
నీళ్లు కొంటున్నాం
కుళాయిలకు ఐదు రోజులకోసారి నీళ్లను వదులుతున్నారు. అవి కూడా అందుతాయన్న నమ్మకం లేదు. ప్రతి రోజూ నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చుట్టు పక్కల బోర్లలో ఎక్కడా మంచినీళ్లు లేవు. కుళాయిలకు సరిగా నీళ్లు రాక డబ్బులు పెట్టి క్యాన్ల నీళ్లు కొంటున్నాం.
– శ్రీనివాసులు, కొండపేట, కోడుమూరు
సమస్య ఉంది
హంద్రీ నది ఎండిపోవడంతో మంచినీటి పథకాలు సరిగ్గా పనిచేయడం లేదు. హంద్రీలో నీటి కొరత కారణంగా పట్టణంలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. సమస్య పరిష్కారం కోసం కోడుమూరు హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం.
– ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, కోడుమూరు