
వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు
● మొదలైన బీటీ పత్తి విత్తన
ప్యాకెట్ల అమ్మకాలు
● పల్లెలకు చేరుతున్న నకిలీ,
లూజు విత్తనాలు
● రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో
పత్తి సాగు అధికం
● తమ ఆధీనంలోని కంపెనీల్లో
వ్యవసాయ శాఖ తనిఖీలు
● ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు
గత ఏడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. బనగానపల్లి, దొర్నిపాడు, ఎమ్మిగనూరు ప్రాంతల్లో నకిలీ విత్తనాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాల అమ్మకాలు, అనధికార విత్తనాలు, స్టాప్ సేల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రూ.2.40 కోట్ల విలువ చేసే పత్తి, ఇతర విత్తనాలు 100.79 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఐదు 6ఏ కేసులు కూడా నమోదయ్యాయి.

వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు