
డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల ఐక్య వేదిక బుధవారం చేపట్టనున్న డీఈఓ ఆఫీస్ ముట్టడి వాయిదా పడింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్‌తో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఇతర ప్రతిపాదనలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు ఐక్య వేదిక నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ముట్టడి నిర్ణయాన్ని వాయిదా వేశామన్నారు.
ఐఐటీ/నీట్ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష
కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/నీట్ అకాడమీల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ లేదా పాత హాల్‌టికెట్‌తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. వీరికి 50 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని, పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం http://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీసీఓ కోరారు.
మైనారిటీలకు సబ్సిడీ రుణాలు
● దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https://apobmms.apcfss.in) వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
కేజీబీవీల్లో మూడు విడతల్లో సీట్ల కేటాయింపు
కర్నూలు సిటీ: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 6, 7, 8, 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు విడతల్లో సీట్లు కేటాయించినట్లు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఆయా కేజీబీవీల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు తెప్పించుకుని నిర్ధారించుకున్నారన్నారు. 6నుంచి 9వ తరగతి వరకు అన్ని సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్‌లో 73 సీట్లు, ఎంపీసీలో 191 సీట్లు, ఎంఈసీలో 18 సీట్లు, ఒకేషనల్ గ్రూప్‌లో 79 సీట్లు ఖాళీ ఉన్నట్లు డీఈఓ వెల్లడించారు.
గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి
పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్‌ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్‌మెంట్ పనులు పూర్తి చేస్తేనే గోరుకల్లు రిజర్వాయర్‌లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్, డీఈఈలు జ్యోతి, గీతారాణి, శివప్రసాద్, ఏఈఈలు పాల్గొన్నారు.