
సైకిల్‌పై శక్తిపీఠాల సందర్శన
ఆత్మకూరురూరల్: మండువేసవిలో సైకిల్‌పై ప్రయాణం ఎంత కష్టం. కాని ఆయన సంకల్ప శక్తికి మండే సూర్యుడు కూడా చల్లబడ్డాడేమోననిపిస్తోంది. షిరిడీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి దేశం నలుమూలలా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలను సైకిల్‌పై ప్రయాణిస్తూ సందర్శిస్తున్నారు. శ్రీశైలంలో వెలసిన శ్రీ భమరాంబిక శక్తి పీఠాన్ని సందర్శించుకుని మరో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దర్శనానికి వెళ్తూ శుక్రవారం మార్గమధ్యలో ఆత్మకూరులో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గత జనవరి నుంచి ఉత్తరభారతదేశంలోని శక్తిపీఠాలన్నింటిని సైకిల్ యాత్రలో దర్శించుకుని దక్షిణ దేశానికి చేరుకున్నానన్నారు. శ్రీలంకకు కూడా వెళ్లాల్సి ఉందని ఆయన తెలిపారు.
798 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో 798 మంది గైర్హాజరయ్యారు. 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 8,376 మందికి 7,632 మంది హాజరు కాగా 744 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు మొత్తం ఇద్దరు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 589 మందికి 535 మంది హాజరు కాగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
వేసవి సెలవుల్లో
చిన్నారులు జాగ్రత్త
● జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ
కర్నూలు(అగ్రికల్చర్): వేసవి సెలవుల్లో చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వాగులు, వంకలు, చెరువులు, బావుల్లోకి వెలుతుంటారని, అటువంటి సమయంలో వారిపై కుటుంబీకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విపత్తుల నిర్వహణ అఽథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ సూచించారు. వేసవి ఎండల తీవ్రత మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం డీపీఎం అనుపమ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ నెల చివరి వర కు ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల చివరి వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్‌లు, గర్భిణులు, బాలింతలు బయట తిరగరాదని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా గొడుగు ధరించాలన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ఆరుబయట ఉండరాదని, చెట్లు, టవర్లకు సమీపంలో ఉండకూడదని తెలిపారు. అకాల వర్షాల సమయంలో సురక్షితమైన భవనాల్లో ఉండాలని పేర్కొన్నారు.

సైకిల్‌పై శక్తిపీఠాల సందర్శన