ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం

May 20 2025 1:26 AM | Updated on May 20 2025 1:26 AM

ఆదోని

ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం

ఆదోని టౌన్‌: మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 మంది పాలకవర్గ సభ్యుల ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది. ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీహెచ్‌ లోక్వేరి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఆదోని సబ్‌కలెక్టర్‌ భరద్వాజ్‌, ఎన్నికల అబ్జర్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిల్‌లో 42 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా అందులో ఐదుగురు బీజేపీలోకి వెళ్లగా, ఒకరు టీడీపీ కౌన్సిలర్‌ ఉన్నారు. మిగిలిన 36 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లుగా ఉన్నాయి. సీహెచ్‌ లోకేశ్వరిని చైర్‌పర్సన్‌గా 36వ వార్డు కౌన్సిలర్‌ సందీప్‌రెడ్డి ప్రతిపాదించగా 40వ వార్డు కౌన్సిలర్‌ ఫయాజ్‌అహ్మద్‌ బలపరిచారు. దీంతో సిహెచ్‌ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ ప్రకటించారు. అబ్జర్వర్‌ అయిన జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌లు చైర్‌పర్సన్‌గా సి.హెచ్‌.లోకేశ్వరి ఎన్నికై నట్లు ఎన్నిక నియామక పత్రాన్ని అందజేశారు. కమిషనర్‌ ఎం.కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ ప్రమాణస్వీకారం చేయించారు.

వైఎస్సార్సీపీ కార్యాలయం

నుంచి బస్సులో....

ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి 35 మంది కౌన్సిలర్లు బస్సులో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు విచారణ అనంతరం కౌన్సిల్‌హాల్‌కు చేరుకున్నారు. కౌన్సిల్‌లో ఆల్ఫాబెట్‌ ప్రకారం సీట్లను కేటాయించారు. వారివారి సీట్లలో కౌన్సిలర్లు కూర్చొని ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న సీహెచ్‌ లోకేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మహాయోగి లక్ష్మమ్మవ్వను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి ఆశీస్సులు పొందారు.

రుణపడి ఉంటా

వాల్మీకి వర్గానికి చెందిన తనను ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి రుణపడి ఉంటానని

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీహెచ్‌ లోక్వేరి తెలిపారు. ఆదోని ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతపరంగా పరిష్కరిస్తానని తెలిపారు.

ప్రలోభాలకు లొంగలేదు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో ఆదోని చరిత్ర తిరగరాసిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. పాలకవర్గ సభ్యులు మాటకు కట్టుబడి వైఎస్సార్సీపీలోనే ఉంటూ చైర్‌ పర్సన్‌ ఎన్నికను ఏకగ్రీవంగా చేశారన్నారు. కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేసినా లొంగలేదన్నారు. ఒక్కరు కూడా పార్టీని ఫిరాయించకుండా, ప్రలోభాలకు లొంగకుండా సత్తా చాటారన్నారు.

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

36 మంది పాలకవర్గ సభ్యుల

ఆమోదం

చైర్‌పర్సన్‌గా సీహెచ్‌ లోకేశ్వరి

ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం1
1/1

ఆదోనిలో వైఎస్సార్సీపీ ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement