
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి జయకేతనం
మద్దికెర: వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన కవిరెడ్డి కృష్ణ మద్దికెర ఉపసర్పంచ్‌గా సోమవారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రంగస్వామి ప్రకటించారు. పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా 18 పంచాయతీ సభ్యులకు గాను 14 మంది హాజరయ్యారు. ఉపసర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణను సభ్యులు కోలి మల్లికార్జున ప్రతిపాదించగా 12 మంది చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌నాయక్ బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ సుహాసిని, కార్యదర్శి శివకుమార్ సభ్యులు బాలచంద్ర, వరప్రసాద్, కిట్టి, సుధాకర్, జంబునాథ్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో సంబరాలు
ఉప సర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ను ఘనంగా సన్మానించి గ్రామ వీధులు గుండా ఊరేగింపు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతన్న, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, ఆంజనేయులు, కృష్ణ, మంజునాథ్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మద్దికెర ఉపసర్పంచ్‌గా కవిరెడ్డి కృష్ణ