మోసం చేశారు.. న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

మోసం చేశారు.. న్యాయం చేయండి

May 20 2025 1:26 AM | Updated on May 20 2025 1:26 AM

మోసం చేశారు.. న్యాయం చేయండి

మోసం చేశారు.. న్యాయం చేయండి

కర్నూలు: నమ్మంచి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని ప్రజలు సోమవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను కోరారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి వారితో ఎస్పీ మాట్లాడారు. మొత్తం 128 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

జీతాలు కూడా ఇవ్వకుండా..

వెల్దుర్తి, చిట్యాల, సూదేపల్లె, అమకతాడు పాఠశాలల్లో అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణగిరి గ్రామానికి చెందిన ఆవుల రామాంజనేయులు నమ్మించారు. మొత్తం ఏడుగురు నుంచి రూ.10 లక్షలు డబ్బులు తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారు. ఏడు నెలల పాటు ఆయా పాఠశాలల్లో పని చేయించుకుని జీతాలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని డోన్‌ మండలానికి చెందిన ఎరుకలి శేషన్న సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మోసాల్లో కొన్ని..

● ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యాపారి 95 కిలోల నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశాడని వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి గ్రామానికి చెందిన నాగమల్లారెడ్డి ఫిర్యాదు చేశారు.

● ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక వ్యక్తి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని మోసం చేశాడని గూడూరుకు చెందిన యుగంధర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.

● తమ్ముడు విరుపాక్షితో కలసి డబ్బులు అవసరముందని, బంగారు ఆభరణాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాం. తిరిగి రుణం చెల్లించడానికి వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు గతంలోనే రిలీజ్‌ చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారని, సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు.

● కర్నూలు మార్కెట్‌ యార్డులో 50 మంది కమీషన్‌ ఏజెంట్ల నుంచి రూ.1.80 కోట్లు విలువ చేసే ఉల్లి సరుకు తీసుకుని ఆనియన్‌ ట్రేడర్స్‌ వారు డబ్బులు ఇవ్వడం లేదని కర్నూలు బుధవారపేటకు చెందిన సాంబశివుడు ఫిర్యాదు చేశారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

పీజీఆర్‌ఎస్‌కు 128 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement