
జిల్లాలో విస్తారంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు మంత్రాలయం, చిప్పగిరి మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 12.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలతోపాటు గాలుల తీవ్రతతో జిల్లాలో అరటి, మునగ పంటలకు నష్టం జరిగింది. అయితే ఉద్యాన అధికారులు మాత్రం అరటి ఒక హెక్టారు, మునగ ఒక హెక్టారులో మాత్రమే దెబ్బతిన్నట్లుగా తేల్చారు.
జీడీపీలోకి వరద నీరు
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ (జీడీపీ)లోకి వరద నీరు వచ్చి చేరుతున్నటున్ల ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 880 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కాగా.. గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు 4.5 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉంది.