జిల్లా అంతటా అప్రమత్తం
కర్నూలు: దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులతో ఆదివారం జిల్లా అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావులేకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు సాగుతున్నాయి. ముఖ్యంగా రవాణా వాహనాలపై దృష్టి సారించారు. పార్సల్ కార్యాలయాలు, మార్కెట్ల నుంచి సరుకులు తరలించే వాహనాలను క్షుణంగా తనిఖీ చేశారు.
తనిఖీలు ఇలా..
జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వ్యాపార వాణిజ్య సముదాల ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసపుకోని విచారిస్తున్నారు. కర్నూలు రైల్వే స్టేషన్‌లో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శ్రీధర్, నాగరాజారావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లను అప్రమత్తం చేసి వారికి ముందస్తూ జాగ్రత్తల గురించి తెలియజేశారు. యాంటీసబోటేజ్(విధ్వంస వ్యతిరేక)తనిఖీ చేపట్టారు. అదే సమయంలో కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో అగుగడుగున తనిఖీలు చేసి అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు తారస పడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తనిఖీలు నిర్వహించిన పోలీసులు


