
వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింపర్సనల్ లా బోర్డు రాష్ట్ర కన్వీనర్ రఫిక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏక్యాంపులోని ఎంఎంఐ షాదీఖానాలో సయ్యద్ జాకీర్ మౌలానా రషీద్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు, న్యాయవాది సుబ్బయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్‌ఎండీ షరీఫ్, మైనార్టీ నాయకుడు షేక్ హఫీజ్, ఇలియాజ్, సమాచారహక్కు నాయకులు జయన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కిరణ్, కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జ్ అమానుఉల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫిక్ అహ్మద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25 మానవహారం, 27న ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని, జూన్ 3న మహిళలతో సమావేశం ఉంటుందని తెలిపారు.