
శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్‌ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు.