
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సంజామల: మండల పరిధిలోని మెట్టుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవుకు పట్టణానికి చెందిన మూడవత్ రసూల్ నాయక్ (56) ఉదయం రామాపురం వద్ద ఉన్న టన్నెల్ వద్దకు పనికి వెళ్తున్నాడు. మెట్టుపల్లె సమీపంలో బైక్‌పై వెళ్లున్న రసూల్ నాయక్‌ను ఎదురుగా వచ్చిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు జనార్ధన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.