
శ్రీమఠం... భక్తజన సంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయానికి కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగాతీరం, మధ్వ కారిడార్, నది కారిడార్, మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. మూలబృందావన దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజన, పరిమళ ప్రసాదం కౌంటర్లు రద్దీగా దర్శనమిచ్చాయి. ముందుగా భక్తులు గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో పురవీధులు కళకళలాడాయి.
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.

శ్రీమఠం... భక్తజన సంద్రం

శ్రీమఠం... భక్తజన సంద్రం