పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గత నెలలో మూడో సెమిస్టర్ పరీక్షల నిర్వహించామన్నారు.ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ విద్యార్థు లు 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, ఆర్థిక శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యాపకులు డాక్టర్ దళవాయి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బస్టాండ్‌లలో మౌలిక
వసతులు కల్పిస్తాం
పత్తికొండ: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్‌లలో మౌలిక వసతులు కల్పిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం ఆయన పత్తికొండలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్టీసీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బస్డాండ్‌లో సమస్యలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ–ఎమ్మిగనూర్‌కు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఎక్కి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. పత్తికొండ పర్యటనకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీని ప్రజా సంఘాల నాయకులు కలిసి పత్తికొండ నుంచి ఇతర ప్రాంతాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందచేశారు. ముఖ్యంగా విజయవాడ, ప్రొద్దుటూరుకు నూతన సర్వీసులు నడపాలని కోరారు. అనంతరం ఆయన పత్తికొండ డిపోలో ఉద్యోగులతో సమావేశమయ్యారు.
దేవనకొండ: ‘ఉదయం 9.30 గంటలవుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో ఎందుకు పిల్లలు లేరు. వచ్చిన ఒక్క పాప ఏ, బీ, సీ, డీలు కూడా చెప్పలేకపోతోంది. పిల్లలకు చదువు చెప్పడం ఇలాగేనా? ’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అంగన్‌వాడీ టీచర్‌ను ప్రశ్నించారు. మంగళవారం మాచాపురం అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్లను యాసిడ్‌తో శుభ్రం చేయించాలన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడా రు. సచివాలయానికి సిబ్బంది సక్రమంగా వస్తున్నారా, పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారా, పెన్షన్ ఇచ్చే సమయంలో డబ్బు వసూ లు చేస్తున్నారా, ప్రతిరోజు పారిశుద్ధ్య సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఐసీడీఎస్ పీడీ విజయ తదితరులు ఉన్నారు.
లైఫ్ సర్టిఫికెట్లు
అప్‌లోడ్ చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్‌దారులు జీవన ప్రమాణ పత్రాలు(లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలి పారు. కర్నూలు జిల్లాలో 17,440 మంది, నంద్యాల జిల్లాలో 10,925 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల్లో సమర్పించిన జీవన్ ప్రమాణ్ పత్రాలు చెల్లుబాటు కావన్నారు. ఫిబ్రవరి నెల చివరిలోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఏప్రిల్ 1న చెల్లించే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. అనారోగ్యంతో నడువలేని పింఛనుదారులు ఉన్న ట్లు సమాచారం ఇస్తే సంబంధిత సబ్ ట్రెజరీ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాలు జారీ చేస్తారన్నారు.
పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల


