
ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగస్వామి ఉరుసు సందర్భంగా శనివారం సాయంత్రం ఫక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే గంధం కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫక్కీర్లు స్థానిక పీర్లకట్టా వద్దకు చేరుకున్నారు. వీరిని దర్గా ధర్మకర్త, వారి శిష్యరిక బృందం ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ, పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీలు ఫక్కీర్లకు స్వాగతం పలికారు. ఊరేగింపులో వారు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం దర్గాలో ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి నిర్వహించిన ఖవ్వాలి పోటీలు భక్తులను అలరించాయి. ఆదివారం తెల్లవారు జామున గంధం కార్యక్రమం వైభవంగా జరుగుతుందని ధర్మకర్త సయ్యద్ మున్న పాషా తెలిపారు.