
22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు సంఘం నేతలు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్యదర్శి అనిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన మేరకు ఈ నెల 5వ తేదీలోపు తమకు అందిన మార్కుల జాబితాలు, కుల ధ్రువీకరణ పత్రాల మేరకు ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. పెద్దపాడు రోడ్డులోని బీరప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.