
అసలు, వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా పంట రుణం
● గత ఏడాది కలసిరాని వ్యవసాయం
● అప్పుల్లో కూరుకుపోయిన రైతులు
● బ్యాంకుల తీరుతో దిక్కుతోచని స్థితి
● వడ్డీకి ఇస్తామని తిష్టవేసిన దళారీలు
● ఇంటెన్సివ్ ఉన్నా వడ్డీ వసూలు
● రైతు సంక్షేమాన్ని విస్మరించిన
ప్రభుత్వం
అప్పులు తెచ్చి కట్టాల్సిందే..
గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8లక్షల వరకు పంట రుణం తీసుకున్నా. పత్తి, కంది, ఉల్లిగడ్డలు తదితర పంటలు సాగు చేస్తున్నాం. ప్రస్తుతం క్రాప్‌లోన్ రెన్యూవల్ చేసుకుందామని బ్యాంకుకు పోతే అసలు, వడ్డీ మొత్తం చెల్లించాలంటున్నారు. ఇంత మొత్తం కట్టాలంటే అప్పు చేయక తప్పదు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం చేయలేం.
– పరమేశ్వరరెడ్డి, రేమడూరు,
కల్లూరు మండలం
అసలు, వడ్డీ చెల్లించాల్సిందే..
గత ఏడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలు, బంగారంపై పొందిన వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అసలు, వడ్డీ చెల్లించాల్సిందే. అప్పు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే కొత్తగా పంట రుణం ఇస్తారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆర్‌బీఐని ఎస్‌ఎల్‌బీసీ కోరుతోంది. కొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ కట్టించుకొని రెన్యూవల్ చేస్తున్నాయి.
– రామచంద్రరావు, ఎల్‌డీఎం, కర్నూలు
పంట రుణాల కోసం వెల్దుర్తి యూనియన్ బ్యాంక్‌కు తరలి వచ్చిన రైతులు

అసలు, వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా పంట రుణం

అసలు, వడ్డీ చెల్లిస్తేనే కొత్తగా పంట రుణం