
సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నందికొట్కూరు: నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తప్పవని అసిస్టెంట్ ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ రాముడు హెచ్చరించారు. శుక్రవారం పట్టణ పరిధిలోని నీలిషికారిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి 3,810 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 35 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. అనంతరం నీలిషికారులతో ‘నాటు సారా తయారు చేయం.. విక్రయించం’.. అంటూ ప్రతిజ్ఞ చేయించారు. 2.0 కార్యక్రమంపై నీలిషికారులకు అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాషిణి, మారుతి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రమేష్, ఎకై ్సజ్ సీఐలు రామాంజనేయులు, విజయకుమార్, ఎస్‌ఐలు జఫ్రూల్లా, శ్రీనివాసులు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.