
ఖర్చు పెరిగింది
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. వీటికి తోడు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ తీసుకున్నా కిలో ధర రూ. 50 పైగా ఉంది. మా కుటుంబానికి నెలకు రూ. 15,000 ఆదాయం ఉంది. ఇందులో కూరగాయలు, నిత్యావసర వస్తువులకే రూ.6,000 వరకు ఖర్చు అవుతుంది. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే రూ.2000 వరకు ఖర్చు పెరిగింది. ప్రభుత్వం చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి.
– నిర్మలభాయి, కృష్ణానగర్, కర్నూలు
కొనలేం తినలేం
ధరలు పెరగడంతో కూరగాయలు కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబానికి ఆదాయం పెరగడం లేదు. నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, వంటనూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. నెలకు నాలుగైదు వేల రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయి. ప్రభుత్వం ధరల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
– కె. రత్నమ్మ, కర్నూలు

ఖర్చు పెరిగింది