరిగే కార్యాక్రమంలో పాల్గొననుండటంతో రైతులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వినియోగదారులకు మాత్రం అనుమతి లేదు. సీఎం పర్యటన తమకు శాపంగా మారిందని రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. రైతుబజారుకు అన్ని వైపుల అనేక మంది కూరగాయ లు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరందరినీ ఖాళీచేయంచడంతో వందలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. -
కూతురుకు భారం కాకూడదని..
వెల్దుర్తి: అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి కుమార్తె, అల్లుడుకి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన డి చిన్నబాబు(42) పాలీస్ బండల ఫ్యాక్టరీలు కూలీగా జీవించేవాడు. ఒక్కగానొక్క కుమార్తె అమ్రిన్‌ను వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఇటీవల చిన్నబాబు పక్షవాతంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పులు ఎక్కువై స్వగ్రామంలో ఉన్న ఒక్క ఇంటిని అమ్మి భార్యతో కలిసి కుమార్తె, అల్లుడు వద్దకు చేరుకున్నారు. అనారోగ్యంతో వారికి భారమవడం ఇష్టంలేని చిన్నబాబు బుధవారం రాత్రి బయటకు వచ్చి గురువారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కర్నూలు జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఏఎస్ఐలు ప్రేమ్‌కుమార్, రమేశ్‌లు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. రాత్రి గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, కర్నూలు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మహానంది: నంద్యాల – గిద్దలూరు రహదారిలో గురువారం రాత్రి బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె మండలం బీరవోలు గ్రామానికి తలారి వేణు(18), మధుకృష్ణ బైక్‌పై గాజులపల్లెలో బంధువుల ఇంట్లో జరుగుతున్న తిరుగు పెళ్లికి బయలుదేరారు. ఈ క్రమంలో బోయిలకుంట్ల మెట్ట వద్ద గంగవరం గ్రామానికి చెందిన తెలుగు రమణ, బాలు మరో బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తూ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బీరవోలు గ్రామానికి చెందిన తలారి వేణు మృతి చెందగా రమణ, బాలు, మధుకృష్ణ గాయపడ్డారు. రోడ్ సేఫ్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి, కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ఉచితాన్ని తుంగలో తొక్కి!
● తుంగభద్ర నదిలో టీడీపీ నాయకుల అక్రమ తవ్వకాలు ● ప్రాంతాలుగా పంచుకుని అడ్డగోలుగా తరలింపు ● విభేదాలు రావడంతో పంచాయితీ చేసిన టీడీపీ నేత ● కలిసి దోపిడీ చేయాలని సలహా! కర్నూలు(టౌన్): అధికారంలోకి వచ్చాక ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు పెచ్చుమీరిపోతున్నారు. సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. కర్నూలు శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక పేదలకు అందకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రాంతాలు వారీగా దందా సాగిస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల గొడవలు జరగడంతో టీడీపీ నేత పంచాయతీ చేసి కలసి దోపిడీ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. దోపిడీ ఇలా... ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో రీచ్‌లు లేకున్నా తుంగభద్ర నదిలో నిత్యం ఇసుక దందా సాగుతోంది. ఇంటి నిర్మాణాల కోసం ఒంటెద్దు బండ్లలో ఇసుకను తీసుకుపోవచ్చు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కర్నూలు నగర శివారులోని తుంగభద్ర పరిసర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ. 3 వేలకు అమ్ముకుంటున్నారు. రీచ్‌ల నుంచి మాత్రమే ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలించాల్సి ఉంది. అయితే తుంగభద్ర నదిలో రీచ్‌లు లేకున్నా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. అడ్డుకుని.. హంగామా సృష్టించి తుంగభద్ర ఇసుకను అక్రమంగా తరలించడంలో కర్నూలు మండలానికి చెందిన టీడీపీ నేత అనుచరులు బృందంగా ఏర్పడ్డారు. అలాగే మంత్రి పేరు చెప్పి కార్పొరేటర్ కుటుంబం సభ్యులు సైతం ఇసుకను తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నారు. ఇసుక దోపిడీకి వీరు ప్రాంతాలను ఏర్పచుకున్నారు. ఇటీవల మంత్రి పేరు చెప్పి సంకల్బాగ్, పాత తుంగభద్ర పంపింగ్ హౌస్ వద్ద ఇసుకను తరలిస్తుండగా కర్నూలు మండల టీడీపీ నేత అనుచరులుగా ఉన్న వారు అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని నానా హంగామా సృష్టించారు. ‘ తమ ప్రాంతంలో ఇసుకను ఎలా తరలిస్తున్నారు’ అంటూ గొడవకు దిగారు. టీడీపీ నేత పంచాయితీ కర్నూలు నగర శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక తరలించే విషయంలో జరుగుతున్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ నేత పంచాయతీ చేశారు. ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ఈ పంచాయితీలో ‘ ఇసుక మనది.. కలసి పంచుకుందాం.. గొడవలు వద్దు.. అందరం పంచుకుందాం’ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ‘మీ ప్రాంతంలోకి మా వారు.. వారి ప్రాంతంలోకి మీరు రాకూడదు’ అంటూ టీడీపీ నేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ దుస్థితి.. ● తుంగభద్ర నది నుంచి ప్రెవేటు ట్రాక్టర్ల అసోసియేషన్ వారు సైతం టీడీపీ నేతల నాయకుల పేర్లు చెప్పి ఇసుకను తరలిస్తున్నారు. ● ఒంటెద్దు బండ్లకు ఉచితంగా ఇసుకను తీసుకునే పోయే అవకాశం ప్రభుత్వం కల్పించినా పట్టించుకునే ఽనాధుడు లేడు. ● ఇసుక దందాపై అధికారులు తమకేం సంబంధం లేదని వ్యవహరిస్తున్నారు. -
నేటి నుంచి ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షలు
కర్నూలు: రవాణా శాఖ పరిధిలో వాహన సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ టెస్ట్) సులభతరం కానున్నాయి. జిల్లాలో భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్ట్(ఏటీఎస్) స్టేషన్ వసుధ ఇండస్ట్రీస్ ఏజెన్సీ దక్కించుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) ప్రత్యక్షంగా తనిఖీ చేసి ధృవపత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఏటీఎస్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ధృవపత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు స్వయంగా ఎంవీఐలే జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు నేటి నుంచి (16వ తేదీ) ఫిట్నెస్ సేవలు రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేశారు. నంద్యాల జిల్లాలో చాబోలు వద్ద ఈనెల మొదటి వారంలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌ను ప్రారంభించగా.. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏటీఎస్ ద్వారా 54 రకాల పరీక్షలు చేస్తారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు కేంద్రాలే ఏర్పాటు చేయడం, మిగిలిన ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లాలంటే అవస్థలు తప్పేలా లేవు. ఆదోనికి చెందిన వాహనదారులు చిన్నటేకూరు వద్దకు, డోన్‌కు చెందిన వాహనదారులు చాబోలు కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ సేవలు నిలిపివేయడంతో రెండు రోజుల ముందే ఆన్లైన్లో స్లాట్ పొందిన గూడ్స్ వాహన యజమానులు అయోమయంలో పడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రయివేట్ స్టేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో ఎఫ్‌సీ సేవలు నిలుపుదల -
వేసవిలో ఎమ్మిగనూరు ‘పులి’కింత
● నీటి ఎద్దడిని నివారిస్తున్న పులికనుమ రిజర్వాయర్ ● ఈ నెల 21 తరువాత నుంచి పట్టణానికి నీటి సరఫరా ● వైఎస్సార్ చలువతో ‘పులికనుమ’ నిర్మాణం ఎమ్మిగనూరు టౌన్: వేసవిలో ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహాన్ని పులికనుమ రిజర్వాయర్ నీరు తీర్చనుంది. ఇందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈనెల 21 నుంచి ‘పులికనుమ’ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఆ నీటిని ఎస్ఎస్ ట్యాంక్‌లో నింపితే మళ్లీ వర్షాలు పడే వరకు నీటి ఎద్దడి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఎమ్మిగనూరు పట్టణంలో లక్షకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి దాహార్తిని తీర్చేందుకు గుడికల్ చెరువులో 526 మిలియన్ లీటర్ల నీటిని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లో 87 మిలియన్ లీటర్ల నీటిని అధికారులు నిల్వ చేశారు. వీటి ద్వారా పట్టణంలో ఉన్న 4 ట్యాంక్‌లతో 13 వేల కుళాయిలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నీటి సమస్య ఉత్పనం అయ్యే సూచనలు కనిపించాయి. దీంతో పులికనుమ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచిన నీటిని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లించి ఎస్ఎస్ ట్యాంక్‌ను నింపేందుకు అఽధికారులు చర్యలు చేపట్టారు. పులికనుమ రిజర్వాయర్‌ను మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డీఈ నీరజ, ఏఈ శరత్‌కుమార్ తదితరులు సందర్శించారు. నీటి విడుదలపై చర్చించారు. వైఎస్సార్ చలువ.. గతంలో ఎల్లెల్సీ ద్వారా నీటి సరఫరా నిలిచిపోతే ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడేది. ట్యాంక్‌లకు నీటి సరఫరా లేక గుక్కెడు నీటికోసం పట్టణ వాసులు ఇబ్బంది పడేవారు. అప్పట్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పులికనుమ రిజర్వాయర్ నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడం, నిధులను విడుదల కావడంతో నిర్మాణం పూర్తయ్యింది. ఇలా ఉపయోగం.. తాగు, సాగునీటి అవసరాలకు పులికనుమ రిజర్వాయర్ ఉపయోగపడుతోంది. ఏటా వేసవికి ముందు పులికనుమ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేస్తారు. వేసవిలో పులికనుమ నీటిని ఎల్లెల్సీ ద్వారా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుకు తరలిస్తారు. ఆ నీటిని ఎమ్మిగనూరు పట్టణ వాసులకు అందిస్తారు. ముందు చూపుతో నిర్మించిన పులికనుమ రిజర్వాయర్ పట్టణ వాసులకు అత్యవసర సమయంలో ఆదుకుంటూ నీటి ఎద్దడి రాకుండా ఉపయోగపడుతోంది. దీంతో పట్టణ వాసులు మహానేత వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన మేలును మరువలేకపోతున్నారు. నీటి సమస్య ఉండదు ఎమ్మిగనూరు పట్టణానికి వేసవిలో ఎలాంటి నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంక్, గుడికల్ చెరువుల్లో ఉన్న నీరు నెలాఖరు వరకు ఉపయోగడుతుంది. పులికనుమ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడాను. వారు సానుకూలంగా స్పందించారు. మరో 45 రోజుల పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తదు. – గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
వ్యాధి బయటపడే కాలం
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మురుగుకాల్వలు నిండిపోవడంతో దోమలకు అవి ఆవాసంగా మారాయి. తరచూ వర్షాలు కురవడంతో ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలుస్తోంది. అందులో దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాలుగా మారి దోమల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రధానంగా డెంగీ కారక ఏడిస్ ఈజిప్టై దోమ దోసెడు నీళ్లు చాలు అందులో పెరుగుతుంది. ఈ కారణంగా ఇళ్లు, దుకాణాల పరిసరాల్లో వాడి పారేసిన కొబ్బరి బోండాలు, కొబ్బరి చిప్పలు, పాతటైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండి అందులో డెంగీ దోమలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మున్సిపల్, పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడం, గత ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడటంతో దోమల ఉత్పత్తి అధికమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జిల్లాలో ఆదోని మండలంలో ఒకటి, పెద్దకడుబూరులో 2, మంత్రాలయంలో 2, కర్నూలులో 9, ఓర్వకల్లో 3, పత్తికొండలో 4, కల్లూరులో 5, గూడూరులో 4, ఎమ్మిగనూరులో 10, సి.బెళగల్లో 13, దేవనకొండలో 3, తుగ్గలిలో 2, క్రిష్ణగిరిలో 3, గోనెగండ్లలో 4, వెల్దుర్తిలో 3, ఆస్పరిలో 3, నందవరంలో 1, చిప్పగిరిలో 2, కోడుమూరులో 5, కౌతాళం మండలంలో ఒకటి, కర్నూలు అర్బన్‌లో 16, ఆదోని అర్బన్‌లో 1, ఎమ్మిగనూరు అర్బన్‌లో 4, గూడూరు అర్బన్‌లో 3 కేసులు నమోదయ్యాయి. డెంగీ ఎలా వస్తుందంటే...! ఆర్ధో వైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగీ వైరస్ల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్ ఈజిప్టై దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఆడ ఏడిస్ ఈజిప్టై దోమకాటు ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండటం వల్ల దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయి. డెంగీ వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన దోమలోనే గాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్ ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుంది. ఈ వైరస్ వల్ల ఒకటి కంటే ఎక్కువసార్లు డెంగీ రావచ్చు. ఈ వ్యాధిని డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్ జ్వరం, డెంగీ షాక్ సిండ్రోమ్‌గా విభజిస్తారు. వ్యాధి నిర్ధారణ.. డెంగీ జ్వరం నిర్ధారించేందుకు మొదటి వారంలో ఎన్ఎస్1 ర్యాపిడ్ కిట్‌తో పరీక్షను అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తారు. రెండవ వారంలో వ్యాధి తీవ్రతను బట్టి ధ్రువీకరణ పరీక్ష ‘మాక్ ఎలీసా’ పరీక్షలు బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో చేస్తారు. ఈ పరీక్షలో ధ్రువీకరించితేనే అది డెంగీగా నిర్ధారణ అవుతుంది. డెంగీ నివారణకు చర్యలు జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీళ్లు నిలిచిన చోట యాంటిలార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమలు ఎక్కువగా ఉంటే మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. వెయ్యి జనాభాలో ఇద్దరి కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో 45 రోజులకు ఒకసారి డీడీటీ స్ప్రే చేయిస్తున్నాం. – నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు డెంగీ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన దోమకాటు తర్వాత మూడు నుంచి 14 రోజుల్లో డెంగీ వ్యాధి రావచ్చు. ఈ వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సాధారణంగా 80 శాతం మందికి దానంతటదే తగ్గిపోతుంది. వీరికి ఎర్రటి దద్దుర్లు వచ్చిన సమయంలో రక్తంలో ప్లేట్లెట్లు తగ్గినా సాధారణ స్థితికి చేరుకుంటారు. మిగతా రెండు రకాలలో (డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్) రక్తంలో ఈ ప్లేట్లెట్లు బాగా తగ్గడం వల్ల వీరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల బృందావన దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల రాకతో దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. నిత్య వేడుకల్లో భాగంగా రాయరు ప్రతిమకు ఊంజల మంటపంలో ప్రత్యేక ఆర్జిత సేవలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో రాయరు బృందావన ప్రతిమను రమణీయంగా ఊరేగించారు.శ్రీమఠం ప్రాంగణంలో భక్తులు -
అదృశ్యం కేసులో ఆద్యంతం మలుపులు
● గత నెల 26వ తేదీన అదృశ్యమైన వ్యక్తి హత్య? ● అనుమానితులను విచారిస్తున్న పోలీసులు సాక్షి, టాస్క్ ఫోర్స్: మండల కేంద్రమైన గడివేములకు చెందిన గొర్రెల కాపరి గువ్వల రాజు అదృశ్యం కేసు ఆద్యంతం మలుపులు తిరుగుతోంది. తన తమ్ముడు రాజు కనిపిచడం లేదని అన్న జనార్దన్ గత నెల 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. విచారణ చేస్తుండగా గ్రామంలోని ఓ రైతు మొక్క జొన్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆనవాళ్లు లభించడంతో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద మృతి కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గువ్వల రాజును కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి, శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల కాపరి రాజు కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యాపిల్లలు కూడా అతడిని వదిలేశారు. దీంతో అక్కడక్కడా గొర్రెల కాపరిగా వెళ్తూ వచ్చే కూలీ డబ్బుతో జీవించేవాడు. అయితే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కొంత మంది యువకులు కలిసి రాజును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం.దారుణంగా హత్య చేసి గుర్తు పట్టకుండా మృత దేహంపై యాసిడ్, పెట్రోల్ పోసి దహనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అస్తిపంజరంలో చిన్న ఎముకలను విసిరేసి పెద్ద ఎముకలను పిండి చేసి పొలంలో పడేసినట్లు తెలిసింది. అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. హత్యకు పాల్పడిన స్థలానికి నిందితుల ను తీసుకెళ్లి విచారణ చేశారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్న వ్యర్థాలే నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారుల పనితీరు ఏ స్థాయిలో దిగజారిందో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త చెప్పకనే చెబుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు కార్పొరేషన్ క్లీన్ అం
టన్నుల కొద్దీ వ్యర్థాలు ● కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి తొలగింపు ● వెయ్యి మందికి పైగా సిబ్బంది ఉన్నా ఎక్కడి చెత్త అక్కడే ● గత ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సెలవు ● ఇటీవల 200 మంది తాత్కాలిక సిబ్బంది నియామకం ● అయినప్పటికీ చెత్త నిర్వహణలో చిత్తశుద్ధి కరువు ‘ఒక్కరోజు’ హడావుడి! పది నెలలుగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించని అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాలువల్లో మురుగు పేరుకుపోయినా.. చెత్తకుండీలు పొంగిపొర్లినా అధికారులు ముక్కుమూసుకుని వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో నగరం చెత్తమయమైంది. ఇన్ని నెలలుగా నిద్రపోతున్న అధికారులు ఒక్కరోజు సీఎం కార్యక్రమానికి హడావుడి చేస్తున్న తీరు పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది సిబ్బంది పనిచేస్తుంటే.. ఇప్పుడు టన్నుల కొద్దీ వ్యర్థాలు ఎలా వస్తున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు అప్పుడు.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ సిటీలో భాగంగా 2018 సంవత్సరంలో 221 ర్యాంకు సాధించింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు కార్పొరేషన్లో దేశ వ్యాప్త ర్యాంకులో 2019 సంవత్సరంలో 187, 2020 సంవత్సరంలో 197 ర్యాంకు.. 2021 సంవత్సరంలో 75వ ర్యాంకు, 2022 సంవత్సరంలో 55వ ర్యాంకు.. 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 32వ స్థానం సాధించడం విశేషం. అప్పట్లో పారిశుద్ధ్య విభాగంలో ప్రభుత్వం తీసుకున్న మెరుగైన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. చెత్తలేని నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. తడిచెత్త, పోడిచెత్త వేరు చేయడంతో పాటు 1.25 మొక్కలు నాటి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దారు. ఇప్పుడు.. క్లీన్ అండ్ గ్రీన్ ఊసే లేదు. ప్రత్యేకించి నిధులు రాలేదు. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. మురుగు కాల్వలను శుభ్రం చేయడంలేదు. ఇంటింటి చెత్త సక్రమంగా అమలు కావడం లేదు. తడిచెత్త లేదు. పోడి చెత్త లేదు. అన్ని డివిజన్లలో అదే పరిస్థితి. చెత్త సేకరణలో కొత్తగా సంస్కరణల సంగతి దేవుడెరుగు.. గత ప్రభుత్వంలో చక్కగా పనిచేస్తున్న క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) ఆటోలను ఆటకెక్కించారు. దాదాపు 90 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో పారిశుద్ధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ్ముళ్ల కోసం అంటూ ప్రతి శానిటేషన్ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో రూ.2 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. కర్నూలు(టౌన్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చంధ్ర, స్వచ్ఛా సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న కర్నూలులో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి నెలా మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇంకేముంది. సీఎం వస్తున్నాడని ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం మొత్తం వీధుల్లోకి వచ్చింది. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నా.. అక్కడ పెద్ద ఎత్తున్న వ్యర్థాలు బయట పడుతుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, మేసీ్త్రలు, సచివాలయాల ఉద్యోగులు సరైన పర్యవేక్షణ చేస్తే గుట్టల కొద్దీ వ్యర్థాలు ఎలా బయటపడుతాయని ప్రశ్నిస్తున్నారు. సి.క్యాంపులో ప్రతి రోజు 50 టన్నులకు పైగా వ్యర్థాలు వస్తాయని తెలిసినా పారిశుద్ధ్య అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడం వల్లే ఇప్పుడు మొత్తం యంత్రాంగం శ్రమించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 970 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా.. ఎక్కడి చెత్త అక్కడే! కర్నూలు నగరంలో 970 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా.. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేసీ్త్రలు, ప్రతి సచివాలయాల పరిధిలో సచివాలయాల వార్డు కార్యదర్శులు ఉన్నారు. ప్రతి రోజు 250 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలు తరలించాల్సి ఉంది. సిబ్బంది ఉన్నారు.. వాహనాలు ఉన్నా.. పర్యవేక్షణ లోపించడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. ఇక పాతబస్తీలో పరిస్థితి చెప్పనలవి కాదు. రికార్డుల్లో మాత్రం చెత్తను నగర శివారలోని గార్గేయపురానికి తరలిస్తున్నా.. నగరం ప్రతి రోజూ కంపు కొడుతోంది. ప్రయివేట్ టెండర్‌తో కాల్వల శుభ్రం రెండు వారాల క్రితం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మెయిన్ డ్రైన్లను శుభ్రం చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 52 వార్డుల్లో ప్రధాన మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రయివేటు టెండర్ ద్వారా ఈ పనులు నిర్వహిస్తున్నారు. 970 మంది కార్మికులు చేస్తున్న పనినే ప్రత్కేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో నగరంలో మళ్లీ డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఇది మూమ్మాటికీ మురుగు నిధుల దుర్వినియోగం కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగుల ఇష్టారాజ్యం కర్నూలు కార్పొరేషన్లో సిబ్బంది ఉన్నా పర్యవేక్షణ లేకపోవడంతోనే పారిశుద్ధ్య సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశుద్ధ్య విభాగంలో సిబ్బంది కొరత పేరిట 200 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. రూ.10 వేల వేతనంతో పనిచేస్తున్న వీరు విధుల్లోకి వచ్చినట్లు థంబ్ వేయడం(వేలిముద్ర), ఐరిష్ తీసుకోవడం లేకపోవడంతో విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. ఇదేమని ప్రశ్నించే శానిటరీ సిబ్బందికి రెండు చేతులు తడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఏటా రూ.2 కోట్లు నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేకపోవడం చూస్తే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఉద్యోగుల చిత్తశుద్ధి అర్థమవుతోంది. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
● నలుగురికి గాయాలు ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పూడిచెర్ల బస్సు స్టేజీ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీకి ఆవుల మంద అడ్డురావడంతో లారీ డ్రైవర్ తన లారీని అకస్మాత్తుగా స్లో చేయడంతో, వెనక వస్తున్న ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పోలూరుకు చెందిన నిర్మల అనే వృద్ధురాలి తలకు రక్తగాయాలు కాగా, జోత్స్న, వసంతకుమారి, ధర్మతేజ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ ఘటనపై ఇరు వాహనదారులు ఫిర్యాదు చేయకుండా, రాజీ కుదుర్చుకోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్ఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కోసిగి: తుంబిగనూరు గ్రామానికి చెందిన తలారా నాగరాజు (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో చేపల చెరువులలో రోజు వారి కూలి పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న యువకుడు కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. భార్య నాగమ్మ పుట్టినిల్లు ఆదోని మండలం జాలమంచి గ్రామం. ఆమె 15 రోజులుగా నాగమ్మ చెల్లెలు పెళ్లి ఉందని పుట్టినింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి కడుపు నొప్పి తాళలేక నాగరాజు జీవితంపై విరక్తి చెంది తుంగభద్ర నది కాల్వ ఒడ్డున రేకుల షెడ్‌వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీస్‌లకు సమాచారం అందించడంతో ఎస్ఐ హనుమంత రెడ్డి, ఏఎస్ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుడు తల్లి ఉచ్చీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతినికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు గొర్రెల కాపరి మృతి చాగలమర్రి: చిన్నబోధనం మజరా గ్రామమైన తిప్పన పల్లె గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుకు ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా తొండురు మండలం కోరవానిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (29)తో పాటు మరో ఐదుగురు కలసి సుమారు వెయ్యికి పైగా గొర్రెలతో 15 రోజుల క్రితం తిప్పనపల్లెకు చేరుకున్నారు. గ్రామంలోని బీడు భూముల్లో జీవాలను మేపుతూ అక్కడే ఉంటున్నారు. చంద్రశేఖర్ వేప చేట్టు కింద నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున చెట్టుపై పిడుగు పడింది. ఆ శబ్దానికి చంద్రశేఖర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడే ఉన్న మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న ఏఎస్ఐ షేక్ అబ్దుల్ నబి సంఘటనా స్థలానికి చేరుకుని గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రశేఖర్ మృతితో సంఘటన స్థలంలో తల్లి పద్మావతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
● ఒక కేసు నమోదు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో గురువారం ఓ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్య శెట్టి తెలిపారు. ఉదయం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 9,380 మంది విద్యార్థులకుగాను 8,963 మంది హాజరై 417 మంది గైర్హాజరయ్యారన్నారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో ఓ విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించిన తనిఖీ అధికారులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 1,277 మందికిగాను 1,203 మంది హాజరై 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 17న కర్నూలుకు సీఎం చంద్రబాబు కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన ఖరారైంది. కర్నూలు రైతు బజార్లో జరిగే స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదికలో పీ4 లబ్ధిదారులు, మార్గదర్శకులతో మాట్లాడేందుకు వీలుగా పర్యటనను ఖరారు చేశారు. 17న ఉదయం 11.25 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు రోడ్డు మార్గంలో కర్నూలు సీక్యాంపు రైతు బజార్‌ను చేరుకొని 12.25 గంటల వరకు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శానిటరీ వర్కుర్లు, రైతులతో మాట్లాడుతారు. 12.35 గంటలకు కేంద్రీయ విద్యాలయం పక్కన ఏర్పాటు చేసే కార్యక్రమంలో స్వచ్ఛంధ్రా –స్వర్ణాంధ్ర పార్కు, 100 అడుగుల రోడ్డుకు భూమి పూజ చేస్తారు. 2 నుంచి 3.30 గంటల వరకు కర్నూలు ప్రజలతో సంభాషిస్తారు. 3.35 నుంచి 5.05 గంటల వరకు క్యాడర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ ఈసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్‌లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్‌కి చెందిన పెరుమళ్ల రాజేష్ 6వ ర్యాంకు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్ ముబారక్ నగర్‌కి చెందిన షేక్ ముస్కాన్ 6వ ర్యాంకు, షేక్ తజ్మీన్ 10వ ర్యాంకు సాధించారు. ‘సిల్వర్‌జూబ్లీ’లో వందశాతం ఫలితాలు కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 6వ సెమిస్టర్ ఫలితాలను గురువారం ఆ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మొత్తం 216 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా 216 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారని పరీక్షల విభాగం డీన్ డాక్టర్ కె నాగరాజు శెట్టి తెలిపారు. ఆ తరువాత రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. సిల్వర్ జూబ్లీ కాలేజీ అంటే ఓ బ్రాండ్ అని, ఇక్కడ చదివిన వారందరు గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. సిల్వర్‌జూబ్లీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల కృష్ణయ్య శెట్టి, డాక్టర్ పి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆడనే చంపేస్తున్నారు!
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి స్త్రీ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటి వేధింపుల భయంతోనే కొందరు కడుపులోనే పిండాన్ని నిర్ధా్దక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు. ఈ కారణంగా సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఆడపిల్లలు లభించక చాలా మంది పురుషులకు వివాహాలు కాని పరిస్థితి నెలకొంది. కర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కర్నూలు జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధా్దరణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధా్దక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. ఆర్ఎంపీలకు నజరానాలు జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. లింగనిర్ధారణ చేస్తే జైలుకే...కానీ...! భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్డీటీ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఈ చట్టం కింద ఏ ఒక్కరికీ శిక్ష పడదు. ఈ చట్టం ఒకటి ఉందని రోగులకు, గర్భిణిలకు తెలిసేటట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు మాత్రం ప్రదర్శించి ఉంటాయి. కానీ కొన్నిచోట్ల అదే ప్రాంతాల్లో లింగనిర్ధారణ జరుగుతుంది. గతంలో 10 ఏళ్ల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కర్నూలు, కోడుమూరు, గూడూరు ప్రాంతాల్లో స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించి స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన మిషన్ల పక్కనే మరో మిషన్‌ను తీసుకొచ్చి లింగనిర్ధారణ చేసిన వైద్యశిఖామణులు ఉన్నారు. ఆయా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉండటంతో ఇలా సీజ్ చేస్తే అలా తెరిపించుకునే స్థాయిలో ఉన్నారు.తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్‌లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు -
సెలవులకు వెళ్లి.. విగతజీవులుగా తిరిగొచ్చి!
● మల్లేపల్లె చెరువు మృతుల్లో ఇద్దరు పెద్ద బోధనం చిన్నారులు ● కుమారుల మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు చాగలమర్రి: వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరిలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా తిరిగివచ్చారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మంఠం మండలం మల్లేపల్లె గ్రామంలో మంగళవారం చెరువులో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడిన విషయం విదితమే. ఐదుగురులో ఇద్దరు చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్దబోధనం గ్రామానికి చెందిన సుందరి పాపన్న, నారాయణమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వెంకటసుబ్బయ్యకు బ్రహ్మాంగారి మఠం మండలం మల్లేపల్లికి చెందిన వెంకట భవానితో వివాహమైంది. వెంకట సుబ్బయ్య హోంగార్డుగా పని చేస్తూ హైదరాబాదులో నివాసముంటున్నాడు. వీరికి వెంకట చరణ్(15), వెంకట పార్థు(13) కుమారులు కాగా అక్కడే చదువుతున్నారు. ఎంతో అల్లారుముద్దగా చూసుకుంటున్న కుమారులను వెంకట సుబ్బయ్య వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు మల్లేపల్లెలో వదిలేసి వెళ్లాడు. కాగా మంగళవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు మరో ముగ్గురుతో కలసి గ్రామ చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ చెరువులో మట్టి కోసం తవ్విన లోతైన గుంతల వైపు వెళ్లి ఐదుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బుధవారం ఉదయం కుటుంబీకులకు అప్పగించారు. వెంకట చరణ్, వెంకట పార్థు మృతదేహాలను స్వగ్రామమైన పెద్దబోధనం గ్రామానికి తరలించారు. విగత జీవులుగా ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి సెలవులు తమ కుమారులకు శాశ్వత సెలవులుగా మారాయని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో మరో ఏడుగురి అరెస్టు
ఆలూరు రూరల్: ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్, రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హత్యకేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దన్న, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్‌లను బుధవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు–బళ్లారి రహదారిలోని విడపకల్లు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవి శంకర్ రెడ్డి, చిప్పగిరి, ఆలూరు, హొళగుంద ఎస్ఐలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, దిలీప్ కుమార్‌లతో కలిసి బుధవారం ఆలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆలూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ కారును లారీతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఓ భూ వివాదంలో లక్ష్మీ నారాయణ కలుగచేసుకుని గౌసియా, పెద్దన్న, గుమ్మనూరు నారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడన్నారు. దీంతో ముగ్గురు కలసి లక్ష్మీనారాయణను అంతమొందించారన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మొదట 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే బేపర్ గౌసియా, రాజేష్, సౌభాగ్యలను ఈ నెల 2వ తేదీ అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. ఈ మేరకు అదుపులో తీసుకున్న ఏడుగురు లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు చెప్పారు. అలాగే గుమ్మనూరు నారాయణ ప్రమేయం ఉండడంతో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దీంతో ఈ హత్యకేసులో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. కాగా లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వైకుంఠం ప్రసాద్, వైంకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు నమోదు చేయగా విచారణలో వారి ప్రమేయం లేదని తేలిందన్నారు. హత్య కేసులో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందని బాధితులు ఆధారాలతో నిరూపిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
ఇద్దరు సారా తయారీదారుల అరెస్ట్
నందికొట్కూరు: నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందికొట్కూరు పట్టణంలో జగనన్న కాలనీలో సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం ఎకై ్సజ్ సీఐ రామాంజనేయులు సిబ్బందితో దాడి చేశారు. మంగలి శ్రీనివాసులు ఇంటిలో 132 లీటర్ల నాటు సారా లభించడంతో సీజ్ చేసి, 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. శ్రీనివాసులు ఇంటిని షికారి రవి, షికారి నానా సింగ్, షికారి భారతి అద్దెకు తీసుకుని సారా తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగలి శ్రీనివాసులను, షికారి రవిని అరెస్టు చేసి చేసి రిమాండ్‌కు తరలించారు. నానా సింగ్ పరారీలో ఉన్నాడని, సారా కేసులో ఇప్పటికే షికారి భారతి జైల్లో ఉందని సీఐ తెలిపారు. అలాగే వీరికి నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన నందికొట్కూరు షికారి కాలనీకి చెందిన షికారి రవి మీద కూడా కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐ జఫ్రూళ్ల, హెడ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్, పద్మనాభం, కుమారి, కానిస్టేబుళ్లు మధుసూదన్, ప్రసాద్, శివన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మాధవస్వామి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మద్యం పట్టివేత శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళల వద్ద 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా శ్రీశైలం టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా శ్రీశైలానికి చెందిన బీబీ, పిక్కిలి రేణుక సున్నిపెంట నుంచి ఆర్టీసీ బస్సులో 50 మద్యం సీసాలు తీసుకుని వస్తుండగా తనిఖీలో దొరికారన్నారు. మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. క్షేత్రంలో దేవదాయచట్టం ప్రకారం ఎవరైనా మద్యం సేవించకూడదని, అలాగే మద్యం కూడా కలిగి ఉండకూడదని సీఐ హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రఘునాథుడు, బాలకృష్ణ, బలోజానాయక్, నానునాయక్, వెంకటనారాయణ, కృష్ణవేణి, దేవస్థాన హోంగార్డులు కిరణ్, దొరబాబు పాల్గొన్నారు. -
అక్రమ రవాణా.. అడ్డుకుంటే ఒట్టు!
నాగలదిన్నె వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు నందవరం: అధికార దర్పానికి తల వంచారో లేక మామూళ్ల మత్తుకు చేతులు ముడుచుకున్నారో? ఏమో? ఇక్కడ అధికారుల కళ్లెదుటే ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డదిడ్డంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పల్లెత్తు మాట అనడం లేదు. మచ్చుకు అభ్యంతరం కూడా చెప్పడం లేదు. నది నుంచి ఇసుకను తోడేస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కుర్చీలకు పరిమితమై నిర్లక్ష్యపు నీడలో నిద్దరోతున్నారు. మండలంలోని నాగలదిన్నె, నదికై రవాడి గ్రామాలను అనుకొని ఉన్న అడ్డదారుల్లో పచ్చముకలు మాఫియాగా ఏర్పడి తుంగభద్ర నదిపై వాలిపోతున్నారు. పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా దోచుకెళుతున్నారు. అక్రమ రవాణాతో విసుగెత్తిన గ్రామస్తులు ఎన్నోసార్లు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. ఆ రెండు గ్రామాల స్థావరాల నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఇక్కడి అధికారులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు తమ తీరు మార్చుకొని ఇసుక మాఫీయాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నా బిడ్డ జొలికొస్తే వదిలేదేల్యా..
నంద్యాల: బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు. మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యతి్నంచాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి. -
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి సీ్త్ర కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింట
● యథేచ్ఛగా భ్రూణ హత్యలు ● ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ ● ప్రోత్సహిస్తున్న వైద్యులు, పలు ప్రైవేట్ ఆసుపత్రులు ● స్కానింగ్ సెంటర్లపై నిఘా శూన్యం ● తూతూ మంత్రంగా తనిఖీలు ● గత నెలలో 40 సెంటర్లలో తనిఖీలు.. అంతా బాగుందని సర్టిఫికెట్కర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధ్దారణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధ్దాక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. ఆర్ఎంపీలకు నజరానాలు జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. -
● గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వ పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వకు అవకాశం ఉంటుందని నిపుణుల బృందం సభ్యులు అధికారులకు సూచించారు. జలాశయం కట్ట కుంగిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యు లు సందర్శించారు. కమిటీలోని సీడీఓ సీఈ విజయభాస్కర్, సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ శివకుమార్‌రెడ్డి, ఈఈ మనోహరెడ్డి, సుభకుమార్, డీఈలు రీనా, కేధారేశ్వరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ప్రసూనాదేవి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. ముందుగా డ్యామ్ డిజైన్, కట్ట కుంగిన ప్రాంతం, జారుతున్న రాతిపరుపు, లీకేజీలు తదితర అంశాలను పరిశీలించారు. ఒకే చోట కట్ట కుంగడంపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కట్ట కుంగిన చోటా ఎత్తు 259 మీటర్లు మాత్రమే ఉందని, 265.06 మీటర్లు ఎత్తు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కట్ట పూర్తి స్థాయిలో నిర్మించి కాంక్రీట్ చానెళ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు కట్టలోకి వెళ్లకుండా నేరుగా జలాశయంలోకి వెళ్తుందన్నారు. భూమి లోపల పొరల వల్ల కూడా కట్ట కుంగే ప్రమాదం ఉందన్నారు. కట్టలోని 7 ప్యానెళ్లలో రాతి పరుపు దెబ్బతిన్నట్లు గుర్తించి లూస్ సాయిల్‌ను తొలగించాలన్నారు. కొత్తగా కంకర, ఇసుకతో ఫిల్ చేసి కట్టను పటిష్టం చేయాలని సూచించారు. జలాశయంలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వారి వెంట డీఈఈలు జ్యోతి, గీతా, శివప్రసాద్, ఏఈలు, జేఈఈలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
ఆలూరు రూరల్: కారు, మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని హులేబీడు సమీపంలోని హైవే–167లో మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. బళ్లారికి చెందిన రంగప్రసాద్ కుటుంబంతో కలిసి ఎమ్మిగనూరు నుంచి కారులో బళ్లారికి వెళ్తున్నాడు. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన మినీ లారీ కందుల లోడుతో ఆదోనికి వెళ్తోంది. హులేబీడు గ్రామ సమీపంలో కారు, మినీ లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రంగప్రసాద్ చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. భార్య అనురాధ, కుమారులు గౌతం రంగ, మౌనిత్ రంగకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే మినీలారీ డ్రైవర్ ప్రతాప్, కందులను విక్రయించేందుకు వెళ్తున్న రైతు గాదిలింగకు గాయాలయ్యాయి. అక్కడున్న వారు క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. -
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
ఆస్పరి/ఆదోని రూరల్: ఆదోని మండలం నాగనాథహళ్లి గ్రామ సమీపంలో మంగళవారం పిడుగు పడటంతో ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన శంకరబండ గోవిందు (33) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ములుగుందం గ్రామానికి చెందిన గోవిందుతో పాటు మరోఆరుగురు కాపరులు నాగనాథహళ్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. మంగళవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. గొర్రెల వద్ద ఉన్న గోవిందుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య రంగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందు మృతితో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.ముత్తుకూరులో ఎద్దు మృత్యువాతఆస్పరి: మండలంలోని ముత్తుకూరు గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు కారుమంచి మల్లికార్జున రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. రైతు మల్లికార్జునరెడ్డి ఎద్దులను వామిదొడ్డి వద్ద కట్టి ఉంచాడు. ఒక్కసారిగా ఉరుములు ఏర్పడి పిడుగు ఎద్దులపై పడడంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయని రైతు తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎద్దు మృతితో రూ.80 వేలు నష్టం వాటిల్లిందని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రచారం లేకుండానే ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ తగదు
కర్నూలు(టౌన్): టీజీవీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి బై ప్రోడక్ట్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఫ్యాక్టరీపై ముందుగా పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా, ప్రచారం లేకుండా ప్రజాభిప్రాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామక్రిష్ణ రెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిశారు. కెమికల్ ఫ్యాక్టరీ యజమాన్యం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఈసందర్భంగా కోరారు. బైప్రోడక్ట్ వల్ల ప్రజలకు, రైతులకు తాగునీరు, సాగునీరు సమస్యలు వస్తాయని సూచించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నా.. అనుమతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారన్నారు. పరిసర ప్రాంత ప్రజలకు ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న ప్రోడక్ట్ గురించి వివరించాలన్నారు. ఎస్వీని కలిసిన వారిలో సీఐటీయూ కన్వీనర్ రాధక్రిష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు రత్నం ఏసేపు, కెపీఎన్ఎస్ నాయకులు ఆనంద్‌బాబు, ఎస్డీపిఐ నాయకులు జహంగీర్, సుంకన్న ఉన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి -
22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు సంఘం నేతలు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్యదర్శి అనిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన మేరకు ఈ నెల 5వ తేదీలోపు తమకు అందిన మార్కుల జాబితాలు, కుల ధ్రువీకరణ పత్రాల మేరకు ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. పెద్దపాడు రోడ్డులోని బీరప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. -
ఖరీఫ్‌కు సిద్ధమవుదాం
● లోతు దుక్కులతో ఎన్నో ఉపయోగాలు ● పొలాల్లో గొర్రెలు మంద కట్టడం వల్ల సేంద్రియ పదార్థం పెరుగుదల ● నేల గుల్ల బారుతుంది.. సకాలంలో విత్తనం వేసుకోవచ్చు ● కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి సూచనలు కర్నూలు అగ్రికల్చర్: వేసవి.. పొలాల్లో పంటలు లేని సమయం. అతి ముఖ్యమైన పొలం పనులు చేపట్టాల్సింది వేసవిలోనే. తొలకరితో మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో చేపట్టే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. వేసవిలో చేపట్టాల్సిన పనులను కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వివరించారు. లోతు దుక్కులు ఇటీవల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో లోతు దుక్కులు దున్నాలి. దుక్కుల లోతు సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండాలి. అలా లోతు దుక్కులు చేసినప్పుడు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం అవసరం. వర్షాలు తగ్గినందున వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుంది. నేలలోని చీడ పీడలు నశిస్తాయి లోతు దుక్కులు దున్నినప్పుడు నేలపై పొరల్లో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంది. నేలను లోతుగా దున్నినప్పుడు నేలలో దాక్కునే లేదా నిద్రావస్థలో ఉంటే పురుగులు, నేలలో ఉండి తెగుళ్లను కలగజేసే శిలీంద్రాలు ఎండల బారిన పడి నశిస్తాయి. అందువల్ల వేసవిలో పొలాలను లోతు దుక్కి చేసుకుంటే తొలకరిలో విత్తుకునే పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేల గుల్లబారుతుంది వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు గొ ర్రు తిప్పి గుంటలతో సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతె వంటి పరికరాలు నేల లోపలికి 3–5 అంగుళాల లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడం వల్ల నేల లోపల సుమారుగా 3–5 అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టి పొర ఛేదింపబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది. సేంద్రియ పదార్థం నేలలో కలుస్తుంది... పంటల కోతల తర్వాత నేలపై మిగిలే పంటల మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. అందువల్ల నేలలో సేంద్రియ పదార్థాలు, పోషక విలువలు పెరగడానికి అవకాశం ఉంది. పశువుల ఎరువులను తోలడం సంవత్సరం పొడవునా నిల్వ చేసిన పశువుల ఎరువులను ఎండాకాలంలోనే పొలాల్లోకి తోలా లి. వర్షాలు పడిన తర్వాత పొలాలకు తోలిన పశువుల ఎరువులను నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. వేసవి దుక్కులు చేస్తున్న దృశ్యం పశువులు/గొర్రెలు మందకట్టడం ఈ పని కూడా రైతులు వేసవిలో చేసుకోవచ్చు. లోగడ ప్రతి రైతుకు ఎద్దులు, ఆవులు, గేదెలు ఉండేవి. వాటిని రాత్రిళ్లు పొలంలో కట్టేసేవారు. వాటి మల మూత్రాలు పొలానికి తిన్నగా చేరి పంటలకు ఉపయోగపడేవి. ఇందువల్ల ఎరువుల ఖర్చు తగ్గేది. ఇప్పుడు పాంచకట్టేసే పశుగణాలు తగ్గిపోయాయి. పశుగణం ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈ పని ఇప్పటికై నా చేయవచ్చు. గొర్రెలను పొలంలో మందకట్టడం రైతులకు పరిపాటే. ఈ పని ఎండాకాలంలోనే చేయాలి. నిద్రలో ఉన్న గొర్రెల మందలను రాత్రిళ్లు ఎక్కువసార్లు లేపితే ఎక్కువసార్లు పెంటికలను వేస్తాయి. దీనివల్ల చేనుకు అవసరమైనంత గొర్రెల ఎరువు, మూత్రం లభ్యమవుతుంది. ఇలా నేలకు సేంద్రియ ఎరువులను అందించవచ్చు.మొండిజాతి కలుపు నివారణ తుంగ, గరిక, దర్బ వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలగజేస్తుంటాయి. వీటి వేర్లు, కాయలు, దుబ్బులు నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. పంటలు వేసినప్పుడు వాటితో పాటు పెరిగి నష్టం కలగచేస్తాయి. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల కాయలు, వేర్లు దుంపలు పెకలింపబడి, వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు నశించడానికి అవకాశం ఉంటుంది. నేలపైకి తేలిన కాయలు, వేర్లు దుంపలను ఏరివేసి వీటిని అరికట్టవచ్చు. -
గరుడ వాహనంపై పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీ సెంటర్ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులచే నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. బుధవారం గజేంద్ర వాహనంతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి వెల్లడించారు. -
12 మండలాల్లో అకాల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 32.2, కర్నూలు అర్బన్‌లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం వర్సిటీలోని వీసీ ఛాంబర్లో ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వీసీ మాట్లాడుతూ యూజీ నాల్గవ సెమిస్టర్ బీఏ ఎకనామిక్స్ (హానర్స్), బీకాం (హానర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ జువాలజీ, ఆరో సెమిస్టర్ బీఏ (హెచ్ఈపీ), బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, ఎనిమిదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, పదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ ఫలితాలను విడుదల చేశామన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్ htt pr://ah uuk.-a-c.i n లో అందుబాటు ఉన్నాయన్నారు. వాము వ్యాపారులు సిండికేట్ ● తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్ హాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ హాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
భార్య హత్యకేసులో భర్త అరెస్టు
బేతంచెర్ల: పట్టణంలోని గౌరిపేటలో ఈనెల 9న షేక్ జకీయా బేగంను హత్య చేసిన కేసులో ఆమె భర్త షేక్ రసూల్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్ల్లో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన షేక్ రసూల్ కోసం గాలింపు చేపట్టి బనగానపల్లె రహదారిలోని చెలిమె వద్దనున్న మౌలాలి స్వామి దర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. ఎస్ఐ రమేష్‌బాబు, పోలీస్ సిబ్బంది రాఘవేంద్ర, దస్తగిరి, చంద్రశేఖరప్ప, మహేష్ పాల్గొన్నారు. -
పేదల ఆసుపత్రిలో ‘పెద్దాపరేషన్లు’
● ప్రొక్లెయిన్ పొట్ట చీల్చింది.. పెద్దాసుపత్రి ప్రాణం పోసింది ● మరో బాలుడికి అరుదైన శస్త్రచికిత్సతో సాధారణ జీవితం కర్నూలు(హాస్పిటల్): అరుదైన ఆపరేషన్లు చేస్తూ పెద్దాసుపత్రి మరింత ఖ్యాతిని సొంతం చేసుకుంటుంది. కార్పొరేట్ హాస్పిటళ్లలో జరిగే పెద్ద పెద్ద శస్త్రచికిత్సలను సర్వజన వైద్య సిబ్బంది చేస్తూ పేదల ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఇద్దరు బాలురకు అరుదైన ఆపరేషన్ చేయడంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన ఇనాయతుల్లా కుమారుడు షేక్ తౌఫిక్(17) నంద్యాలలోని జేవీఆర్ కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. గత మార్చిలో రంజాన్ పండుగకు సొంతూరికి వచ్చిన అతను పండుగకు ఒక రోజు ముందు స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతన్ని ప్రొక్లెయిన్(జేసీబీ) ఢీకొంది. వాహనానికి ముందు భాగం నేరుగా ఢీకొనడంతో అతని పొట్ట చీలిపోయి పేగులు, డియోడినమ్ ఛిద్రమయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ప్రాథమిక వైద్యం చేయించి 31వ తేదీ రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. పరిస్థితి చూసిన వైద్యులు సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ శృతి, అనెస్తెటిస్ట్ డాక్టర్ సోమశేఖర్ చలించిపోయారు. వెంటనే రాత్రి 10 గంటలకు అత్యవసర ఆపరేషన్ థియేటర్‌కు తరలించి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ దశల్లో ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. 43 రోజుల పాటు వివిధ రూపాల్లో చికిత్స నిర్వహించడంతో కోలుకున్నాడు. దీంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో.. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వేణుగోపాల్(15)కు పుట్టుకతోనే మలద్వారం ఏర్పడలేదు. ఈ దశకు అతను శిశువుగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి తాత్కాలిక మలద్వారాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి అతనికి మలవిసర్జన సరిగ్గా ఉండేది కాదు. నిత్యం డైపర్స్ వాడాల్సి వచ్చేది. చికిత్స కోసం అతను గత ఏప్రిల్ 18న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ సర్జరీ విభాగానికి వచ్చాడు. ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల నేతృత్వంలో అతనికి ఈ నెల 7న మలద్వారాన్ని ఏర్పాటు చేసి కండరాలు బలోపేతం అయ్యేలా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం అందరిలానే మలవిసర్జన చేయగలుగుతుండటంతో మంగళవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
భయపెట్టిన ‘పిడుగు’లు
హొళగుంద: మండలంలోని హొళగుంద, చిన్నహ్యాట, వందవాగిలి, ఎం.డీ హళ్లి, పెద్దగోనెహాళ్, గజ్జహళ్లి తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు భయం పుట్టించాయి. పక్కనే బాంబులు పడుతున్నట్లు పెద్దఎత్తున పిడుగుల శబ్దానికి ప్రజలు వణికిపోయారు. పెద్దగోనెహాళ్ గ్రామం బీసీ కాలనీలో కాశీంవలి అనే వ్యక్తి గుడిసెకు ముందున్న చెట్టుపై పిడుగు పడటంతో విరిగిపడింది. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కాశీంవలి కుటుంబ సభ్యులు బంధువుల ఊరికి వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. దాదాపు అరగంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగుల శాబ్ధాలతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పొలాల్లో నీరు నిలిచాయి. హొళగుంద తేరుబజారులో నీరు చేరింది. వరి ధాన్నాన్ని అమ్ముకోని రైతులు రైస్‌మిల్లులు, పొలాలు, ఎల్లెల్సీ గట్లపై వేసుకున్న ధాన్యం తడవకుండా టార్పిళ్లు కప్పి బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్‌లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు ● -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సంజామల: మండల పరిధిలోని మెట్టుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవుకు పట్టణానికి చెందిన మూడవత్ రసూల్ నాయక్ (56) ఉదయం రామాపురం వద్ద ఉన్న టన్నెల్ వద్దకు పనికి వెళ్తున్నాడు. మెట్టుపల్లె సమీపంలో బైక్‌పై వెళ్లున్న రసూల్ నాయక్‌ను ఎదురుగా వచ్చిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు జనార్ధన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
కర్నూలు జిల్లా: కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుమ్మనూరు నారాయణను ఆలూరు పీఎస్‌కు తరలించారు. ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, గత నెలలో గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు సైతం గాయాలయ్యాయి. -
కర్నూలులో కాలుష్య కాసారం
ఇదో భయంకర కాలుష్య కథ. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిషేధించిన అత్యంత ప్రమాదకర రసాయనాలను ఉత్పత్తి చేసి.. వాటి వ్యర్థాలను తుంగభద్ర, కృష్ణా నదుల్లో కలిపి.. పరీవాహక ప్రాంతాల్లోని గాలి, నీటిని కలుషితం చేసి.. ప్రజలు, జీవుల ఆరోగ్యాలను గుల్లచేయబోతున్న పరిశ్రమ కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను ప్రలోభపెట్టి, నిజాలు దాచిపెట్టి.. ప్రజారోగ్యం కంటే వ్యాపార సామ్రాజ్య విస్తరణ ద్వారా డబ్బు సంపాదనే పరమావధిగా పెట్టుకున్న టీజీవీ గ్రూప్ కథ!సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. భరత్ తండ్రి, బీజేపీ సీనియర్ నాయకుడు టీజీ వెంకటేశ్ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా ఉత్పత్తితో క్లోరిన్ వెలువడుతుంది. ఇది విష వాయువు. క్లోరిన్ రసాయనాలతో టెఫ్లాన్ (పీటీఎఫ్ఈ), క్లోరో మీథేన్ వంటి ఉత్పత్తుల యూనిట్‌ను విస్తరించేందుకు టీజీ గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.పీటీఎఫ్ఈ (పారీ టెట్రాక్లోరో ఇథిలిన్) తయారీలో పీఎఫ్‌వోఏ (ఫర్ఫ్లోరో ఆక్టనాయిక్ యాసిడ్), కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. ప్రమాదకరమైన పీఎఫ్వోఏను జర్మనీ, డెన్మార్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేతో పాటు ఎన్నో దేశాలు నిషేధించాయి. ఆరోగ్యం గుల్లవుతోందని.. ఇలాంటి రసాయనాల వాడకాన్ని శాశ్వతంగా మానేయాలని 2019లో స్టాక్‌హోమ్ కన్వెన్షన్ వేదికగా 180 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.అమెరికాలో డార్క్ వాటర్!అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ (ఫర్ అండ్ పాలీ ఆల్కల్ సబ్‌స్టాన్స్) వాడకంతో ఓ గ్రామంలోని ఆవులు చనిపోయాయి. ఫ్యాక్టరీ సమీప గ్రామాలు, నదిలోని నీరు తాగడంతో అనారోగ్యానికి గురై మనుషులు, జీవరాశులు చనిపోవడంతో అమెరికా ప్రభుత్వం సైన్స్ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఎమరీ యూనివర్సిటీ, నోటర్‌డామ్, లండన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.. 70 వేలమంది రక్త నమూనాలు సేకరించారు. పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ అత్యంత ప్రమాదకరమని తేల్చారు. ఫ్యాక్టరీని మూసేయడంతో పాటు రసాయనాలను నిషేధించారు. దీనిపై ‘డార్క్ వాటర్’ పేరుతో హాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఇప్పుడు అనపర్తి, టీజీ గ్రూప్ ఫ్యాక్టరీలతో మనదగ్గర కూడా అలాంటి ఘోర పరిస్థితి ఉత్పన్నం కానుంది.బుధవారం ప్రజాభిప్రాయ సేకరణఫ్యాక్టరీ ఏర్పాటుపై టీజీ గ్రూప్ ఆల్కలీస్ సమీపంలోని గొందిపర్ల వాసులతో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. కాగా, దీనికి అనుమతులు ఇవ్వొద్దని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వినర్ జీవీ భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.అత్యంత విషపూరిత రసాయనం!ఆల్కలీస్ ఫ్యాక్టరీ తుంగభద్ర ఒడ్డునే ఉంది. దీనికోసం నది ఎగువ భాగంలోని నీటిని వినియోగిస్తారు. వ్యర్థాలను నది దిగువ భాగంలో కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీటీఎఫ్ఈ తయారీకి పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇవి తుంగభద్ర ద్వారా కృష్ణా నదిలో చేరుతాయి. ⇒ తుంగభద్ర, కృష్ణానీటిని ఏపీ, తెలంగాణకు చెందిన 2 కోట్లమందికి పైగా ప్రజలు తాగుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే, రసాయనాలు కలవడంతో ఈ జలాలు విషపూరితం అవుతున్నాయి. క్యాన్సర్, కిడ్నీ, గర్భధారణ ప్రేరిత రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె, రక్త సంబంధిత, పలు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ అనే సంస్థ నుంచి 27 మంది శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ⇒ డాక్టర్ బాబూరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ రాంబాబు, డాక్టర్ అహ్మద్‌ఖాన్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తన్మయ్కుమార్కు ఈ నెల 5న నివేదికను సమర్పించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, కర్నూలు కలెక్టర్ రంజిత్‌బాషాకు కూడా నివేదిక పంపారు.మొన్న బలభద్రపురం.. నేడు కర్నూలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని బలభద్రపురంలోని గ్రాసిం కంపెనీ కాస్టిక్ సోడా ప్రాజెక్టు విస్తరణకు 2023 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అప్పట్లో మానవ హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ అనుమతులను సాకుగా చూపి టీజీ గ్రూప్ కూడా పావులు కదిపేందుకు సిద్ధమైంది. భరత్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి.. టీజీ వెంకటేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు కావడం, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.నివేదికలో ముప్పును తొక్కిపెట్టి పీటీఎఫ్ఈ ఉత్పత్తికి ఏ రసాయనాలు ముడి పదార్థాలుగా వాడతారు? టెక్నాలజీ ఎవరి నుంచి కొనుగోలు చేస్తారు? ఎలాంటి వ్యర్థాలు వెలువడతాయి..? ప్రమాదకర రసాయనాలను ఏం చేస్తారు? అనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లో టీజీ గ్రూప్ స్పష్టం చేయకపోవడం గమనార్హం.ప్రాణాలు ముఖ్యమా.. ఆదాయం ముఖ్యమా! అత్యంత విషపూరిత రసాయనాలు వెలువడే టీజీ ఫ్యాక్టరీకి అనుమతులివ్వొద్దు. కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు ప్రాణాధారం. తుంగభద్ర, కృష్ణా జలాలు విషపూరితం అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో జన జీవనం ఛిన్నాభిన్నం అవుతుంది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ప్రభుత్వాలకు ముఖ్యం కాకూడదు. కేవలం ఆదాయం కోసం టీజీ భరత్, టీజీ వెంకటేశ్ కాలుష్యకారక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. – రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ గ్రామసభను కూడా రద్దు చేయాలి ప్రపంచ దేశాలు నిషేధించిన రసాయనాలు ఇక్కడ తయారు చేయడం దుర్మార్గం ఆర్22, ఆర్23, పీటీఎఫ్ఈ తయారీలో సాంకేతిక, ప్రమాద నిర్వహణ వివరాలు, టీఎఫ్ఈ, పీఎఫ్‌ఐబీ లాంటి ప్రమాదకర రసాయనాల ప్రభావం ప్రస్తావనే లేదు. గ్రామసభను కూడా రద్దు చేయాలి. – అల్లాబక్ష్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రపంచంలో నిషేధం.. మనదగ్గర అనుమతా? ప్రజలు, జీవరాశి పాలిట అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ప్రపంచ దేశాలు నిషేదిస్తున్నాయి. కానీ, కర్నూలులో వాస్తవాలు దాచి పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాలు వినియోగించే ప్రాంతాలతో పాటు గాలి కాలుష్యం ద్వారా ఏపీ, తెలంగాణలో తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రామసభను రద్దు చేయాలి. కంపెనీ ప్రతినిధులతో వాస్తవాలు చెప్పించాలి. నష్టం అంచనా వేసి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ బాబూరావు, శాస్త్రవేత్త, హైదరాబాద్ -
ప్రాణం తీసిన ఇనుప కడ్డీలు
మంత్రాలయం రూరల్: ఇనుప కడ్డీలు మీద పడి వెల్డింగ్ కార్మికుడు గొల్ల పవన్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శివాంజల్ తెలిపిన వివరా లు ఇవి.. నందవరం మండలం నదికై రవాడి గ్రామానికి చెందిన గొల్ల పవన్ మంత్రాలయంలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. సోమవారం పనుల నిమిత్తం ఎమ్మిగనూరుకి వెళ్లి ఆటోలో ఇనుప కడ్డీలు తీసుకువచ్చాడు. మంత్రాలయంలోని పరిమళ లాడ్జ్ సమీపంలో ఆటో టైర్ బురదలో కూరుకుపోయింది. అక్కడ ఉన్న కొంత మందితో ఆటోను బురదలోంచి పైకి ఎత్తడంతో ముందుకెళ్లి బోల్తా పడింది. వెనుక భాగంలో ఉన్న గొల్ల పవన్‌పై ఆటోపై ఉన్న ఇనుప కడ్డీలు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. గొల్ల పవన్‌కు భార్య గొల్ల పవిత్ర, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
ప్రాథమిక పాఠశాల విద్య ఇక నిర్వీర్యం
కర్నూలు సిటీ: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాథమిక విద్యను ఇక నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్చాల రవికుమార్, నవీన్ పాటి, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్‌కుమార్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విస్మరించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జీఓ 117 రద్దు చేసి, పాత విధానాన్నే తీసుకొస్తామని హామీనిచ్చిన విషయం మర్చిపోయారన్నారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ గందరగోళంగా మారిందన్నారు. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని కోరారు. ఎస్జీటీలకు మ్యానువల్‌గానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని, పదోన్నతుల్లో సీనియారిటీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం డీఈఓ శామ్యూల్ పాల్కి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఆ సంఘం నాయకులు జయరాజు, హనుమంతు, యేహోషువా, కౌలన్న, భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలి డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా -
సబ్సిడీ తగ్గి.. ధర పెరిగి!
నాణ్యత ప్రశ్నార్థకమే! ఉమ్మడి జిల్లాకు అవసరమైన వేరుశనగను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) సరఫరా చేస్తోంది. వేరుశనగ విత్తనోత్పత్తి లేకపోవడంతో దళారులే ఆధార మయ్యారు. గత ఏడాది పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విత్తనం కాయల ప్యాకెట్లలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్త చెదారం ఉండటం, విత్తనం నాసిరకంగా ఉండటం పట్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. వేరుశనగ నాణ్యత బాగాలేదని వ్యవసాయ అధికారులు కూడా వెనక్కి పంపించారు. ఈ సారైన వేరుశనగ విత్తనం కాయల్లో నాణ్యత ఉంటుందా అదే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వేరుశనగ కోసం దళారులపై ఆధారపడుతుండటంతోనాణ్యత కొండెక్కుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు కూటమి ప్రభుత్వం ఆరకొరగా వేరుశనగ విత్తనాలు కేటాయించింది. వీటికి బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ధర ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనం కాయలను 35 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 25 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేల హెక్టార్లలో వేరుశనగ పంటశ సాగు చేస్తారు. మొత్తం 32,181 క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. కానీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అంతంత మాత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వేరుశనగ పూర్తి ధర నిర్ణయించినప్పటికీ సబ్సిడీ ప్రకటించలేదు. గత ఏడాది 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. ఈ సారి కూడా 25 శాతం వరకే సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆలూరు, పత్తికొండ, ఎమ్మగనూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కొసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు మండలాల్లో సాగు చేస్తారు. కేటాయింపులు నామమాత్రం గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 13,804, నంద్యాల జిల్లాలో 3,063 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయలు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. వేరుశనగ సాగు కర్నూలు జిల్లాలో 55 వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 30 వేల హెక్టార్ల వరకు సాగవుతంది. కర్నూలు జిల్లాకు 18,310, నంద్యాల జిల్లాకు 14,181 ప్రకారం 32,491 క్వింటాళ్లు అవసరమని జిల్లా వ్యవసాయ యంత్రాంగం నివేదించింది. ఈ ప్రకారం కేటాయించకపోయినా.. గత ఏడాది మేరకు కేటాయించాలి. కాని తూతూ మంత్రంగా కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్కెట్లో వేరుశనగ క్వింటాకు రూ.6,500 వరకు ధర ఉంది. ప్రభుత్వం మాత్రం రైతులకు పంపిణీ చేసే వేరుశనగ ధర రూ.9,300గా నిర్ణయించింది. దళారులకు మేలు చేసే విధంగా ధర నిర్ణయించిందనే విమర్శలు ఉన్నాయి. కేటాయింపులు ఇలా... కర్నూలు జిల్లాకు 9,099 క్వింటాళ్లు కేటయించగా.. సాగు విస్తీర్ణాన్ని బట్టి సబ్ డివిజన్లు, మండలాలకు జిల్లా వ్యవసాయ కేటాయించింది. కర్నూలు సబ్ డివిజన్‌కు 495, ఆదోని సబ్‌డివిజన్‌కు 1,182, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌కు 320, ఆలూరు సబ్ డివిజన్‌కు 1017, పత్తికొండ సబ్ డివిజన్‌కు 6,085 క్వింటాళ్లు ప్రకారం కేటాయించారు. నంద్యాల జిల్లాకు కేటాయించిన 2,009 క్వింటాళ్ల విత్తనాలను ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, కోవెలకుంట్ల తదితర మండలాలకు కేటయించారు. వేరుశనగ రైతును ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అవసరం 32,471 క్వింటాళ్లు కేటాయింపు 11,108 క్వింటాళ్లు మాత్రమే మార్కెట్లో ధర రూ.6,500 అయితే.. ప్రభుత్వం ధర రూ.9,300 -
విద్యార్థులకు తప్పిన ముప్పు
మహానంది: గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రైల్వే ఏఎస్ఐ హనుమంత రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కర్నూలు నుంచి కళాశాలకు వస్తున్నారు. అదే సమయంలో తిరుపతి నుంచి గుంటూరు వెళ్లే రైలు వస్తుండటంతో గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద గేటు మూశారు. అయితే కారు వేగంగా రావడంతో అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొని పట్టాల పైకి వచ్చి ఆగింది. వెంటనే గేట్మెన్ అప్రమత్తతతో దూరంగా వస్తున్న రైలు ఆగి పోయింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా రైల్వే గేటు దెబ్బ తినడంతో మరమ్మతులు చేపట్టారు. కాగా దాదాపు మూడు గంటల మేర మహానంది, గాజులపల్లి నుంచి మహానందికి వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి చేరుకున్న కారు గేట్‌మన్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం -
మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం
కర్నూలు(టౌన్): చిలకలూరి పేటలో మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరును దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు శశికళ అన్నారు. కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొనినిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మహిళలపై అమానీయంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖపై చర్యలు తీసుకోవడంలో సాటి మహిళా హోంమంత్రి అనిత ఘోరంగా విఫ లం చెందారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పనపై రాత్రికి రాత్రి కేసు పెట్టి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. రౌడీలా వ్యవహరించిన సీఐ సుబ్బరాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. ఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు భారతి, నగర అధ్యక్షురాలు మంగమ్మ, 4 వ వార్డు కార్పోరేటర్ ఆర్షియా ఫర్హీన్ పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన -
కౌతాళంలో ప్రసాదం పంపిణీ
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసులో భాగంగా సోమవారం కౌతాళంలో సఫ్రాలుట్న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదర్థాన్ని డప్పువాయిద్యాల మధ్య దర్గాకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనల అనంతరం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ప్రసాదాన్ని ముగ్గురు భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం పొలంలో పాతితే పంట బాగా పండుతుందని, రోగం ఉన్నవారు తింటే వారికి రోగం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ ప్రసాదం కోసం పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ అశోక్‌కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
శేషవాహనంపై విహరించిన పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో ఆరవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు శేష వాహనంపై కొలువుదీరగా పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు ఆలయాన్ని చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పాండురంగ విఠలేశ్వరుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. బీఈడీ పరీక్ష ఫలితాల విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ (2015–19) 1,2,3,4, సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌కు 155 మంది పరీక్ష రాయగా 108, రెండో సెమిస్టర్‌కు 47కు 34, మూడో సెమిస్టర్‌కు 76కు 43, నాలుగో సెమిస్టర్‌కు 72కు 51 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మల్లేశ్వరస్వామి జాతరకు తరలిన భక్తులు హొళగుంద: కర్ణాటక రాష్ట్రం తెక్కలకోట గ్రామ కొండల్లో నిర్వహిస్తున్న మల్లేశ్వరస్వామి జాతరకు హొళగుంద మండలం నుంచి భక్తులు సోమవారం తరలివెళ్లారు. మల్లేశ్వరస్వామిని వాల్మీకులు కొలుస్తారు. ఏటా స్వామి రథోత్సవానికి ముందు బండారం సమర్పించేందుకు భక్తులు డోలు, మేళ తాళాలతో హొళగుంద నుంచి కర్ణాటకకు ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీ. హొళగుందకు 30 కి.మీ. దూరంలో ఉన్న స్వామి సన్నిధికి చేరుకునేందుకు సోమవారం చెప్పులు లేకుండా కాలినడకతో బయలుదేరారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 3,842 మంది విద్యార్థులకుగాను 3,660 మంది హాజరు కాగా 182 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షలకు 660 మంది విద్యార్థులకుగాను 601 మంది హాజరు కాగా 59 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ గురవయ్య శెట్టితో పాటు డీఈసీ మెంబర్లు, కస్టోడియన్స్, స్క్వాడ్ బృందాలు మొత్తం 30 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 19 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఎంపిక చేసినట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 18 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్స్‌ను వాట్సాప్ మన మిత్ర(వాట్సాప్ గవర్నెన్స్)నుంచి 9552300009కు హాయ్ అని పంపి విద్యా సేవలను ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. -
పల్లెకు రాని ‘వెలుగు’
బస్సులు వెళ్లని గ్రామాల సంఖ్య.. మండలం బస్సు వెళ్లని గ్రామాలు కృష్ణగిరి 28 వెల్దుర్తి 27 తుగ్గలి 37 పత్తికొండ 8 మద్దికెర 6కృష్ణగిరి: గ్రామీణ ప్రాంతాలకు ‘పల్లె వెలుగు’ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధిలేని పరిస్థితుల్లో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉండగా.. మొత్తం 106 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కేవలం 65 గ్రామాలకు మాత్రమే రోజుకు ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ద్విచక్ర, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదీ దుస్థితి.. ● గతంలో డోన్ నుంచి కంబాలపాడు, వెల్దుర్తి, కోడుమూరు నుంచి పలు బస్సు సర్వీసులు కృష్ణగిరికి ఉండేవి. నేడు కర్నూలు జిల్లాలో బస్సు సౌకర్యం లేని మండల కేంద్రంగా కృష్ణగిరి నిలిచింది. ప్రజలకు ఆటోలే శరణ్యమయ్యాయి. ● పత్తికొండ నియోజవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యాలు లేవు. ● రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నెకుంట, జి.మల్లాపురం, ఎరుకల చెరువు, పోతుగల్లు, పెనుమాడ, కంబాలపాడు, అమకతాడు, కర్లకుంట, తొగర్చేడు, టి.గోకులపాడు, బోయబొంతిరాళ్ల, ఆలంకొండ, కటారుకొండ, పెద్దొడ్డి, గుడెంపాడు, బాపనదొడ్డి, పుట్లూరు తదితర గ్రామాలకు చెందిన రెండు వేల మంది ప్రజలు డోన్, వెల్దుర్తి, కోడుమూరు ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ● వెల్దుర్తి మండలంలోని చిన్న కులుములపల్లె, శ్రీరంగాపురం, లక్ష్మింపల్లె, చెర్లకొత్తూరు. గోవర్ధనగిరి, కొట్టాల, పేరేముల, ఎల్.నగరం, బింగిదొడ్డి, ఎల్ తాండ, కాశాపురం, సూదాపల్లె, బోగోలు, గువ్వలకుంట, గుంటుపల్లి, అల్లుగుండు, మల్లెపల్లె, నార్లాపురం, వెంకటాపురం, బుక్కాపురం, బోయినపల్లె, సర్సాపురం, తిమ్మాపురం, పిక్కిలివానిపల్లె, బాలాపురం, లింగాలపల్లె, కొసనాపల్లె, మంగంపల్లె గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ● తుగ్గలి మండలంలో 37, మద్దికెర మండలంలో 6 గ్రామాలకు, పత్తికొండ మండలంలో కూడా పుచ్చకాయలమాడ, అటికెలగుండు, కొత్తపల్లి, చక్రాళ్ల, కురవలదొడ్డి, పెద్దహుళ్తి, కోతిరాళ్ల, నలకదొడ్డి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రయాణం.. ప్రమాదకరం బస్సులు లేని కారణంగా భద్రతలేని ఆటోల్లో ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది కాలంలో పత్తికొండ నియోజకవర్గంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆటోల్లో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆటో ప్రయాణం ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో వాటిపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పాఠశాలలకు విద్యార్థులు సైతం ఆట్లోనే వెళ్లుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాల్లో విషాదం నెలకొననుంది. ఆర్టీసీ బస్సుల్లేక గ్రామీణ ప్రజల అవస్థలు ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణం తరచూ ప్రమాదాలు -
వైభవంగా పట్టాభిషేక మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాన్ని స్వామిజీ సుబుధేంద్రతీర్థులు అధిరోహించి 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిజీ పూజా మందిరంలో రాములోరి సంస్థాన పూజలో తరించారు. పట్టాభిషేక దినాన్ని పురస్కరించుకుని యాగశాలలో మృత్యుంజయ, ఆయుష్షు, మార్కండేయ హోమాలు చేపట్టారు. వాస్తు పూజతోపాటు హోమాల పూజల్లో పీఠాధిపతి పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో లోక కళ్యాణార్థం హోమాలు చేసినట్లు స్వామిజీ తెలిపారు. భారత్ సైనికులు సురక్షితంగా ఉండాలని, విజయం వరించాలని కోరారు. లోక కళ్యాణార్థం హోమాలు -
నడిచి వెళ్లాలి
మా గ్రామానికి అసలు బస్సు సౌకర్యమే లేదు. మా గ్రామస్తులు ఎక్కడికై నా నడిచి వెళ్లాల్సి వస్తోంది. హంద్రీ నది దాటి గోరంట్ల గ్రామానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి వెల్దుర్తి, కోడుమూరు, కర్నూలుకు బస్సులు ఉన్నాయి. వర్షాలు వచ్చి హంద్రీ నది వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. – కృష్ణయ్య, ఎస్‌హెచ్ ఎర్రగుడి ఒక్క బస్సు లేదు గతంలో డోన్ నుంచి ఓబులాపురం మీదుగా మా గ్రామం నుంచి కోడుమూరుకు ప్రతి రోజూ ఐదు సార్లు బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఒక్క బస్సు సౌకర్యం లేదు. డోన్‌కు రావాల న్నా, మండల కేంద్రమైన కృష్ణగిరి వెళ్లాలన్నా ఆటోలు దిక్కు అవుతున్నాయి. బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – రామచంద్రుడు, కటారుకొండ చర్యలు తీసుకుంటాం డోన్ బస్సు డిపో పరిధిలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండల్లాలోని పలు గ్రామాలకు గతంలో బస్సులు తిరిగేవి. కానీ ఆ దారుల్లో ఆటోలు ఎక్కవ కావడంతో బస్సు సర్వీసులు నిలిపివేశారు. ఇప్పుడు మరోమారు ఆ దారుల్లో అవసరాన్ని బట్టి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – శశిభూషణ్, ఆర్డీసీ డీఎం, డోన్ -
67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు. 17న పాణ్యంకు సీఎం రాక పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ వెంచర్‌ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మైనారిటీ రుణాల దరఖాస్తుకు 25న ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిష్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు తమ వివరాలను htt pr://apbommr.apcfrr.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. పడిపోయిన మిర్చి ధర ● క్వింటా ధర రూ.8వేలు మించని వైనం కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధరలు మరింత పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్న ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదనే ఉద్దేశంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో మిర్చి సాగు చేసి లాభాల పంట పండించుకున్న రైతులు 2024లో కోలుకోలేని విధంగా నష్టపోయారు. మిర్చి రైతులను ఆదుకుంటామని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేసినా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. 2024 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 95,478 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 22,390 ఎకరాల్లో మిర్చి సాగయింది. చీడపీడల సమస్యలు పెరగడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడులు కూడా పడిపోయాయి. ఇదే సమయంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2022లో మిర్చి ధర రికార్డు స్థాయిలో రూ.53 వేలకు పైగా పలికింది. 2023లో రూ.30 వేల ధర లభించింది. తాజాగా ఎరువు రకం ధర క్వింటాకు కనిష్టంగా రూ.2,299, గరిష్టంగా రూ.8,259 , సగటు ధర రూ.5,669 నమోదైంది. తేజా రకం ధర రూ.7,293 పలికింది. -
ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా
గడువులోగా అర్జీలకు పరిష్కారం కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి కర్నూలు ఆర్డీఓ దగ్గర 23, ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 23, పత్తికొండ ఆర్డీఓ దగ్గర 7, సర్వే ఏడీ దగ్గర 2 వ్యవసాయ, డీఆర్డీఏ, డ్వామా పీడీల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించాలన్నారు. జిల్లాకు 25 వేల సీసీఆర్సీ కార్డులను ఇప్పించేలా లక్ష్యం నిర్దేశించారన్నారు.హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.9,94,980 కాగా, ట్రైకార్ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు. రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు. ఇన్నోవా కారు రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది. ఇన్నోవా కారురెడిమేడ్ గార్మెంట్ యూనిట్ యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు. ఫైల్‌పై ఆరా తీస్తున్నాం ఎన్ఎస్టీఎఫ్డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్‌ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్‌ను తమ ప్లేస్‌లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణిగిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు ● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు ● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు ● కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు ● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు ● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం ● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్ బొలెరో వాహనం -
జిల్లా అంతటా అప్రమత్తం
కర్నూలు: దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులతో ఆదివారం జిల్లా అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావులేకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు సాగుతున్నాయి. ముఖ్యంగా రవాణా వాహనాలపై దృష్టి సారించారు. పార్సల్ కార్యాలయాలు, మార్కెట్ల నుంచి సరుకులు తరలించే వాహనాలను క్షుణంగా తనిఖీ చేశారు. తనిఖీలు ఇలా.. జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వ్యాపార వాణిజ్య సముదాల ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసపుకోని విచారిస్తున్నారు. కర్నూలు రైల్వే స్టేషన్లో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శ్రీధర్, నాగరాజారావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లను అప్రమత్తం చేసి వారికి ముందస్తూ జాగ్రత్తల గురించి తెలియజేశారు. యాంటీసబోటేజ్(విధ్వంస వ్యతిరేక)తనిఖీ చేపట్టారు. అదే సమయంలో కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో అగుగడుగున తనిఖీలు చేసి అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు తారస పడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు -
మంత్రాలయంలో కన్నడ సినీ నటులు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై కన్నడ సినీ నటులు మంత్రాలయం వచ్చారు. ఆదివారం రాత్రి కన్నడ సినీ నటుడు ఉపేంద్ర కుటుంబ సభ్యులు, కన్నడ సినీ నటి శ్రీమతి తార వేర్వేరుగా మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంధ్ర తీర్థులు నటులకు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూలమంత్రాక్షితులతో ఆశీర్వాదం చేశారు. -
రాష్ట్రంలో అరాచక పాలన!
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చేసిన దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఐ సుబ్బరాయుడిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ... రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పన విషయంలోను పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. మహిళ అని చూడకుండా రాత్రి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవ రెడ్డి విషయంలోను పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. పవన్‌కళ్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు 30 వేల మంది మహిళలు కనిపించడంలేదంటూ ఊగి..ఊగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సభల్లో మాట్లాడారని ఎస్వీ గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క మహిళనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతుందని, ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయడం చేతకాక ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సినీ నటుడు పోసాని మురళిపై అక్రమంగా 16 కేసులు నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని..వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తప్పు చేసిన పోలీసులకు శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, కల్లా నరసింహారెడ్డి, ధనుంజయ ఆచారీ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసుల దాష్టీకం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
పాతికేళ్ల తర్వాత..
