తల్లిదండ్రులకు చెంతకు చేరిన బాలుడు
వెల్దుర్తి: పట్టణంలోని 9వ వార్డు ముల్ల గేరిలో నివాసముంటున్న మూడేళ్ల బాలుడు అభిరామ్ శనివారం మధ్యాహ్నం తప్పిపోయి కొన్ని గంటల్లోనే తల్లితండ్రులు పరుశరాముడు, లుఽథియాల చెంత చేరాడు. వివరాలు.. అభిరామ్ తన ఇంటి ముందు ఆడుకుంటూ బంధువుల యువకుడితో కలిసి అరకిలోమీటర్ దూరంలోని పోలీస్‌స్టేషన్ సమీప దుకాణానికి వెళ్లాడు. ఆ యువకుడు వెళ్లిపోవడంతో అభిరామ్ ఒక్కడై డోన్ వైపు దారి వెంట ఏడ్చుకుంటూ తిరిగాడు. అక్కడున్న వారు బాలుడ్ని చేరదీసి పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించారు. ఎస్‌ఐ అశోక్ సలహా మేరకు బాలుడి ఫొటోను వాట్సాప్‌లో ఉంచగా తల్లితండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారు పోలీస్‌స్టేషన్ చేరుకుని పిల్లవాడ్ని ముద్దాడుతూ ఊపిరి పీల్చుకున్నారు.


