
ఉపాధి కూలీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా
కర్నూలు(సెంట్రల్) : ఉపాధి హామీ కూలీలకు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ ఉంటే రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని డ్వామా పీడీ వెంకటరమణయ్య పేర్కొన్నారు. ఇటీవల రుద్రవరం మండల కేంద్రానికి చెందిన అన్నలదాసు జనార్ధన్ కరెంట్ షాక్‌తో చనిపోయారు. అయితే, అతనికి ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ ఉండడంతో రూ.2లక్షల ప్రమాద బీమా మంజూరైంది. శనివారం అన్నలదాసు బాధిత కుటుంబానికి అందుకు సంబంధించిన చెక్కును డ్వా మా పీడీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వలస ప్రభావిత ప్రాంతాల్లో పనులు చేసే కూలీలు అనుకొని ప్రమాదాల్లో మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే బీమాతో పాటు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ బీమా లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు జో నల్ మేనేజర్ ఐత నవీన్ శెట్టి, కర్నూలు జిల్లా మేనేజర్ బి.వీరారెడ్డి, కస్టమర్ గ్రీవెన్స్ మేనేజర్ షేక్ మహ బూబ్ బాషా, ప్రమోటర్ శివమ్మ, వేణు పాల్గొన్నారు.