
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట
కర్నూలు: నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల అధికారులు, దర్యాప్తు అధికారులు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. హత్య, ఫోక్సో కేసులు, సైబర్ క్రైం వంటి నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి, ఏపీపీ ఖాదర్ బాషా, డాక్టర్ రంగయ్య, డీఎస్పీలు, ఫోరెన్సిక్ నిపుణులకు పోలీసు అధికారులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, వెంకటరామయ్య, రామాంజి నాయక్, ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ డాక్టర్ ఎస్.అసీం బాషా, డాక్టర్ ఎం.కిషోర్ కుమార్‌రెడ్డి, జి.శ్యాం ప్రసాద్, కుమారస్వామి, జీజీహెచ్ డాక్టర్లు, పీపీలు, ఏపీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఫోరెన్సిక్ విభాగం, ఫింగర్ ప్రింట్స్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట