
వాల్మీకి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
ఆదోని సెంట్రల్: ఎమ్మిగనూరులో నిర్వహించిన కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని, వారు భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూస్తామన్నారు. వాల్మీకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు అభివృద్ధి వైపు నడిచేలా చూస్తామన్నారు. గౌరవాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన టి.బాలవెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఉద్యోగి), అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన బి.మల్లన్న, (ఏడీ, వెటర్నరీశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఆదోనికి చెందిన బి.సుధాకర్‌బాబు (ఉపాధ్యాయుడు), కోశాధికారిగా కోసిగికి చెందిన ఎస్.వెంకటరెడ్డి (ఉపాధ్యాయుడు), ఇతర సలహాదారులు, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. వాల్మీకి ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు హుసేని, ఇతర నాయకులు పులుసు నారాయణ, తిమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రఘునాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.