
ఇద్దరు సారా తయారీదారుల అరెస్ట్
నందికొట్కూరు: నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందికొట్కూరు పట్టణంలో జగనన్న కాలనీలో సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం ఎకై ్సజ్ సీఐ రామాంజనేయులు సిబ్బందితో దాడి చేశారు. మంగలి శ్రీనివాసులు ఇంటిలో 132 లీటర్ల నాటు సారా లభించడంతో సీజ్ చేసి, 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. శ్రీనివాసులు ఇంటిని షికారి రవి, షికారి నానా సింగ్, షికారి భారతి అద్దెకు తీసుకుని సారా తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగలి శ్రీనివాసులను, షికారి రవిని అరెస్టు చేసి చేసి రిమాండ్‌కు తరలించారు. నానా సింగ్ పరారీలో ఉన్నాడని, సారా కేసులో ఇప్పటికే షికారి భారతి జైల్లో ఉందని సీఐ తెలిపారు. అలాగే వీరికి నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన నందికొట్కూరు షికారి కాలనీకి చెందిన షికారి రవి మీద కూడా కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ జఫ్రూళ్ల, హెడ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్, పద్మనాభం, కుమారి, కానిస్టేబుళ్లు మధుసూదన్, ప్రసాద్, శివన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మాధవస్వామి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం పట్టివేత
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళల వద్ద 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీశైలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా శ్రీశైలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా శ్రీశైలానికి చెందిన బీబీ, పిక్కిలి రేణుక సున్నిపెంట నుంచి ఆర్టీసీ బస్సులో 50 మద్యం సీసాలు తీసుకుని వస్తుండగా తనిఖీలో దొరికారన్నారు. మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. క్షేత్రంలో దేవదాయచట్టం ప్రకారం ఎవరైనా మద్యం సేవించకూడదని, అలాగే మద్యం కూడా కలిగి ఉండకూడదని సీఐ హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రఘునాథుడు, బాలకృష్ణ, బలోజానాయక్, నానునాయక్, వెంకటనారాయణ, కృష్ణవేణి, దేవస్థాన హోంగార్డులు కిరణ్, దొరబాబు పాల్గొన్నారు.

ఇద్దరు సారా తయారీదారుల అరెస్ట్