పట్టుబడిన యువకుడు
డోన్ టౌన్: పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న శ్రీనివాస నగర్‌లో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించా రు. కామగానికుంట్ల గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాసనగర్‌లో ఓ ఇంటికి తాళం వేసి ఉండగా శని వారం పట్ట పగలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అంతలోనే ఇంటి యజమానులు తిరిగి రావడంతో యువకుడిని కాలనీవాసుల సహాయంతో పట్టుకున్నారు. చెట్టుకు కట్టివేసి పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
స్నేహితులకు ఆర్థిక సాయం
కొలిమిగుండ్ల: ఒకే పా ఠశాలలో చదువుకు న్న స్నేహితులు పేదరికంతో ఆర్థిక సమస్యల తో ఇబ్బందులు పడుతుండటంతో ఓ స్నేహితురాలు ఆర్థిక సాయం అందించింది. కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో 2002–03 పదో తరగతి బ్యాచ్ శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొలిమిగుండ్లకు చెందిన కత్తి సునీత తన స్నేహితులు మీర్జాపురానికి చెందిన గోపాల్‌కు రూ.30వేలు, కనకాద్రిపల్లెకు చెందిన శ్రీలక్ష్మికి రూ.20 వేలు అందించారు.
పట్టుబడిన యువకుడు


