
అయ్యో పాపం!
మొదటి నలుగురు విద్యార్థులు వెళ్తున్నదృశ్యం
తరువాత మరో ముగ్గురు విద్యార్థులు వెళ్తున్న దృశ్యం
ఆస్పరి: మండలంలోని చిగిళి గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుచున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆరోజు పాఠశాల వదిలిన వెంటనే ఇళ్ల దగ్గర బ్యాగులు పెట్టి నీటి కుంట దగ్గరకు పరిగెడుతు వెళ్తున్న దృశ్యాలు గ్రామానికి చెందిన వలిబాషా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలు వైరల్ అయ్యాయి. చూసిన వారు ‘అయ్యో పాపం చిన్నారులు’ అని అంటున్నారు. వలిబాష అనే వ్యక్తి మెకానిక్ షాపు పెట్టారు. షాపు దగ్గర ఈయన సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. విద్యార్థులు వెళ్లిన దృశ్యాలను ఆయన గ్రామస్తులకు చూపించారు.

అయ్యో పాపం!