
తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్‌లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు
●