
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల బృందావన దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల రాకతో దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. నిత్య వేడుకల్లో భాగంగా రాయరు ప్రతిమకు ఊంజల మంటపంలో ప్రత్యేక ఆర్జిత సేవలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో రాయరు బృందావన ప్రతిమను రమణీయంగా ఊరేగించారు.
శ్రీమఠం ప్రాంగణంలో భక్తులు

శ్రీమఠంలో భక్తుల సందడి