
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్‌ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.