
అమ్మ ప్రేమ గెలిచింది!
నంద్యాల: బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు.
మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యతి్నంచాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి.