సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సెస్ అసోసియేషన్ రూమ్‌ను మరమ్మతు చేయించాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా హెడ్‌నర్సు, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు పెంచాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులకు ఐదు రోజులు అదనపు క్యాజువల్ లీవ్‌లు మంజూరు చేయాలి. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులను రెగ్యులరైజ్ చేయాలి. వారికి వంద శాతం వేతనం ఇవ్వాలి.
–శాంతిభవానీ, ఉపాధ్యక్షురాలు, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం, కర్నూలు
ఎంతో సంతృప్తి
నేను 2020 నుంచి మేల్ నర్సుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నా. మధ్యలో కోవిడ్ సమయంలో కర్నూలులోని టిడ్కో గృహాల్లో కోవిడ్ డ్యూటీ చేశా. ఆ సమయంలో రోగులకు అందించిన సేవలు మరువలేనివి. ఎంతో ధైర్యం, మనోనిబ్బరంతో వారికి ధైర్యం చెబుతూ వైద్యసేవలు అందించా. ఆ తర్వాత తిరిగి గోనెగండ్ల పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సుగా చేరి, ప్రస్తుతం కోసిగి పీహెచ్‌సీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నా. ఇక్కడ ప్రతిరోజూ 150 మంది దాకో ఓపీ రోగులు వస్తుంటారు. వారందరికీ ఎంతో ఓపికతో వైద్యసేవలు అందిస్తున్నా.
–పి. సుధాకర్, మేల్ నర్సు, కోసిగి పీహెచ్‌సీ
సమస్యలు పరిష్కరించాలి


