
భక్తులూ జర భద్రం!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శిఖరేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్ రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ రైలింగ్ విరిగిపోయినా దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు శిఖరేశ్వర దర్శనం తప్పనిసరిగా చేసుకుంటారు. శిఖరేశ్వరంపై ఉన్న నందికొమ్ముల నుంచి మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖర కలశాలను దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. శిఖరేశ్వరం వద్ద మెట్లు ఎక్కలేని వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల కోసం ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.

భక్తులూ జర భద్రం!