
కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్
టన్నుల కొద్దీ వ్యర్థాలు
● కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక
తొలిసారి తొలగింపు
● వెయ్యి మందికి పైగా సిబ్బంది ఉన్నా
ఎక్కడి చెత్త అక్కడే
● గత ప్రభుత్వ పారిశుద్ధ్య
కార్యక్రమాలకు సెలవు
● ఇటీవల 200 మంది తాత్కాలిక
సిబ్బంది నియామకం
● అయినప్పటికీ చెత్త నిర్వహణలో
చిత్తశుద్ధి కరువు
‘ఒక్కరోజు’ హడావుడి!
పది నెలలుగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించని అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాలువల్లో మురుగు పేరుకుపోయినా.. చెత్తకుండీలు పొంగిపొర్లినా అధికారులు ముక్కుమూసుకుని వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో నగరం చెత్తమయమైంది. ఇన్ని నెలలుగా నిద్రపోతున్న అధికారులు ఒక్కరోజు సీఎం కార్యక్రమానికి హడావుడి చేస్తున్న తీరు పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది సిబ్బంది పనిచేస్తుంటే.. ఇప్పుడు టన్నుల కొద్దీ వ్యర్థాలు ఎలా వస్తున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
అప్పుడు..
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ సిటీలో భాగంగా 2018 సంవత్సరంలో 221 ర్యాంకు సాధించింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కర్నూలు కార్పొరేషన్‌లో దేశ వ్యాప్త ర్యాంకులో 2019 సంవత్సరంలో 187, 2020 సంవత్సరంలో 197 ర్యాంకు.. 2021 సంవత్సరంలో 75వ ర్యాంకు, 2022 సంవత్సరంలో 55వ ర్యాంకు.. 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 32వ స్థానం సాధించడం విశేషం. అప్పట్లో పారిశుద్ధ్య విభాగంలో ప్రభుత్వం తీసుకున్న మెరుగైన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. చెత్తలేని నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. తడిచెత్త, పోడిచెత్త వేరు చేయడంతో పాటు 1.25 మొక్కలు నాటి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దారు.
ఇప్పుడు..
క్లీన్ అండ్ గ్రీన్ ఊసే లేదు. ప్రత్యేకించి నిధులు రాలేదు. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. మురుగు కాల్వలను శుభ్రం చేయడంలేదు. ఇంటింటి చెత్త సక్రమంగా అమలు కావడం లేదు. తడిచెత్త లేదు. పోడి చెత్త లేదు. అన్ని డివిజన్లలో అదే పరిస్థితి. చెత్త సేకరణలో కొత్తగా సంస్కరణల సంగతి దేవుడెరుగు.. గత ప్రభుత్వంలో చక్కగా పనిచేస్తున్న క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) ఆటోలను ఆటకెక్కించారు. దాదాపు 90 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో పారిశుద్ధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ్ముళ్ల కోసం అంటూ ప్రతి శానిటేషన్ డివిజన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో రూ.2 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం.
కర్నూలు(టౌన్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చంధ్ర, స్వచ్ఛా సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న కర్నూలులో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి నెలా మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇంకేముంది. సీఎం వస్తున్నాడని ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం మొత్తం వీధుల్లోకి వచ్చింది. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నా.. అక్కడ పెద్ద ఎత్తున్న వ్యర్థాలు బయట పడుతుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సంబంధిత శానిటరీ ఇన్స్‌పెక్టర్, మేసీ్త్రలు, సచివాలయాల ఉద్యోగులు సరైన పర్యవేక్షణ చేస్తే గుట్టల కొద్దీ వ్యర్థాలు ఎలా బయటపడుతాయని ప్రశ్నిస్తున్నారు. సి.క్యాంపులో ప్రతి రోజు 50 టన్నులకు పైగా వ్యర్థాలు వస్తాయని తెలిసినా పారిశుద్ధ్య అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడం వల్లే ఇప్పుడు మొత్తం యంత్రాంగం శ్రమించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
970 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా.. ఎక్కడి చెత్త అక్కడే!
కర్నూలు నగరంలో 970 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా.. శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, మేసీ్త్రలు, ప్రతి సచివాలయాల పరిధిలో సచివాలయాల వార్డు కార్యదర్శులు ఉన్నారు. ప్రతి రోజు 250 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలు తరలించాల్సి ఉంది. సిబ్బంది ఉన్నారు.. వాహనాలు ఉన్నా.. పర్యవేక్షణ లోపించడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. ఇక పాతబస్తీలో పరిస్థితి చెప్పనలవి కాదు. రికార్డుల్లో మాత్రం చెత్తను నగర శివారలోని గార్గేయపురానికి తరలిస్తున్నా.. నగరం ప్రతి రోజూ కంపు కొడుతోంది.
ప్రయివేట్ టెండర్‌తో కాల్వల శుభ్రం
రెండు వారాల క్రితం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మెయిన్ డ్రైన్‌లను శుభ్రం చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 52 వార్డుల్లో ప్రధాన మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రయివేటు టెండర్ ద్వారా ఈ పనులు నిర్వహిస్తున్నారు. 970 మంది కార్మికులు చేస్తున్న పనినే ప్రత్కేక పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో నగరంలో మళ్లీ డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఇది మూమ్మాటికీ మురుగు నిధుల దుర్వినియోగం కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
తాత్కాలిక ఉద్యోగుల ఇష్టారాజ్యం
కర్నూలు కార్పొరేషన్‌లో సిబ్బంది ఉన్నా పర్యవేక్షణ లేకపోవడంతోనే పారిశుద్ధ్య సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశుద్ధ్య విభాగంలో సిబ్బంది కొరత పేరిట 200 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. రూ.10 వేల వేతనంతో పనిచేస్తున్న వీరు విధుల్లోకి వచ్చినట్లు థంబ్ వేయడం(వేలిముద్ర), ఐరిష్ తీసుకోవడం లేకపోవడంతో విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. ఇదేమని ప్రశ్నించే శానిటరీ సిబ్బందికి రెండు చేతులు తడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఏటా రూ.2 కోట్లు నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేకపోవడం చూస్తే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఉద్యోగుల చిత్తశుద్ధి అర్థమవుతోంది.

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్

కార్పొరేషన్ అధికారుల పనితీరుకు టన్నుల కొద్దీ కదులుతున్