
రాయలసీమ ల్యాబ్‌కు రాసిన వాటిలో కొన్ని...
● ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ఈ నెల 17న పద్మావతి (35) అనే రోగికి సీరమ్ ఎలక్ట్రోలైట్స్, థైరాయిడ్ ప్రొఫైల్, సీరమ్ క్రియాటినిన్ పరీక్షలు రాశారు. ఇందుకు రూ.1100 ఛార్జి చేశారు. ఈమెకే పాప్ స్మియర్ పరీక్ష రాయగా రూ.600 వసూలు చేశారు.
● ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భవాని(25) అనే మహిళకు 7వ తేదిన యాంటీ సీసీపీ పరీక్ష రాయగా రూ.1,500 వసూలు చేశారు.
● అలాగే విజయ అనే మహిళకు సీరమ్ ఫెర్రిటిన్ పరీక్ష రాశారు.
● దేవమ్మ(65) అనే వృద్ధురాలికి 12వ తేదీన ఎంఎస్–6 నుంచి పీటీ ఐఎన్‌ఆర్ పరీక్ష రాయగా రూ.400 వసూలు చేశారు.
● స్వరూప అనే శిశువుకు చిన్నపిల్లల విభాగం వారు ఏబీజీ కిట్ పరీక్ష రాశారు.
● చర్మవ్యాధుల విభాగం(డీవీఎల్) నుంచి కాలమ్మ(44) అనే మహిళకు ఇటీవల ఏఎన్‌ఏ ప్రొఫైల్ పరీక్ష రాశారు.
● రేష్మి(34) అనే మహిళకు పీటీ ఐఎన్‌ఆర్ పరీక్ష చేయించారు.
● జనరల్ మెడిసిన్ విభాగం నుంచి అశోక్‌కుమార్ అనే వ్యక్తికి పీటీ ఐఎన్‌ఆర్ పరీక్ష రాశారు.