
పాతికేళ్ల తర్వాత..
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఆర్‌సీఎం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం వేడుకగా సాగింది. 1999–20లో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూదూర ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి ఒకరినొకరు పలకరించుకోని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు భాస్కర్‌రెడ్డి, జోజిరెడ్డి, మౌలాళి, ఆంథోనమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజ్‌కుమార్‌రెడ్డి, సుందరయ్యలను ఘనంగా సన్మానించారు.