ప్రభుత్వ స్థలాల అమ్మకాలు! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలాల అమ్మకాలు!

Aug 23 2025 2:04 AM | Updated on Aug 23 2025 2:04 AM

ప్రభు

ప్రభుత్వ స్థలాల అమ్మకాలు!

● మోసపోతున్న ప్రజలు బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం

● మోసపోతున్న ప్రజలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రభుత్వ భూమి ఖాళీ కనిపిస్తే చాలు అంగట్లో వస్తువుల్లాగా లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థలాలు వస్తాయనే ఆశతో చాలా మంది అమాయకులు మోసగాళ్ల మాయ మాటల్లో పడి లక్షలాది రూపాయలు ముట్టజెప్పుతున్నారు. కొలిమిగుండ్లలో కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ వెనుక భాగం, మోడల్‌ స్కూల్‌ సమీపంలో 112, 322 తదితర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. కొంత మంది గ్రూపుగా ఏర్పడి వివిధ గ్రామాల ప్రజలకు మూడు, ఐదు, ఆరు సెంట్ల చొప్పున విక్రయించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రూపు సభ్యులే పదుల సంఖ్యలో బోగస్‌ పట్టాలు ప్రజలకు ఇచ్చి ఏకంగా రిజిస్ట్రేషన్‌లు చేయించారు. అప్పట్లో ఉన్నతాధికారులు వీటిపై విచారణ చేపట్టారు. ఓ వీఆర్వో ప్రమేయం ఉండటంతో సస్పెన్సన్‌ చేశారు. కొద్ది రోజుల నుంచి ఆగ్రూపు సభ్యులే మళ్లీ ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా అమ్మకాలు చేయడం మొదలు పెట్టారు.

ఇంత జరుగుతున్నా తెలియదా?

ప్రభుత్వ స్థలాన్ని ఇళ్ల స్థలాలు, తదితర వాటికి ఇవ్వాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించాకే స్థలాన్ని మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ముఠా సభ్యులు అన్నీ తామై వ్యవహరించి వారి స్వంత ఆస్తులు అన్నట్లుగా ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులకు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల అండదండలతోనే ఈ తంతు జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తున్న ముఠా సభ్యులు రెవెన్యూ సిబ్బంది సంతకాలు, సీళ్లను సైతం పోర్జరీ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ వాళ్లే తయారు చేసి బోగస్‌ అనుబంద పట్టాలను ఇచ్చి ప్రజలతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పదుల సంఖ్యలో సెంట్ల ప్రకారం అమ్మకాలు చేసినట్లు తెలుస్తుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన జనం చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్డడం శోచనీయం. ముఠా సభ్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వ భూమి కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని అమాయక ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మాయ మాటలు చెప్పి ప్రభుత్వ స్థలాలు కొంటే ఏమాత్రం చెల్లుబాటు కావు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని చోట్ల అడ్డుకట్ట వేశాం. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసులు, తహసీల్దార్‌

ప్రభుత్వ స్థలాల అమ్మకాలు! 1
1/1

ప్రభుత్వ స్థలాల అమ్మకాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement