
నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది
16 ఏళ్ల నుంచి ఆధునిక నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారు కొందరు డ్యాన్స్ అకాడమీలను స్థాపించుకున్నారు. మరికొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్యాన్స్ మాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో తృప్తిగా ఉంది.
– రాజాహుసేన్, డ్యాన్స్ మాస్టర్
నృత్యం నేర్చుకుంటున్నా
ఆరేళ్ల నుంచి వేసవిలో నృత్యం నేర్చుకుంటున్నాను. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. బాగా నేర్పుతున్నారు. జూన్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుందంటా. అందుకే బాగా నేర్చుకుంటున్నాను.
– గోవర్ధిని, శిక్షణ పొందుతున్న విద్యార్థిని
భవిష్యత్తులోనూ నేర్పిస్తా
ఎక్కువ మంది చిన్నారులు ఆధునిక నృత్యంపైనే ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదేళ్ల చిన్నారులు కూడా హుషారుగా, ఎంతో జోష్‌తో పాల్గొంటున్నారు. ఫీజు లేకపోయినా సరే చిన్నారులకు నేర్పుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మున్ముందు కూడా చిన్నారులకు డ్యాన్స్ నేర్పిస్తా.
– డాక్టర్ లలితాసరస్వతి,
భరతనాట్యం డ్యాన్స్ మాస్టర్

నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది

నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది