
కన్నీరు వర్షిం‘చేను’!
కరివేన వద్ద పొలంలో ఇంకా తొలగని వర్షపు నీరు
ఆత్మకూరు మండలం క్రిష్ణాపురం పనికిరాకుండా పోయిన పత్తి పొలం
నీట మునిగి కుళ్లిపోయిన పైర్లు.. నీరు నిలిచి మొలవని విత్తనాలు... పచ్చని మొక్కలు ఎర్రగా మారిన దృశ్యం.. ప్రకృతి వైపరీత్యం అన్నదాతను మరోసారి నిలువునా ముంచేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏక ధాటిగా మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు రైతుల కష్టాన్ని నీటి పాలు చేశాయి. కన్నీటి దిగుబడినే మిగిల్చాయి. జలమయం అయిన వరి పొలాలన్నీ పనికి రాకుండా పోయాయి. పత్తి, మొక్కజొన్న, మినుము, మిరప, వేరుశనగ, ఆముదం, ఉల్లి.. ఇలా అన్ని పంటలు వర్షార్పణం అయ్యాయి. పెట్టుబడి అంతా మట్టిపాలై అన్నదాతకు తీరని శోకమే మిగిలింది.
రుద్రవరంలో మొలకెత్తని చేను
– సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలు

కన్నీరు వర్షిం‘చేను’!

కన్నీరు వర్షిం‘చేను’!

కన్నీరు వర్షిం‘చేను’!

కన్నీరు వర్షిం‘చేను’!