
నాటుసారా స్వాధీనం
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తన సిబ్బందితో కాల్వ గ్రామ సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబాయి తండాకు చెందిన మాలవత్ ధను నాయక్ ద్విచక్ర వాహనంపై 40 లీటర్ల సారా తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, 40 లీటర్ల సారాను వదిలేసి పారిపోయారు. సారాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి ధను నాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. గుమ్మితం తండాలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపి వార్తే వీరాంజనేయ నాయక్ వద్ద 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ నవీన్‌బాబు, కానిస్టేబుళ్లు మురహరిరాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.