
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.
అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది.