
దేశ రక్షణకు ఇప్పటికై నా సిద్ధమే
నేను 1992లో బీఎస్‌ఎఫ్‌లో చేరా. జమ్మూకశ్మీర్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీలో పనిచేశా. 2013లో రిటైర్డ్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. మా గ్రామం నుంచి ఏటా కొందరు సైన్యంలో చేరి దేశరక్షణలో పాల్గొంటుండటం గర్వకారణం. అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టడించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యంలో 21 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. దేశ భద్రత కోసం బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధమే. – మండపాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ జవాన్, అమినాబాద్