భక్తకోటి ప్రణమిల్లి..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలో వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో మారుమోగింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయాలు ఇల వైకుంఠాన్ని తలపించాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక సెట్టింగ్‌లు ఆకట్టుకున్నాయి. ఉత్తర ద్వారంలో శ్రీహరిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులుదీరారు. పలు ఆలయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
ప్రత్యేక అలంకరణలో శ్రీ వెంకటేశ్వరస్వామి
భక్తకోటి ప్రణమిల్లి..


