
ప్రాణం తీసిన ఇనుప కడ్డీలు
మంత్రాలయం రూరల్: ఇనుప కడ్డీలు మీద పడి వెల్డింగ్ కార్మికుడు గొల్ల పవన్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ శివాంజల్ తెలిపిన వివరా లు ఇవి.. నందవరం మండలం నదికై రవాడి గ్రామానికి చెందిన గొల్ల పవన్ మంత్రాలయంలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. సోమవారం పనుల నిమిత్తం ఎమ్మిగనూరుకి వెళ్లి ఆటోలో ఇనుప కడ్డీలు తీసుకువచ్చాడు. మంత్రాలయంలోని పరిమళ లాడ్జ్ సమీపంలో ఆటో టైర్ బురదలో కూరుకుపోయింది. అక్కడ ఉన్న కొంత మందితో ఆటోను బురదలోంచి పైకి ఎత్తడంతో ముందుకెళ్లి బోల్తా పడింది. వెనుక భాగంలో ఉన్న గొల్ల పవన్‌పై ఆటోపై ఉన్న ఇనుప కడ్డీలు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. గొల్ల పవన్‌కు భార్య గొల్ల పవిత్ర, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.