
దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు
కర్నూలు(సెంట్రల్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ల్యాప్‌టాప్‌లను ఇద్దరు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అందజేశారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖసహాయ సంచాలకులు రయూస్ ఫాతిమా పాల్గొన్నారు.
రేషన్ బియ్యం కోసం ధర్నా
ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 80 కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు 3,436 మందికి గాను 2,248 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
సీఐడీ నుంచి
10 మంది వెనక్కి
కర్నూలు: సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 10 మంది సిబ్బంది తిరిగి యధాస్థానానికి వచ్చారు. సోమవారం ఎ స్పీ దగ్గర హాజరుకావడంతో తిరిగి వారికి పోస్టింగ్ కేటాయించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
పొగాకును కొనుగోలు చేయాలి
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పొగాకు దిగుబడులను కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు బేళ్లను వెనక్కు పంపకుండా ఒప్పందం మేరకు క్వింటా రూ.18,500తో కొనుగోలు చేయాలన్నారు.

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు