
నర్సింగ్ పరీక్షల్లో కాపీయింగ్‌కు తావివ్వొద్దు
కర్నూలు(హాస్పిటల్): నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌కు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఎగ్జామినేషన్ హాలులో నిర్వహిస్తున్న జీఎన్‌ఎం సప్లిమెంటరీ పరీక్షలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పారు. పరీక్షలకు చీఫ్ ఎగ్జామినర్‌గా ఆసుపత్రి ఇన్‌ఛార్జి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మజ, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, 14 మంది హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు పరీక్షలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.