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం వేడుకగా సాగింది. 1999–20లో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూదూర ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి ఒకరినొకరు పలకరించుకోని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు భాస్కర్‌రెడ్డి, జోజిరెడ్డి, మౌలాళి, ఆంథోనమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజ్‌కుమార్‌రెడ్డి, సుందరయ్యలను ఘనంగా సన్మానించారు. -
రసవత్తరంగా గార్ధభాల పోటీలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన గార్ధభాల పోటీలు రసవత్తరంగా సాగాయి. దేవాలయం నుంచి అంకాలమ్మ చౌరస్తా వరకు గార్ధభాలల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, చాగమర్రి, అవుకు, వెలుగోడు మండలాలకు చెందిన 13 గార్ధభాలు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బీవీ ప్రసాదరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కానాల రవీంద్రనాథరెడ్డి ప్రారంభించారు. 220 కిలోల ఇసుక బస్తాలతో నిర్ణీత పది నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం పరిగెత్తి విజేతగా నిలిచిన అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన నరసింహ గార్ధభం రూ. 15 వేలు కై వసం చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బాచిపల్లెకు చెందిన చిన్నరంగ గార్ధభం రెండవస్థానంలో నిలిచి రూ. 10 వేలు, చాగలమర్రి మండలం పెద్దవంగలి పాములేటి గార్ధభం మూడవస్థానంలో నిలిచి రూ. 7,500 గెలుపొందాయి. వెలుగోడు మండలం వేల్పనూరు సురేంద్ర గార్ధభం నాల్గవస్థానంలో నిలిచి రూ. 5వేలు, ఆళ్లగడ్డ మండలం బాచిపల్లె నాగేషు గార్ధభం ఐదవస్థానంలో నిలిచి రూ. 2,500 దక్కించుకున్నాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కరిమద్దెల మురళీ, గడ్డం నాగేశ్వరరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, సహదేవరెడ్డి, మనోహర్, రాజు, నాగేంద్ర, శిలువయ్య పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలి
డోన్ టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని శ్రీసుధ సీబీఎస్సీ సిలబస్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన జన విజ్ఞాన ప్రాంతీయ ఉమ్మడి జిల్లాల వేదిక వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అభివృద్ధితో పాటు సైన్స్ ఆలోచనలు పెరగాలని, శాస్త్ర పరిశోధనలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రజల ప్రగతి కోసం, స్వావలంబన కోసం, దేశ అభివృద్ధి కోసం, సామాజిక విప్లవం కోసం పని చేస్తుందన్నారు. జేవీవీ కార్యకర్తలు సైతం ఆ దిశగా పనిచేయాలన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలని చెప్పారు. శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు విరివిగా కళా జాతలు, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్ఫేర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంగన్న, నాయకులు భాస్కర్, కర్నూలు, అనంతపురం ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, ఆదేశేషు, మహేందర్‌రెడ్డి, ఖాజా హుస్సేన్, సుధీర్, జేవీవీ సమతా నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సెస్ అసోసియేషన్ రూమ్‌ను మరమ్మతు చేయించాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా హెడ్‌నర్సు, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు పెంచాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులకు ఐదు రోజులు అదనపు క్యాజువల్ లీవ్‌లు మంజూరు చేయాలి. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులను రెగ్యులరైజ్ చేయాలి. వారికి వంద శాతం వేతనం ఇవ్వాలి. –శాంతిభవానీ, ఉపాధ్యక్షురాలు, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం, కర్నూలు ఎంతో సంతృప్తి నేను 2020 నుంచి మేల్ నర్సుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నా. మధ్యలో కోవిడ్ సమయంలో కర్నూలులోని టిడ్కో గృహాల్లో కోవిడ్ డ్యూటీ చేశా. ఆ సమయంలో రోగులకు అందించిన సేవలు మరువలేనివి. ఎంతో ధైర్యం, మనోనిబ్బరంతో వారికి ధైర్యం చెబుతూ వైద్యసేవలు అందించా. ఆ తర్వాత తిరిగి గోనెగండ్ల పీహెచ్సీలో స్టాఫ్‌నర్సుగా చేరి, ప్రస్తుతం కోసిగి పీహెచ్సీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నా. ఇక్కడ ప్రతిరోజూ 150 మంది దాకో ఓపీ రోగులు వస్తుంటారు. వారందరికీ ఎంతో ఓపికతో వైద్యసేవలు అందిస్తున్నా. –పి. సుధాకర్, మేల్ నర్సు, కోసిగి పీహెచ్సీ -
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి ఉరుసు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఆదివారం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తి ఇంటి నుంచి గంధం తీసుకెళ్లారు. డప్పువాయిద్యాలు, బ్యాండు మేళాల మధ్య ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా ఫక్కీర్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరిన అనంతరం ధర్మకర్తతో కలిసి దర్గా పీఠాధిపతి ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించారు. దీంతో ఉరుసు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కాగా ఈఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త పూర్థిసాయిలో ఏర్పాట్లు చేశారు. దర్గాలో ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి వరకు తగ్గలేదు. దర్శనం కోసం గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంధం ఉత్సవానికి తరలివచ్చిన దర్గా పీఠాధిపతులు గంధం ఉత్సవానికి వివిధ దర్గాల పీఠాధిపతులు తరలివచ్చారు. బీదర్, రాయచూర్, సిందనూర్, కర్నూలు ఖాలిక్ లింగ దర్గాల పీఠాధిపతులు స్వామి సన్నిధిలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో కర్ణాటకలోని సర్మస్వలి దర్గా నిర్వాహకుడు దూద్బాష, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు -
వైభవంగా నరసింహ జయంతి
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు, సూపరింటెండెంట్ రామ్ మోహన్‌రావు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాళా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు, విశ్వక్సేనారాధన, నరసింహహోమం పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రంలో మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య స్వామి, అమ్మవార్లను పల్లకీలో కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. -
సింహ వాహనంపై పాండురంగడు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, గణపతి పూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి ప్రత్యేక అలంకరణలో పాండురంగడు సింహ వాహనంపై దర్శన మివ్వడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి శేషవాహనంపై దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో దళితుల హత్యలు బాధాకరం
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని మాదిగ జేఏసీ కమిటీ చైర్మన్ ఆర్జే ప్రకాష్ మాదిగ అన్నారు. మొత్తం 11 నెలల కాలంలో ఇద్దరు దళిత నేతలను హత్య చేయడం బాధాకరమన్నారు. కర్నూలు జిల్లాలో దళిత నేతలు చిప్పగిరి లక్ష్మీనారాయణ, కర్నూలులో మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్యకు గురైనా సరైనా విచారణ చేయడంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. కర్నూలులోని మీడియా పాయింట్లో ఆదివారం మాదిగ నేతలు సమావేశమై జేఏసీగా ఏర్పాడ్డారు. చైర్మన్‌గా ఆర్జే ప్రకాష్, ఉపాధ్యక్షుడిగా టీఎంరమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ సుభాష్ మాదిగలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసులో సూత్రధారులపై ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. వైకుంఠం కుటుంబీకులపై అనుమానం ఉందని హతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అక్రమాలు, షటిల్మెంట్ల గొడవలతోనే చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్ సంజన్న హత్యపై కూడా పోలీసుల సరైన విచారణ చేయలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకల్లు సోమసుందరం పాల్గొన్నారు. మాదిగ జేఏసీ కమిటీ చైర్మన్ ఆర్జే ప్రకాష్ మాదిగ -
ఖర్చు పెరిగింది
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. వీటికి తోడు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ తీసుకున్నా కిలో ధర రూ. 50 పైగా ఉంది. మా కుటుంబానికి నెలకు రూ. 15,000 ఆదాయం ఉంది. ఇందులో కూరగాయలు, నిత్యావసర వస్తువులకే రూ.6,000 వరకు ఖర్చు అవుతుంది. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే రూ.2000 వరకు ఖర్చు పెరిగింది. ప్రభుత్వం చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. – నిర్మలభాయి, కృష్ణానగర్, కర్నూలు కొనలేం తినలేం ధరలు పెరగడంతో కూరగాయలు కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబానికి ఆదాయం పెరగడం లేదు. నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, వంటనూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. నెలకు నాలుగైదు వేల రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయి. ప్రభుత్వం ధరల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. – కె. రత్నమ్మ, కర్నూలు -
కమనీయం.. కల్యాణోత్సవం
కౌతాళం: నరసింహస్వామి జయంతి వేడుకల సందర్భంగా ఉరుకుంద దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఉదయం సుదర్శన హోమం పూర్తి చేశారు. తరువాత భక్తులు కూడా పాల్గొని హోమాలు చేపట్టారు. స్వామి వారి మూలవిరాట్‌ను వెండి ఆలంకరణలో ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చస్త్రశారు. దేవాలయపు డిప్యూటీ కమిషనర్ విజయరాజు, తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంక్● పత్తికొండ విద్యార్థి ప్రతిభపత్తికొండ రూరల్: తెలంగాణ ఈఏపీసెట్‌లో పత్తికొండ విద్యార్థి కప్పట్రాళ్ల చెన్నకేశవ ప్రతిభ కనబరిచాడు. మొత్తం 160కి గాను 136.69 మార్కులు సాధించి 18వ ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయురాలు కల్యాణికుమారి, రమేష్ దంపతుల కుమారుడైన కప్పట్రాళ్ల చెన్నకేశవ పదో తరగతిలో 579 మార్కులు సాధించాడు. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ చదివి 991మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 206 ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంకు సాధించిన కుమారుడిని తల్లిదండ్రులు అభినందించారు.రేపు గోరుకల్లుకు ఎక్స్‌ఫర్ట్ కమిటీ రాకపాణ్యం: మండల పరిధిలోని గోరుకల్లు జలాశయానికి మంగళవారం( రేపు) ఎక్స్‌ఫర్ట్ కమిటీ రానున్నట్లు ఇంజినీర్లు ఆదివారం తెలిపారు. ఇటీవల గోరుకల్లు జలాశయం కట్ట కుంగిన విషయం తెలిసిందే. అయితే పదేపదే కట్ట ఒకే చోట కుంగిపోవడంతో ఇంజినీర్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించింది. దీంతో ఈ కమిటీ 13న పర్యటించనుంది. డ్యామ్‌ను పరిశీలించిన తర్వాత తగు సూచనలు జారీ చేయనున్నారు.ఆర్యూ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులుకర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ భరత్‌కుమార్ పేర్కొన్నారు. 16వ తేదీ పునఃప్రారంభమవుతుందని తెలిపారు. పీజీ కళాశాలల ప్రిన్సిపాల్స్ షెడ్యూల్‌ను పాటించాలని పేర్కొన్నారు.నేటి పరిష్కార వేదిక రద్దుకర్నూలు(సెంట్రల్): ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు ఇన్చార్జి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కువ మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో ఉండడంతోనే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.రూ.10.25 లక్షల మోసంకర్నూలు(సెంట్రల్): సెల్‌ఫోన్‌కు వచ్చిన చిన్న సందేశాన్ని చూసి ఒక వ్యక్తి మోసం పోయి రూ.10.25 లక్షలు పోగొట్టుకున్నాడు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కర్నూలులోని అమీన్ అబ్బాస్ నగర్లో ఉదయ్‌కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయన సెల్‌ఫోన్‌కు అలైస్ బ్లూ అనే సంస్థలో పెట్టుబడి పెడితే పెద్ద లాభాలు వస్తాయని మెస్సేజ్ వచ్చింది. దానిని చూసిన ఆయన తన వద్ద ఉన్న రూ.10.25 లక్షలను అందులో పెట్టాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని ఆదివారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైబర్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుకర్నూలు సిటీ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి(సోమ వారం)నుంచి మొదలై ఈ నెల 20వ తేదీ వరకు సాగనున్నాయి. ఇందుకు జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
అప్పులే ఉరితాడై..
● ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి కర్నూలు: కుమారుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తండ్రి వెంకటేశ్వర్లు (50) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కర్నూలు పాతబస్తీలోని చిత్తారి వీధిలో నివసిస్తున్నాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న స్వర్ణ కార కాంప్లెక్స్‌లో బంగారు దుకాణం నడుపుతున్నాడు. ఈయన భార్య పద్మావతి ఐదు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉండేవాడు. ఈయన కొడుకు రాఘవేంద్ర బీటెక్ పూర్తి చేసి వెంకాయపల్లె వద్ద ఒక ఇంజినీరింగ్ కళాశాలలో పెయింగ్ గెస్ట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షలు వరకు అప్పు చేశాడు. ఈయన కూతురు హర్షవర్ధిని డెన్మార్క్‌లో చదువుతోంది. కొడుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, భార్య గుండెపోటుతో మృతిచెందడంతో ఈయన మనోవేదనకు గురై ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వైర్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈయన తల్లి రామకోటమ్మ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుండగా వెంకటేశ్వర్లు రెండో అంతస్థులో ఉంటాడు. మధ్యాహ్నాం భోజనం కోసం తల్లి రామకోటమ్మ బెల్ కొట్టినప్పటికీ కొడుకు రాకపోవడంతో పైకెక్కి చూడగా ఉరికి వెళాడుతూ కనిపించాడు. ఇరుగు పోరుగు సాయంతో ఉరి నుంచి తప్పించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోగంతో బాధపడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రుల్లో చేరిన వారికి మేమున్నామని ఆదరణ, ఆప్యాయతతో ధైర్యం చెప్పే వారే నర్సులు. కుటుంబసభ్యులు కూడా చేయలేని సేవలను ఆసుపత్రుల్లో రోగులకు నర్సులు చేస్తున్నారు. అపస్మారక స్థితిలో వైద్యం అందుకుంటున్న వారి
క్యాజువాలిటీలో రోగులకు చికిత్స చేస్తున్న నర్సులు (ఫైల్)కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 776 మంది వివిధ రకాల హోదాల్లో నర్సులు పనిచేస్తున్నారు. వీరే గాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 1200 మందికి పైగా నర్సులు సేవలందిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 2వేల మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు గ్రామాల్లో 400లకు పైగా కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు(ఎంఎల్‌హెచ్‌పీలు), వెయ్యి మంది దాకా ఏఎన్ఎంలు నర్సింగ్ సేవలు అందిస్తున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సీహెచ్‌వోలు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. సాధారణంగా వైద్యులు రోగికి అవసరమైన పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే ఆ తర్వాత ఆ చికిత్సను పర్యవేక్షించాల్సిన బాధ్యత నర్సులదే. రోగికి మందులు అందించడంతో పాటు అవసరమైతే వారికి సపర్యలు కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో ఓపిక, సహనం అవసరం. ఈ మేరకు అవసరమైన మెళకువలన్నీ నర్సింగ్ విద్యలో వారికి నేర్పిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు నర్సింగ్ వృత్తి వ్యవస్థాపకులు మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820వ సంవత్సరం మే 12వ తేది ఇటలీ దేశ సందర్శనకు వెళ్లిన సమయంలో ఇంగ్లిష్ దంపతులకు జన్మించారు. నైటింగేల్ బాగా ఆర్థిక, ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించిన కారణంగా ఆ తరంలోనే ఆమె స్కూల్ స్థాయి వరకు చదువుకున్నారు. క్రిమియన్ యుద్ధ సమయంలో క్షతగాత్రులకు ఆమె అందించిన వైద్యసేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆమెకు లేడి ఆఫ్ ల్యాంప్ అవార్డునిచ్చి సత్కరించింది. ఆ తర్వాత ఆమె లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో నైటింగేల్ స్కూల్‌ను ప్రారంభించింది. నర్సింగ్ వృత్తికి ఆమె చేసిన సేవలకు గాను ప్రతి సంవత్సరం ఆమె జయంతి మే 12వ తేదిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా పాటిస్తున్నారు. సేవకు ప్రతిరూపం నర్సులు రోగుల చికిత్సలో వైద్యుల తర్వాత వారే జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది నర్సులు గ్రామాల్లో సీహెచ్ఓలదే ముఖ్యపాత్ర వైద్యుల తరహా సేవలందిస్తున్న వైనం నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం -
రైతును కాటేసిన రాత్రి కరెంట్
కోసిగి: వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇస్తుండటంతో రైతు ప్రాణం కోల్పోయాడు. పగటి సమయంలో విద్యుత్ సరఫరా ఉంటే ఇంటి పెద్ద బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన బాపుల దొడ్డి మునిస్వామి(63) పొలంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... మునిస్వామికి మూడు ఎకరాల పొలం ఉంది. ఇటీవల వేరుశనగ పంట సాగు చేశాడు. పొలంలోని వ్యవసాయ బోరులో నీరు అడుగంటడంతో శనివారం అదనంగా పైపులైన్లు వేశారు. తెల్లవారుజామున 3గంటలకు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. పైరుకు నీళ్ల పెట్టాలని తన చిన్న కుమారుడు నల్లారెడ్డితో కలిసి బాపుల దొడ్డి మునిస్వామి పొలానికి వెళ్లాడు. పైరుకు నీళ్లు కట్టే పనిలో కుమారుడు నిమగ్నమై ఉన్నాడు. కొత్తగా పైప్‌లైన్ దింపిన బోరు నుంచి నీళ్లు వస్తున్నాయా లేదా అని మునిస్వామి పరిశీలిస్తున్నాడు. పైప్‌లైన్ పట్టుకోగా విద్యుత్ ఎర్తింగ్ కావడంతో షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు గమనించి తండ్రిని లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రైవేట్ వాహనంలో కోసిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతినికి భార్య పార్వతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇవ్వడంతోనే మునిస్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో అన్నదాత మృతి -
కూరగాయల సాగుకు తగ్గిన ప్రోత్సాహం
● సబ్సిడీపై విత్తనాల పంపిణీ సున్నా ● గత ఏడాది 6,976 ఎకరాల్లో కూరగాయల సాగు ● అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు ● భారీగా పెరుగుతున్న ధరలు ● ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులుకర్నూలు(అగ్రికల్చర్): నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కూరగాయల సాగుకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడం ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రసుత్తం మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు పండించిన ధాన్యం, వేరుశనగ, కందులు, కొర్రలు, సజ్జలతో సహా కూరగాయలు అమ్మడానికి పోతే తక్కువ ధరలు లభిస్తున్నాయి. కొనడానికి పోతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా రైతులకు సాగు భారమవుతోంది. డిమాండ్‌కు తగినట్టు మార్కెట్లోకి కూరగాయల సరఫరా లేకపోవడం కొరతకు కారణమవుతోంది. అంతంతమాత్రం సాగు చేసిన కూరగాయల పంటలు కూడా అకాల వర్షాలకు దెబ్బతింటుండటంతో దిగబడులు పడిపోయాయి. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే రబీ కూరగాయల సాగు పడిపోయింది. వేసవిలో కూరగాయల కొరత ఉత్పన్నం కాకుండా సమ్మర్ క్రాప్స్‌ను ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఫలితంగా కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. కలసిరాని కూరగాయల సాగు రైతుల్లో కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోతోంది. 2023–24 ఈక్రాప్ ప్రకారం ఉల్లి, టమాట సహా కూరగాయల సాగు 80,614 ఎకరాల్లో ఉంది. వీటిని మినహాయిస్తే కూరగాయల పంటలు 31,868 ఎకరాల్లో సాగయ్యాయి. సాగు పుష్కలంగా ఉండటంతో కూరగాయల కొరత ఏర్పడలేదు. ధరలు పెరిగిన దాఖలాలు లేవు. 2024–25 సంవత్సరంలో టమాట, ఉల్లితో సహా కూరగాయల సాగు 26,087 ఎకరాల్లో ఉంది. ఉల్లి, టమాట పంటలే 22,736 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ పంటలను మినహాయిస్తే కేవలం కూరగాయల పంటలు 3,351 ఎకరాలకే పరిమితం అయ్యాయి. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో కూరగాయల సాగు కలసి రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతంతమాత్రం సాగైన పంటలు కూడా అధిక వర్షాలు, అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు పడిపోయి కొరత ఏర్పడటం ధర పెరుగుదలకు కారణమవుతోంది. టమాట ధర పెరిగే అవకాశం గత ఏడాది మే నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమాట, బెండ ధరలు మాత్రమే ఊరట కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం టమాట సాగు పూర్తిగా పడిపోయింది. మదనపల్లి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి టమాట దిగుమతి అవుతోంది. అక్కడ కూడా పంట క్రమంగా తగ్గుతోంది. దీంతో రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వెల్దుర్తి, కోడుమూరు, క్రిష్ణగిరి, గూడూరు, సీ.బెళగల్, డోన్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధర మండుతోంది. చాలాచోట్ల కూరగాయల ధరలు రూ.100 వరకు చేరాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ● కూరగాయల కొరత ఏర్పడకుండా సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ● కూటమి ప్రభుత్వంలో కూరగాయల సాగుకు ఎ లాంటి ప్రోత్సాహం లభించని పరిస్థితి నెలకొంది. ● సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. ● 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉన్నా 2024–25 సంవత్సరంలో ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వకపోవడం గమనార్హం.ధరల పెరుగుదల ఇలా.. కూరగాయ ఏప్రిల్ మే పేరు 11న ధర 11న ధర వంకాయ 16/24 34/48 కాకర 30 54 క్యాలీఫ్లవర్ 30 44 క్యారెట్ 24 40 బీన్స్ 80 100 చిక్కుడు 50 70 క్యాప్సికం 50 64 పచ్చిమిర్చి 30 54 బీర 36 50 -
శ్రీమఠం... భక్తజన సంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయానికి కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగాతీరం, మధ్వ కారిడార్, నది కారిడార్, మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. మూలబృందావన దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజన, పరిమళ ప్రసాదం కౌంటర్లు రద్దీగా దర్శనమిచ్చాయి. ముందుగా భక్తులు గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో పురవీధులు కళకళలాడాయి.శ్రీశైలంలో భక్తుల సందడి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
రెడ్ బుక్ పాలన.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిలకల గూడూరుకు వెళ్లే రహదారి పక్కన పొలంలో వ్యక్తికి చెందిన అస్థికలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఎముకలను స్వాధీనం చేసుకొని వీఆర్వో హరిచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా గడివేముల గ్రామానికి చెందిన సత్తార్ తన పొలంలో కొన్ని రోజుల క్రితం మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పుంటించడంతో ఏదో చనిపోయిన వాసన రావడంతో జంతువు కళేబరం తగలబడినట్లు రైతు భావించాడు. పొలంలో దుర్వాసన వస్తుండటంతో అనుమానంతో పరిశీలించడంతో పూర్తిగా కుళ్లిన మృతదేహం కనిపిచింది. ఈ విషయాన్ని మరో రైతుతో ఫోన్లో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని గుర్తించడంతో దర్యాప్తు చేపట్టారు. -
అనుమానంతో చంపేశాడు!
బేతంచెర్ల: ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కడతేర్చాడు. భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యాడు. ఈ ఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక గౌరిపేట కాలనీకి చెందిన షేక్ రసూల్‌తో నంద్యాల పట్టణానికి చెందిన జకియా బేగం(37)కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ రసూల్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. సవ్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో గత కొన్ని రోజులుగా భార్యను అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవ పడి కోపంతో భార్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. జకియా బేగం కుటుంబీకులకు ఆత్మహత్య చేసుకుందని రసూల్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కాగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లభించకపోవడంతో అందరూ నిలదీయడంతో పరారయ్యాడు. మృతురాలి తమ్ముడు సయ్యద్ అజ్మతుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగస్వామి ఉరుసు సందర్భంగా శనివారం సాయంత్రం ఫక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే గంధం కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫక్కీర్లు స్థానిక పీర్లకట్టా వద్దకు చేరుకున్నారు. వీరిని దర్గా ధర్మకర్త, వారి శిష్యరిక బృందం ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ, పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీలు ఫక్కీర్లకు స్వాగతం పలికారు. ఊరేగింపులో వారు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం దర్గాలో ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి నిర్వహించిన ఖవ్వాలి పోటీలు భక్తులను అలరించాయి. ఆదివారం తెల్లవారు జామున గంధం కార్యక్రమం వైభవంగా జరుగుతుందని ధర్మకర్త సయ్యద్ మున్న పాషా తెలిపారు. -
వివాహిత బలవన్మరణం
నందవరం: క్షణికావేశంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోహరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురవ శంకర్‌తో కొన్నేళ్ల క్రితం మెరుగుదొడ్డికి చెందిన కురవ మల్లేశ్వరి(34)కి వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శంకర్ మూడేళ్ల క్రితం గంగవరం గ్రామ సమీపంలో 1.88 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ పొలానికి రస్తా లేకపోవడంతో మల్లేశ్వరి తరచూ భర్తతో గొడవ పడేది. శుక్రవారం ఉదయం కూడా వారి మధ్య ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మన స్తాపం చెందిన మల్లేశ్వరి అదే రోజు రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో భర్త గమనించి చికిత్స నిమిత్తం వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మల్లేశ్వరి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు రుద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు భారత ప్రభుత్వ అనుమతి తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాపటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాద్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తోందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్‌తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు
‘వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేం. మిత్రులతో ఆటలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో గిల్లికజ్జాలు, అమ్మకు తోడుగా చిన్న చిన్న పనులు, చెరువులో ఈత.. ఇలా ఎన్నో సరదాలు. వేసవి సెలవులు ఒక్క రోజూ కూడా వృథా కాకుండా సద్వినియోగం చేసుకున్నాం’ అంటూ వెల్దుర్తి ఐసీడీఎస్ సీడీపీఓ పసుపుల లూక్ మనోహర్ చెబుతున్నారు. మిగతా వివరాలు ఆయన మాటల్లో.. వెల్దుర్తి: వేసవి సెలవులు వస్తే అమ్మకు సహాయం చేసేందుకు హాస్టల్ నుంచి పరిగెత్తుకు వచ్చేవాడిని. నాది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానంది పల్లె గ్రామం. మా అమ్మ లలిత, నాన్న జోజప్ప. మేము ఆరుగురు అన్నదమ్ములం, మాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నేను 5వ వాడిని. నాన్న టీచర్‌గా, అమ్మ గ్రామంలోనే శిశు విహార్‌లో టీచర్‌గా పని చేసేది. 9, 10వ తరగతులు రైల్వేకోడూరు మండలం బుక్కవానిపల్లెలోని ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. సెలవులు రాగానే ఇంటికి వెళ్లి అమ్మకు తోడుగా దూర ప్రాంతం నుంచి చేతిబోరు, చేదుడు బావుల నుంచి తాగునీరు తెచ్చేవాడిని. కొండల్లో కెళ్లి వంటకు కట్టెలు కొట్టుకొచ్చేవాడిని. శిశు విహార్‌లో పిల్లలకు రైమ్స్, చదువు నేర్పేవాడిని. అమ్మ గ్రామంలోను, చుట్టు పక్కల గ్రామాలకు నర్సు సేవలకు వెళ్లినపుడు నేనే శిశువిహార్‌ను చూసుకుంటూ ఆయాతో కలిసి చిన్నారులకు వడియాలు, పిండి పంచడం తదితరాలు చూసుకునేవాడిని. చేపలు కాల్చుకుని తినేవాళ్లం.. మా గ్రామం ఆనుకుని ఉన్న పెండ్లిమర్రి చెరువు ఎండాకాలం సెలవులకు వెళ్లేటప్పటికి కొంత ఎండిపోయేది. ఇక ఫ్రెండ్స్‌తో కలిసి కొద్దిపాటి నీటిలో ఈత నేర్చుకున్నాను. ఈత కొడుతూ, చేపలు పడుతూ, ఆ చేపలు అక్కడే కాల్చుకు తింటూ, ఇంటికి తెచ్చి వండుకుంటూ భలే మజా వచ్చేది. హాస్టల్లో ఎక్కువగా ఆడే బలపం ఊదే ఆట (బలపాన్ని ఫస్టు ఎవరు లైన్వరకు ఊదుతారో వారికి ఓడిన వాళ్లు తెచ్చుకున్న సజ్జరొట్టె ముక్క ఇచ్చేలా ఆడేవాళ్లం)ను సెలవులకు ఇంటికి వచ్చి అన్నదమ్ములు, అక్కచెళ్లెల్లతో, ప్రెండ్స్‌తో ఆడేవాడిని. స్వాతంత్య్రానికి పూర్వమే మా ఊర్లో మా ముత్తాత వారు స్కూలు కట్టించి, ప్రైవేట్ టీచర్‌తో చదువు చెప్పించేవారు. తర్వాత బ్రిటీష్ వారు మా స్కూల్‌ను తీసుకుని మా కుటుంబానికి ఒక టీచర్ పోస్టు ఇచ్చి రోమన్ కాథలిక్ మిషన్ పేరుతో నడిపారు. అందులోనే నేను 3వ తరగతి వరకు చదువుకున్నాను. పీజీ పూర్తి చేసుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఉన్న ఐకేపీలో ఉద్యోగం చేస్తూ, ఆ తర్వాత ఐసీడీఎస్‌లో సీడీపీఓగా నా 27వ ఏట ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నాకు 51 ఏళ్లు. బాల్యం జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయమే. మూడు రోజుల్లో సైకిల్ నేర్చుకున్నా.. చిన్నతనం సెలవుల్లోనే మూడు రోజుల్లో సైకిల్ నేర్చుకున్నాను. 8వ తరగతి వేసవి సెలవుల్లో ఆ సైకిల్ నేర్పుతోనే 3 కి.మీలు అవతల ఉండే కలసపాడుకు వెళ్లి ట్యూషన్ చెప్పించుకుని వచ్చి ఏపీఆర్ఎస్ 9వ తరగతి ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సంపాదించి సీటు సంపాదించాను. ఇక కట్టెలు తెచ్చేందుకు కొండల్లో కెళ్లినపుడు కుటుంబ సభ్యులం, ఫ్రెండ్స్ అంతా రేగిపండ్లు, బలిజ(పరికె) పండ్లు, చిటిమిటి పండ్లు తెంపుకుని ఇష్టంగా తినేవాళ్లం. ఎక్కువగా గ్రామంలోని ఫ్రెండ్స్‌తో ఖోఖో ఆడేవాళ్లం. అప్పుడప్పుడు గోళీకాయలు ఆడేవాళ్లం. -
పట్టుబడిన యువకుడు
డోన్ టౌన్: పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న శ్రీనివాస నగర్లో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించా రు. కామగానికుంట్ల గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాసనగర్‌లో ఓ ఇంటికి తాళం వేసి ఉండగా శని వారం పట్ట పగలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అంతలోనే ఇంటి యజమానులు తిరిగి రావడంతో యువకుడిని కాలనీవాసుల సహాయంతో పట్టుకున్నారు. చెట్టుకు కట్టివేసి పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్నేహితులకు ఆర్థిక సాయం కొలిమిగుండ్ల: ఒకే పా ఠశాలలో చదువుకు న్న స్నేహితులు పేదరికంతో ఆర్థిక సమస్యల తో ఇబ్బందులు పడుతుండటంతో ఓ స్నేహితురాలు ఆర్థిక సాయం అందించింది. కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో 2002–03 పదో తరగతి బ్యాచ్ శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొలిమిగుండ్లకు చెందిన కత్తి సునీత తన స్నేహితులు మీర్జాపురానికి చెందిన గోపాల్‌కు రూ.30వేలు, కనకాద్రిపల్లెకు చెందిన శ్రీలక్ష్మికి రూ.20 వేలు అందించారు. -
ఆల్ మేవా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోిసియేషన్ (ఆల్‌మేవా)కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయ్యింది. శనివారం జిల్లా పరిషత్‌లోని మండలపరిషత్ సమావేశ మందిరంలో నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా ఆల్ మేవా జనరల్ సెక్రటరీ ఎస్ఎండీ సలీమ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్‌పాషా, గౌరవ అధ్యక్షుడు ఎస్ఎండీ అబులైస్, జనరల్ సెక్రటరీ అంజాద్పాషా పర్యవేక్షించారు. జిల్లా ఆల్ మేవా అధ్యక్షుడు ముక్తార్ బాషా (పంచాయతీ రాజ్), వర్కింగ్ ప్రసిడెంటుగా మౌలీబాషా (రెవెన్యూ), అసోసియేట్ ప్రశిడెంటుగా హుస్సేన్ (నీటిపారుదల), ఉపాధ్యక్షులుగా జాకీర్ హుస్సేన్, పీఎండీ అబ్దుల్ ఖలీల్, మహ్మమ్మద్ హక్, హుస్సేన్ సాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రియాజ్ బాషా, అడిషినల్ జనరల్ సెక్రటరీగా సైపుల్లా బేగ్, ఇలియాస్ ఖాన్, అల్లాబకాష్, కోశాధి కారి షఫీఅహ్మద్, మహిళ సెక్రటరీగా సహరాబాను, దిల్షాద్ బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుభాన్‌బాషా, షంషుల్లాఖాన్, ఎస్ఎండీ ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీగా అక్బర్‌బాషా ఎన్నికయ్యారు. రాష్ట్ర నేతలు, ఎన్నికల అధికారి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు -
భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
● శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ఉయ్యాలవాడ: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ప్రభోదించారు. గోవిందపల్లె గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ధార్మికోపన్యాసంలో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు చెప్పి జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమన్నారు. తల్లిదండ్రులను ప్రేమించలేని, గౌరవించలేని వారు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగినా వృథా అన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం, పుణ్య కార్యక్రమాలకు వెచ్చించాలన్నారు. కార్యక్రమంలో వేద పండితులు దక్షిణామూర్తి, గ్రామ సర్పంచ్ చామల ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గడివేముల: ఎల్కే తండా గ్రామంలో ప్రమాదవశా త్తూ విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రా మానికి చెందిన వెంకట్ నాయక్ (50) మేకలు మేపు కుంటూ జీవనం సాగించేవాడు. మేక పిల్లలకు మేత కోసం చెట్టు పైకి ఎక్కి మేత కోస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పార్వతి బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దేశ రక్షణకు ఇప్పటికై నా సిద్ధమే
నేను 1992లో బీఎస్ఎఫ్లో చేరా. జమ్మూకశ్మీర్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీలో పనిచేశా. 2013లో రిటైర్డ్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. మా గ్రామం నుంచి ఏటా కొందరు సైన్యంలో చేరి దేశరక్షణలో పాల్గొంటుండటం గర్వకారణం. అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టడించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యంలో 21 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. దేశ భద్రత కోసం బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధమే. – మండపాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ జవాన్, అమినాబాద్ -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య కర్నూలు(సెంట్రల్): దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. రేషన్, మందులు, నూనెలు తదితర నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని , ఆయా వస్తులు ధరలు పెరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞఫ్తి చేశారు. అలాగే అర్జీదారులు meekoram.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పడిపోయిన ధాన్యం ధరలు ● కర్నూలు మార్కెట్లో క్వింటా రూ.1,761 మాత్రమే ● మద్దతు ధర రూ.2,320 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం ధరలు పడిపోయాయి. మద్దతు ధర రూ.2,320 ఉండగా.. మార్కెట్లో రూ.1,760 ధర మాత్రమే లభించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో కొద్ది రోజులుగా ధాన్యం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొదట్లో ధాన్యానికి కాస్త మెరుగ్గానే ధరలు లభించాయి. ఇంతవరకు గరిష్టంగా క్వింటాకు రూ.1,981 వరకు ధర లభించింది. శుక్ర, శనివారాల్లో ధరలు పడిపోయాయి. ఈ నెల 9న ధాన్యం క్వింటా ధర రూ.1,841 పలికింది. 10న కేవలం రూ.1,761 మాత్రమే లభించింది. మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్లో అతి తక్కువ ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నా మద్దతు ధరతో కొనుగోలుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
గ్రామం నుంచి పారా మిలటరీలో మొట్టమొదటి మహిళను
మాది వ్యవసాయం కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న జయరాముడు. తొమ్మిదేళ్ల క్రితం నాన్న చనిపోయారు. నాకు అక్క పద్మావతి, తమ్ముడు వేణు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఊరి నుంచి మిలిటరీకి వెళ్లిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నా. ఆ దిశగా చేసిన ప్రయత్నంతోనే న్యూ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసేందుకు అవకాశం దక్కింది. మా గ్రామం పారా మిలటరీలో చేరిన మొట్టమొదటి మహిళను కావడం ఎంతో గర్వంగా ఉంది. తల్లి, అక్క, తమ్ముడుతో పాటు భర్త ప్రోత్సాహం మరువలేనిది. దేశం కోసం పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. – జరగల స్వాతి, సీఐఎస్ఎఫ్, అమినాబాద్ -
ఇప్పుడు విధుల్లో 15 మంది..
అమినాబాద్ గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. గ్రామం నుంచి మచ్చా రంగనాయకులు, సురేంద్ర, కురవ వంశీ, దాసరి ప్రభాకర్, ఎంబాయి విజయ్‌కుమార్, రమేష్, పురిమెట్ల హరి, దండు రామాంజిని, రాజు, తిమ్మాపురం హనుమేష్, బాలకృష్ణ, కె.హరినాథ్, సుద్దాల మురళి, జరగల స్వాతి, గొల్ల రాధ(ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బి, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ) విభాగాల్లో పని చేస్తున్నారు. ఇక దివాకర్చౌదరి, లక్ష్మినారాయణ, మండపాటి వెంకటేశ్వర్లు, దాసరి రంగడు, మచ్చా నాగరాజు, హరినాథ్, మోటుపల్లి కరుణాకర్, రాము, నవీన్, నాగరాజు ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. గ్రామం నుంచి పలువురు యువకులు దేశ రక్షణకు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ ఊరికి వన్నె తెచ్చారని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వీరిలో పలువురిని ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. -
అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో ఎమ్మెస్సీ చదివిన విద్యార్థి ఆత్మహత్య -
మనం బాగుంటే చాలు.. అవతల ఎవరేమైపోతేనేం అనుకునే రోజులివి. ప్రపంచం అరచేతిలోకి వచ్చి చేరడంతో బద్దకం ఎవరి గురించీ ఆలోచించని పరిస్థితి. నా కొడుకు డాక్టర్.. నా కూతురు ఇంజినీరు.. మా అల్లుడు ఫారిన్లో ఉద్యోగం.. మా కోడలు సాఫ్ట్వేర్.. అని చెప్పుకోవడం ఆ కుటుంబానిక
తుగ్గలి: ఆపరేషన్ సింధూర్. దేశమంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టున పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టిన తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండటంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొచ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సెల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ అమినాబాద్ గ్రామం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఇందుకు కారణం ఆ చిన్న గ్రామం నుంచి ప్రస్తుతం 15 మంది దాకా ఆర్టీలో పని చేస్తుండటమే. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరిని పలుకరించినా మా పిల్లలు సైన్యంలో ఉండటం తమకెంతో గర్వకారణం అనడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్ల పంచాయతీ మజరా గ్రామమైన అమినాబాద్‌లో 201 కుటుంబాలు ఉండగా.. 873 మంది జనాభా ఉన్నారు. గత 30 ఏళ్లలో 25 మంది ఆర్మీలో చేరారు. యువకులే కాకుండా యువతులు మేము సైతమని దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుండటం విశేషం. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ గ్రామం తలెత్తుకునేలా సైన్యంలో సేవలందిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దేశభక్తికి మారుపేరు కుటుంబాలకు దూరంగా సైన్యంలో సేవలు ప్రస్తుతం వివిధ విభాగాల్లో 15 మంది మేముసైతం అని ఇద్దరు యువతులు గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ఇప్పటికై నా యుద్ధానికి సిద్ధమంటున్న మాజీలు -
యుద్ధ సమయంలో అండగా ఉంటాం
నిజమైన హీరో మురళీనాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పాకిస్తాన్‌తో పోరాడుతూ అమరుడైన మురళీనాయక్‌ను తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరచిపోలేవని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు అబ్బాస్ నగర్‌లోని కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్మీ జవాన్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. యుద్ధంలో అసువులు బాసిన ఆర్మీజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. దేశ రక్షణకు అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ప్రజలందరి దృష్టిలో నిజమైన హీరో అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత దారుణం. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. యుద్ధ సమయంలో దేశానికి అండగా ఉంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 7 వేలకుపైగా మాజీ సైనికులు ఉన్నాం. ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారి వివరాలను డిఫెన్స్ అధికారులు అడిగారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మాజీ సైనికులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. – నర్రా పేరయ్య చౌదరి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కర్నూలు -
దేశ సేవలో హెబ్బటం యువకులు
హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామానికి చెందిన యువకులు దేశం రక్షణకు తమవంతు సేవలందిస్తున్నారు. మండలంలో ఈ గ్రామం నుంచే అధిక సంఖ్యలో యువకులు సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకుంటున్నారు. బావిదొడ్డి రామాంజనేయులు, లింగన్న, వెంకటేశ్వర్లు, అంజి, టి.రాము, లక్ష్మన్న, సతీష్, మునేష్, గంగాధర్, శ్రీనివాసులు, తిమ్మప్ప, ప్రకాష్, విజయ్, వీరేశ్‌తో కలిపి మొత్తం 13 మంది ఆర్మీలో కొనసాగుతున్నారు. వీరిలో బావిదొడ్డి రామాంజనేయులు అమరుడు కాగా.. లింగన్న, వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. బీఎస్ఎఫ్ జవాను బావిదొడ్డి రామాంజనేయులు 2008 మే 15న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధి నిర్వహణలో ఉండగా నక్సలైట్లు జరిపిన బాంబు పేలుడులో మరణించాడు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 11 మంది సైన్యంలో సేవలు అందిస్తుండగా.. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో వీరిని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్.వి.ఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. శనివారం స్థానిక ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్షలకు ఫస్ట్ ఇయర్ చెందిన 16,292 మంది, సెకండ్ ఇయర్‌కు చెందిన 5032 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. జిల్లాలో 7 కేంద్రాలు సమస్యాత్మకమై కేంద్రాలు గుర్తించామని, వీటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్షలపై ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 08518–222047 నంబరును సంప్రదించవచ్చునని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ మాత్రమే తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఈసీ మెంబర్లు జి.లాలెప్ప, యు.పద్మావతి, జి.ఎస్ సురేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహణ ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి -
ఎమ్మెల్యే జయసూర్య Vs ఎంపీ శబరి.. మరోసారి రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
ఆలయానికి గోవు దానం చేసిన ముస్లిం
● కోవెలలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు పత్తికొండ రూరల్: హోసూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీవేణుగోపాల స్వామి దేవాలయానికి ఓ ముస్లిం కుటుంబం గోవును దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకుంది. నూతన ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బెళడోణ రామనాథశాస్త్రి ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామస్తుడు గుడిసె నరసింహులు రూ.10లక్షల విరాళంతో నిర్మించిన ఆలయ ప్రధాన గోపురంపై కలశ ప్రతిష్ట మహోత్సవం కనుల పండువగా సాగింది. కులమతాలకు అతీతంగా భక్తులు తరలిరాగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ముల్లా నాదేల్లి బాషా గోవును స్వామివారి ఆలయానికి సమర్పించారు. ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా వచ్చి అర్చకులకు అప్పగించారు. వేద పండితులు గోవుకు ప్రత్యేక పూజలు చేసి స్వీకరించారు. -
ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం
నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కోసం తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్‌లు కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు హెచ్‌టీ పత్తి విత్తనాల కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు అనధికార విత్తనాలు, నకిలీలు పట్టుబడలేదు. ఎక్కడైన అనుమతి లేని విత్తనాలు అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
మధ్యంతర భృతి ప్రకటించాలి
నంద్యాల(న్యూటౌన్): 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, కేవీ శివయ్య, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం గందరగోళ పరిస్థితుల ను సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ విధానాలతో పాఠశాల విద్యకు నష్టం కలుగుతుందన్నారు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 14న విజయవాడలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం డీఆర్ఓ రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు భాస్కరరెడ్డి, జాకీర్‌హుసేన్, మధు, రమేష్, శైలజ, రాములమ్మ, రమాబాయి, సునిత తదితరులు పాల్గొన్నారు. -
ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ప్రారంభం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు శుక్రవారం రాత్రి కౌతాళంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రత్యేక ఫాతేహాల అనంతరం స్వామి సమాధిని సుగంధ ద్రవ్యాలు, పానీయాలతో శుభ్రం చేశారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాష చిష్తీలు వారి శిష్య బృందంతో ప్రత్యేకంగా తెచ్చిన చద్దర్‌ను స్వామి సమాధిపై ఉంచి పూలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఫాతేహాలు నిర్వహించి నగరా వాయించారు. దీంతో ఉరుసు ప్రారంభమైంది. ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని ధర్మకర్త తెలిపారు. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బందులు కలుగకుండా దర్గాలో ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. గుల్షన్ కమిటీ అధ్యక్షుడు మున్నపాషా, కర్ణాటకలోని సర్మస్వలి దర్గా నిర్వాహకుడు దూద్‌బాషా పాల్గొన్నారు. విద్యుత్ అలంకరణలో దర్గా ఉరుసును పురస్కరించుకుని దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ ద్వారంతో పాటు 60 అడుగుల మహా గోపురం మజీద్‌కు వెళ్లడానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారం వరకు విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం గంధం, ఆదివారం ఉరుసు ఉంటుందని ధర్మకర్త తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట
కర్నూలు: నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల అధికారులు, దర్యాప్తు అధికారులు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. హత్య, ఫోక్సో కేసులు, సైబర్ క్రైం వంటి నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి, ఏపీపీ ఖాదర్ బాషా, డాక్టర్ రంగయ్య, డీఎస్పీలు, ఫోరెన్సిక్ నిపుణులకు పోలీసు అధికారులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, వెంకటరామయ్య, రామాంజి నాయక్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ ఎస్.అసీం బాషా, డాక్టర్ ఎం.కిషోర్ కుమార్‌రెడ్డి, జి.శ్యాం ప్రసాద్, కుమారస్వామి, జీజీహెచ్ డాక్టర్లు, పీపీలు, ఏపీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఫోరెన్సిక్ విభాగం, ఫింగర్ ప్రింట్స్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా -
వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు
● మొదలైన బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల అమ్మకాలు ● పల్లెలకు చేరుతున్న నకిలీ, లూజు విత్తనాలు ● రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అధికం ● తమ ఆధీనంలోని కంపెనీల్లో వ్యవసాయ శాఖ తనిఖీలు ● ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు గత ఏడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. బనగానపల్లి, దొర్నిపాడు, ఎమ్మిగనూరు ప్రాంతల్లో నకిలీ విత్తనాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాల అమ్మకాలు, అనధికార విత్తనాలు, స్టాప్ సేల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రూ.2.40 కోట్ల విలువ చేసే పత్తి, ఇతర విత్తనాలు 100.79 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఐదు 6ఏ కేసులు కూడా నమోదయ్యాయి. -
న్యాయ సహాయానికి డయల్ 15100
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణంలో ఉన్న దిశ వన్‌స్టాప్ సెంటర్, మహిళా ప్రాంగణం (శక్తి సదన్)ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతూ.. ఏమైనా న్యాయ సమస్యలు ఉంటే 15100 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. వన్‌స్టాప్ సెంటర్లో ప్రభుత్వం ద్వారా అందజేసే బాధితుల పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అందరూ అర్హులని చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ మలివిడత పోరాటాలకు 21న ప్రణాళిక కర్నూలు(సెంట్రల్): ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ చట్ట సవరణ నిలిపివేతకు మలివిడత పోరాటాలకు సిద్ధం కానున్నట్లు సేవ్ వక్ఫ్ జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ మౌలానా రషది తెలిపారు. శుక్రవారం రిసల్దార్ మసీదులో సయ్యద్ మస్సూర్ మౌలానా అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న మలివిడత పోరాటాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించన్నుట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ముఖ్యనాయకులతో పాటు మండలాలు, తాలుకాల జేఏసీ నాయకులు హాజరు కావాలని కోరారు. ఆ సందర్భంగా భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో కోకన్వీనర్లు ఎంఏ హమీద్, మౌలానా జబీవుల్లా, మౌలానా ముస్తాక్ అహ్మద్‌ఖాన్, హఫీజ్, హుస్సేన్ సాహెబ్, ఎస్ఎండీ షరీఫ్ పాల్గొన్నారు. దోపిడీకి అడ్డు‘కట్ట’ ఏదీ? కృష్ణగిరి: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల దోపిడీ పెరిగిపోయింది. చెరువు కట్ట రాళ్లను సైతం అక్రమంగా తరలిస్తున్నారు. కృష్ణగిరి మండలంలో పోతుగల్లు చెరువు ఉంది. ఈ చెరువు కట్టకు ఉన్న రాళ్లను శుక్రవారం గ్రామానికి చెందిన టీడీపీ వాళ్లు ఏకంగా జేసీబీని పెట్టి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇలా ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి.. ఇలా కట్ట రాళ్లను తొలగిస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో వెంకటేశ్వర్లు వచ్చి చూసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటరా, అధికార పార్టీకి చెందిన వారని వదిలేస్తారో చూడాలి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 8,188 మందికి 7,404 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో సెయింట్ జోసప్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇద్దరు, పత్తికొండ సాయి డిగ్రీ కళాశాల కేంద్రంలో శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇద్దరు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థి, డోన్ సాయిశ్రీ డిగ్రీ కళాశాల కేంద్రంలో ప్యాపిలి ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు చూచిరాతలకు పాల్పడుతుండగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.