
భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
● శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి
ఉయ్యాలవాడ: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని శృంగేరి పీఠాధిపతి పురుషోత్తమ భారతీ మహాస్వామి ప్రభోదించారు. గోవిందపల్లె గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ధార్మికోపన్యాసంలో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు చెప్పి జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమన్నారు. తల్లిదండ్రులను ప్రేమించలేని, గౌరవించలేని వారు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగినా వృథా అన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం, పుణ్య కార్యక్రమాలకు వెచ్చించాలన్నారు. కార్యక్రమంలో వేద పండితులు దక్షిణామూర్తి, గ్రామ సర్పంచ్ చామల ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి